మన ఆరోగ్య్హం మన చేతుల్లో - .అంబడిపూడి శ్యాం సుందర రావు

 

గుమ్మడికాయలు- వాటి ప్రయోజనాలు 

సాధారణముగా గుమ్మడికాయలు మన  హిందూ సాంప్రదాయములో కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశము సమయములో ఇంటి యజమాని ప్రతి గుమ్మము ముందు గుమ్మడికాయను పగులగొడతారు అది శుభసూచకము. విందులలో గుమ్మడికాయ పులుసును ఎక్కువగా చేస్తారు అందరు పులుసులో గుమ్మడికాయ ముక్కలను ఇష్టముగా తింటారు. మనకు ఇంతవరకే తెలుసు కానీ గుమ్మడికాయ వల్ల మనకు ఆరోగ్య పరముగా  చాలా ప్రయోజనాలు మనకు తెలియనివి ,మనము పట్టించుకోని ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాము. 

పనస తరువాత పెద్ద కాయ గుమ్మడి ఇది ఉత్తర అమెరికానుండి మన దేశానికి వచ్చింది  గుమ్మడికాయలోని గుజ్జు దాని విత్తనాలు కూడా ఆరోగ్య పరముగా ఉపయోగిస్తాయి అవి తెలుసుకుంటే మన వంటలలో గుమ్మడికాయను ఇంకా ఎక్కువగా  ఉపయోగించుకోవచ్చు

1. గుమ్మడి లో కంటిచూపును బలాన్ని ఇచ్చే విటమిన్ ఏ పుష్కలముగా ఉంది ఇదే కాకుండా గుమ్మడి గుజ్జులోని సమృద్ధిగా ఉండే పోషకాలు మీ కంటి చూపును వృద్ధిచేస్తాయి. తరచుగా గుమ్మడిని ఆహారములో తీసుకుంటూ ఉంటె కంటికి సంబందించిన మ్యాక్యులార్ రోగాలు, అంధత్వానికి దారితీసే "రెటినైటీస్ పిగ్మెంటోజ"అనే వ్యాధి వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది శుక్లాలను రాకుండా కాపాడుతుంది.రోజు ఒక చిన్న కప్పు గుమ్మడికాయ గుజ్జును తింటే శరీరానికి అవసరమైన విటమిన్ ఏ లభ్యమవుతుంది .

2.చర్మము ఆరోగ్యముగా ఉండటానికి గుమ్మడిలోని విటమిన్ ఏ బాగా సహకరిస్తుంది. చర్మము ముడతలు లేకుండా నాజూకుగా ఉండటానికి గుమ్మడికాయ గుజ్జులో పోషకాలు బాగా ఉపయోగపడతాయి .ఇవి సూర్య రశ్మిలోని అతినీలలోహిత  కిరణాలవల్ల చర్మముపై ఏర్పడే ముడతలను నివారిస్తుంది. గుమ్మడికాయను సహజ సిద్దమైన ఫేషియల్ మాస్క్ తయారుచేటానికి వాడవచ్చు. ఈ మాస్క్ చర్మానికి రక్షణ కలుగా చేస్తుంది. ఫేషియల్ మాస్క్ ను ఎలా తయారుచేయవచ్చో తెలుసుకుందాము. ఒక పావు కప్పు గుమ్మడికాయ గుజ్జు, ఒక కోడిగుడ్డు,ఒక చెంచా తేనె ఒక పెద్ద చెంచా పాలు కలిపి పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి పట్టించి ఒక ఇరవై నిముషాలు ఉంచినా తరువాత గోరువెచ్చని నీటి తో కడగాలి

3. గుమ్మడిలోని పీచు పదార్ధము జీర్ణక్రియను నెమ్మదిగాచేస్తుంది ఫలితముగా త్వరగా ఆకలివేయదు దీనిలోని 90% నీరు లావు తగ్గాలి అనుకోని డైటింగ్ చేసేవారికి బాగా ఉపయోగిస్తుంది ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జులో 7గ్రాముల పీచు ఉంటుంది అంటే రెండు బ్రెడ్ స్లైసెస్ తిన్నదానికన్నా ఎక్కువ పీచు పదార్ధము శరీరానికి లభ్యమవుతుంది. దీని వల్ల  50కెలోరీలు కన్నా తక్కువ శక్తి లభ్యమవుతుంది

