అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

లక్కోజు సంజీవరాయ శర్మ నవంబర్ 27, 1907 లో జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కడప జిల్లాలోని ప్రొద్దుటూరు తాలూకా, కల్లూరు గ్రామంలో జన్మించారు. వీరి తల్లి నాగమాంబ, తండ్రి పెద్ద పుల్లయ్య గారు. పుట్టి గుడ్డి కావటంలో కొందరు బందువులు నోట్లో వడ్ల గింజలు వేశారట.

పుట్టు గుడ్డిగా ఉన్నా, బడికి వెళ్ళకపోయినా, ఎన్నో కష్ట నష్టాలు ఓర్చినా, కటిక దరిద్రం అనుభవించిన, లోకాదరణకు ఆట్టే నోచుకోకపోయినా, వినికిడితో, ఊహతో ఈ లోకం పోకడ తెలుసుకుని, అఖండమైన స్వయం కృషితో, గణితవిద్య ఉపాసించి అలవోకగా అనేక సంక్లిష్టమైన సమస్యలను పూర్తి చేసి, వాటిని ధారాణాశక్తితో రంగరించి అప్పచెప్తూ, గణితావధానాలు చేసి, తనకూ, తెలుగు జాతికి అఖండ కీర్తి సంపాయించి పెట్టారు గణిత బ్రహ్మ, గణితావధాని అంక విద్యాసాగర - డాక్టర్ లక్కోజు సంజీవారాయ శర్మ గారు.

ఈ జన్మ వృధా అన్న తలంపే రానీకండా, శ్రవణంతో ఊహా లోకాన్ని నిర్మించుకుని, భావజాలంతో గణితలోకాన్ని సృష్టించి, ఆపర సరస్వతిని తన మనాస్పటాలయంలో ప్రతిష్ఠించుకుని, సరస్వతీ అనుగ్రహం సంపాదించుకుని, స్వయం కృషితో, కనీ వినీ ఎరుగన రీతిలో గణితావధానం చేసిన మహానుభావుడు - గణితబ్రహ్మ, గణితావధాని, విశ్వసంఖ్యాచార్య డాక్టర్ లక్కోజు సంజీవరాయ శర్మ గారు. పద్నాలుగు బంగారు పతకాలు సాదించారు ఈ గణిత విద్యాశాగరుడు. .

లక్కోజు గణిత గారిడీలు:

1966 డిసంబరు ఏడో తేదీ - హైద్రాబాదులోని శ్రీ కృష్ణరాయాంధ్ర భాషానిలయం వేదిక - సభా స్థలిలో వచ్చిన ప్రశ్న 2 [103] ( 2 తొ థె పౌఎర్ ఒఫ్ 103) ఎంత? ముప్పై రెండు అంకెలున్న సంఖ్యను టక్కున చెప్పారు అవధాని గారు. ఇలా కొన్ని వేల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 1928 నవంబరు 15 న నంద్యాల నగరంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభలో గణితావధానం చేశారు.చకితులని  ఎందరినో ఆశ్చర్య  చకితులని చేశారు.నాలుగు వేల ఏళ్ళక కాలెండర్ ప్రటించారు సంజీవరాయ శర్మ గారు.

వీరు పుట్టు గుడ్డి కావడం చేత బడికి వెళ్ళలేదు. ఆ రోజులలో వస్తులు లేవు. స్తోమత అంతకన్నా లేదు మరి!. వినికిడి జ్ఞానంతో, గణితాధాయనం చేశారు. చిన్న చిన్న సమస్యలను పూరించారు. అలా విషయాలను తన మనసులోనే నెమరవేసుకుంటూ, వాటిని ఆకళించుకుని, తన గణితాభ్యాసానికి ఇంకా పదును పెట్టి, అంచలంచలుగా ఎదిగిన గణిత విద్యాశారధుడు. గణిత విద్యా ప్రదర్శనలు ఇస్తున్న క్రమంలో వయొలిన్ పట్ల ఆకర్షితులై అదీ నేర్చుకున్నారు. వినికిడితో సంగీత విద్యనుకూడా నేర్చుకోగలిగారు.

1997 డిసెంబరు రెండున పేదరికంలో అస్తమించారు సంజీవరాయ శర్మ గారు. చివరి రోజులలో శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిదిలో వయొలిన్ మీటుతూ స్వామి సంగీతార్చన చేస్తూ గడిపారు. పుట్టు గుడ్డిగా ఉన్నా, బడికి వెళ్ళకపోయినా, ఎన్నో కష్ట నష్టాలు ఓర్చినా, కటిక దరిద్రం అనుభవించిన, లోకాధరణకు నోచుకోకపోయినా, వినికిడితో, ఊహతో ఈ లోకం పోకడ తెలుసుకుని, అఖండమైన స్వయంకృషితో, గణితవిద్య ఉపాసించి అలవోకగా అనేక సంక్లిష్టమైన సమస్యలను పూర్తి చేసి, వాటిని ధరాణాశక్తితో రంగరించి అప్పచెప్తూ గణితావధానాలు చేసి, తన పాండిత్య ప్రకర్షలను గణితావధానలో ప్రదర్శించి, పద్నాలుగు బంగారు పతకాలు అందుకుని తనకూ, తెలుగు జాతికి అఖండ కీర్తి సంపాయించి, ఈ లోకాన్ని చూడకండానే నిష్క్రమించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా అందుకున్నారంటే, అది ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షమే. ఇలాటి మహత్తర వ్యక్తిని గౌరవించిన వారిని అధినందించక తప్పదు. శ్రీకాళహస్తి దేవాలయం వారు, వీరికి రవ్వంత ఆదరణ ఇచ్చి, వయొలిన్ సాధకుడి రూపంలో కొంత స్థానం అప్పాదించారు.

గణితాంక విద్యాసాగరుడుని రక్షించి, గౌరవవించుకోలేక పోయింది మన దేశం. మరెవ్వరికీ ఈ అగత్యం పట్టకపోతే అదే పదివేలు!. కృషితో ఎంతటి మేధా సంపన్నులు కావచ్చో, పాండిత్య ప్రకర్షలు కనపరచ వచ్చో ఈ గణిత విశ్వసంఖ్యాచార్య లక్కోజు సంజీవరాయ శర్మ గారిని చూసి నేర్చుకోవచ్చు. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి