కథాసమీక్షలు - రాచమళ్ల ఉపేందర్

కథ :  "అమ్మ-నాన్న... ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయి"
రచయిత  పేరు  :  సుంకర వి.హనుమంతరావు 
     సమీక్ష :  రాచమళ్ల  ఉపేందర్ 
        గోతెలుగు 109 వ సంచిక!

థలో కమ్మదనం ఉంటుంది. అమ్మతనమూ ఉంటుంది. అది మనసును లాలిస్తుంది. పాలిస్తుంది.  కరడుగట్టిన హృదయాలకు సైతం కన్నీటి విలువలను నేర్పుతుంది. స్వచ్ఛమైన ప్రేమను రుచి చూపిస్తుంది. కనువిప్పు కలిగించే సుగుణమూ ఉంది. జీవితంలో జరిగే పొరపాట్లను చూపించి, సన్మార్గానికి వారధిలా నిలబడుతుంది. మనిషిలో సద్గుణాలను పెంపొందిస్తూ... సమాజం నిండా పచ్చని కాంతులు ప్రసరింపజేస్తూ... మనసుల్లో మానసిక ఆరోగ్యాన్ని పుష్కలంగా కలుగజేసే నిత్య సంజీవని కథ.

అందుకే కథలు చదవడమంటే నాకిష్టం. ఇలాంటి కథలన్నింటిని పూదండంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ... వారం...వారం... కథల విందును పంచుతున్న అచ్చ తెలుగు పత్రిక గో తెలుగుకు బోలెడు అభినందనలు. ఈ అందమైన పూమాలలో 109 వ సంచికలోని సుంకర వి.హనుమంతరావు గారు రాసిన "అమ్మ-నాన్న... ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయి" కథ నాకు బాగా నచ్చింది.  ఈ కథలో పైన ఉదహరించిన లక్షణాలున్నాయి.

నేటి మోడ్రన్ అమ్మాయిల్లో పెళ్లి పట్ల, జీవితం పట్ల ఉన్న మెచ్యూరిటిని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ధరణి పాత్ర ద్వారా తెలియజేస్తూ కథ ప్రారంభిస్తాడు రచయిత. అప్పుడే పెళ్లి వధ్దనే అసహనం. పైగా ఆఫీసుకు రెండు రోజులు సెలవు పెట్టి ఎదురు చూస్తున్న ధరణికి ప్రోగ్రాం క్యాన్సిల్ అంటూ పెళ్ళి కొడుకు సంజయ్ ఫోన్ చేయడంతో ఎగిరి గంతేస్తుంది. కానీ లోలోపల మథనపడ్తుంది. "చెయ్యిస్తాడా? దేఖేంగే... దిఖాయేంగే... అమ్మాయిలంటే యింత అలుసా? ఫైవ్ సిక్స్ హైటూ ఫిఫ్టీసిక్స్ వెయిటూ జాస్మిన్ వైటూ వున్న నన్నే ఇగ్నోర్ చేస్తాడా?" అంటూ ధరణి సంజయ్ పై ఉడికిపోతూ చెప్పే వాక్యాలు చాలా స్వీటుగా ఉన్నాయి.

కానీ మరుసటి రోజు సంజయ్ తన కుటుంబంతో రావడం చూసి ధరణి ఆశ్చర్యంలో మునిగిపోతుంది. ఇక ఇక్కడి నుండి పాత్రల మధ్య సంభాషణలతో సరదాగా సాగిపోతుంది కథ. "రండి అన్నయ్యగారూ... మనమలా మేడ మీద కెళ్లి వీళ్లకో యుగళగీతానికి ఛాన్స్ యిచ్చేద్దాం" అంటూ చిలిపిగా మాట్లాడుతూ కదలబోతున్న తల్లిని కౌగిలించేసుకొని ముద్దుపెట్టేసి... బుచ్చిబాబు రాణీ... నాటకాల వాణీ... రాత్రికి చూపిస్తా నా బాణీ..." తల్లి చెవి కొరుకుతూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంది ధరణి. కవిత్వ పాళ్ళు కలిగిన ఈ డైలాగ్స్ కూడా పాఠకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