4.శక్తి పొందటానికి సామాన్యముగా అరటి పండు మంచిది త్వరగా శక్తిని పొందుతాము అని అంటారు కానీ అరటి పండ్ల కన్నా గుమ్మడి త్వరగా శక్తినిచ్చే పండు . ఒక కప్పు అరటిలో 422మిల్లీగ్రాముల మళ్ళి భర్తీ అయ్యే పోషకము పొటాషియం ఉంటె  గుమ్మడిలో 564మిల్లీగ్రాముల పొటాషియమ్ ఉంటుంది .కాబట్టి గుమ్మడి ప్రకృతిలో దొరికే సహజ సిద్దమైన శక్తి భరితమైన పండు . ఒక కప్పు గుమ్మడి రసము బాగా పనిచేసి అలసినప్పుడు తీసుకుంటే చెమట ద్వారా కోల్పోయిన ఖనిజ లవణాలను భర్తీ చేసి కండరాలకు స్వస్థ చేకూరుస్తుంది

5. పీచు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండెఆరోగ్యము బాగుంటుంది ఈ మధ్య చేసిన పరిశోధనలవల్ల తెలుసుకున్నది ఏమిటి అంటే  పీచు ఎక్కువగా కలిగిన ఆహారాన్ని తీసుకున్న మగవారిలో  గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 40% తక్కువగా ఉంటాయి ఆడవారిలో 25% తక్కువ అని తెలిసింది. గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టెరాల్ అనే రసాయనము చేడు కొలెస్ట్రాల్ ను సమర్ధవంతముగా ఎదుర్కొంటుంది

6. రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి జబ్బులు రాకుండా  కాపాడుకోవటానికి గుమ్మడి మరియు గుమ్మడి విత్తనాలనుండి తీసిన నూనె బాగా ఉపయోగపడతాయి  ఒక కప్పు గుమ్మడి గుజ్జు లో పదకొండు మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది కాబట్టి వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ను నిరోధిస్తుంది. అంటే అదసవారికి అవసరమైన విటమిన్ సి లో 60 శాతము గుమ్మడి వల్ల లభిస్తుంది గుమ్మడిలోని విటమిన్ సి సాధారణముగా వచ్చే జలుబు లేదా పరాన్న జీవుల వచ్చే వ్యాధులనుండి త్వరగా కోలుకునేందుకు సహాయ పడుతుంది.

7. ఈ మధ్య జరిపిన పరిశోధనల వల్ల శాస్త్రవేత్తలు గుమ్మడి రక్తములో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది అని  కనుగొన్నారు ఇది ఒక రకముగా మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరమైన పరిశోధన . గుమ్మడి తినటం వలన శరీరములో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి గ్లూకోజ్ టాలరెన్స్ ఏర్పడుతుంది.

 ఇప్పటివరకు గుమ్మడికాయ తినటం వల్ల మన శరీరానికి కలిగే లాభాలను తెలుసుకున్నాము  కదా ఇప్పుడు గుమ్మడి గింజలు మనకు ఏవిధముగా ఉపయోగ పడతాయో తెలుసుకుందాము.

1.. గుమ్మడి గింజల లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లము మన శరీరములో సెరటోనియమ్ అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పదార్ధము మన మూడ్స్ ను అదుపు చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది సామాన్యముగా ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లము టర్కీ వంటకాలలో ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ మంచి న్యూరో ట్రాన్స్ మీటర్ యే  కాకుండా  మంచి నిద్ర పట్టటానికి సహాయ పడుతుంది

2..ఇది శరీరమును రిలాక్స్ చేసి మంచి నిద్ర లోకి జారుకొనేటట్లు చేస్తుంది.  లో బ్లడ్ ప్రెజర్  భాధ పడేవారికి గుమ్మడి గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. వీటిలోని ఫైటో ఈస్ట్రోజెన్ లో బ్లడ్ ప్రెజర్ ను అదుపు చేస్తాయి.  గుమ్మడిలోని బీటా కెరోటీన్లు కంటి చూపుకు, చర్మానికి మంచి చేయటమే కాకుండా క్యాన్సర్ రాకుండా ఎదుర్కొంటాయి అని శాస్త్ర వేత్తల పరిశోధనలు తెలుపుతున్నాయి.

3. ముఖ్యముగా మగవారి ఆరోగ్యానికి  అవసరమైన జింక్ గుమ్మడిలో సమృద్ధిగా ఉండటము వలన మగవారిలో వచ్చే ప్రోస్ట్రేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.  గుమ్మడికాయలు మన ఆహారములో భాగముగా చేసుకొని తినటం మొదలు పెడితే మన ఆరోగ్యము చాలా వరకు బాగుంటుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యము మీరు గుమ్మడి కాయ, గింజలను తినటం అలవాటు  చేసుకోండి . 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి