కావలిసిన పదార్ధాలు:
సొరకాయలు (చిన్నముక్కలు), పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కారం, చింతపండు పులుసు, ఉప్పు, బెల్లం, పసుపు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిరేకులు, కరివేపాకు, కొత్తిమీర.
తయారుచేసే విధానం:
ముందుగా కుక్కర్ లో సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ,కారం, చింతపండు పులుసు,ఉప్పు ,బెల్లం పసుపు ఇవన్నీ వేసి 2 విజిల్స్ వచ్చేదాకా వుడకనివ్వాలి. తరువా బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిరేకులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇందులో ఉడకబెట్టిన ఈ మిశ్రమాన్ని పోయాలి. 2 నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత కొత్తిమీర వేయాలి. అంతేనండీ సొరకాయ పులుసు రెడీ!!.....
ఈ సొరకాయ పులుసు ముద్దపప్పుతో తింటే చాలా రుచిగా వుంటుంది..