"యుగళగీతాలు కాదు... యుగళ బాతాలు...." అన్న ధరణి మాటలకు సంజయ్ గుండెలో దడ పెరిగింది అంటూ రచయిత ఉత్కంఠను రేకెత్తిస్తూ... కథను ముగింపులోకి తీసుకెళతాడు. ఇక్కడ వరకు రొటీన్ గా సాగుతూ... ఊహించని ముగింపుతో కథ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుతుంది. సంజయ్, ధరణీలకు పెళ్ళి జరగడం... వారికి పుట్టిన గారాలపట్టి కార్తిక తల్లిదండ్రుల డైరీ చదవటం, అందులో యుగళ గీతాలు.. యుగళ బాతాలు.. దగ్గర డైరీ రాయటం ఆగిపోవటంతో తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు తల్లని అడుగుతుంది. ధరణి సిగ్గుపడుతూ... సంజయ్న్ అడగమంటుంది.

కూతురి పోరు తట్టుకోలేక గీతాలో.. బాతాలో.. సంగతి బయట పెడతాడు సంజయ్.  "సాహసంతో స్వయంవరానికి వచ్చాను కదాని.. చెమటలు పట్టించే ప్రశ్నలు సంధిస్తుందేమోనని భయపడిపోతుంటే... మనం మన వూళ్ళో.. తాటాకు పందిరి కింద తలంబ్రాలు పోసుకోవాలి.  నా పెళ్ళికి మా డాడీ ఖర్చు పెడతానన్న బడ్జెట్లో సగం నేను చదువుకున్న స్కూలుకు డొనేట్ చేయాలని.. ఆడంబరాలకు.. ఆర్భాటాలకు దూరంగా వుండాలని అంది. ఇదేరా మీ మమ్మీ మాట... నా పాలిట బంగారు బాట... కోట్లు దుబారా చేస్తూ.. కన్నవారిని.. కష్టాలకు గురి చేస్తున్న నేటి యూత్ కు గుణపాఠంలా వున్న మీ మమ్మీ మాటలు నాకు అమృతధారలయ్యాయి." అని సంజయ్ చెప్తుంటే కార్తిక హృదయం ఆనందంతో నిండిపోతుంది.

"కన్న వూరిని కన్న తల్లిలా చూసుకున్నారన్నమాట." అంటూ తండ్రికి, తల్లికి ముద్దులు పెడ్తూ... "నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం మమ్మీ. ఐ విల్ ఫాలో... యువర్ గోల్డెన్ పుట్ స్టెప్స్... ఇట్స్ మై ప్రామిస్.." అంటూ కథ చివరన కార్తిక చెప్పిన మాటలు ఆదర్శవంతమైనవి.. అందరూ అనుసరించదగినవి.

ఈ కథ పిడుకెడు. సమాజంలోకి పంపిన మెసేజ్ మోపెడు. ఇక ఈ కథకు అద్భుతమైన చిత్రాలు అదనపు ఆకర్షణ. తన కుంచెలో కడు రమణీయతను నింపుకున్న మాధవ్ గారికి అభినందనలు. సమాజంలో పరివర్తన కలిగేలా నిత్యం కథలు రాస్తూ... కన్న వూరిని కన్న తల్లిలా ప్రేమించాలని.. ఆదరించాలని.. పాఠకుల్లో స్ఫూర్తిని కలిగిస్తూ... సుంకర వి.హనుమంతరావు గారు రాసిన "అమ్మ-నాన్న... ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయి"  ముమ్మాటికీ మంచి కథ. వారి సాహితీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ శుభాభినందనలు తెలుపుతున్నాను. 

 

 ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు.....  http://www.gotelugu.com/issue109/2858/telugu-stories/amma-naanna-o-software-ammaayi/

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి