అమ్మ లాంటి నిమ్మ - ..

lemon specialty

అమ్మ లాంటి నిమ్మ

అన్ని కాలలో దొరికేది  అందరు ఇష్ట పడే ది  నిమ్మకాయ  ముఖ్యముగా ఎండాకాలం లో నిమ్మకాయ రసము కొద్దిగా ఉప్పు లేదా చక్కర కలుపుకొని చల్లటి నీరు లేదా సోడాలో కలిపి త్రాగితే ఉండే హాయి అనుభవిస్తే గాని తెలియదు.దాహము తీరటానికి అందరూ అవలంభిచే చిట్కా ఇదే . సామాన్యముగా మన  ఇళ్లలో ఎక్కువగా వంటకాలలో గాని ఇతరత్రాగాని ఎక్కువగా నిమ్మకాయలు పులుపు కోసము వాడుతూ  ఉంటారు.  నిమ్మ ఆహారములో రుచికి  మాత్రమే కాదు నిమ్మ పండు,దాని రసము ఆరోగ్య పరముగా చాలా ఉపయోగాలను ఇస్తుంది అవి ఏమిటో తెలుసుకుంటే మనము ఇంకా ఇష్టముగా నిమ్మకాయలను  విరివిగా వాడతాము అందువల్ల అటువంటి ఆరోగ్య పరమైన ఉపయోగాలు ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. దాని ఉపయోగాలు తెలుసుకున్నాక నిమ్మను చాలా రకాలుగా క్రొత్తగా వాడుకోవచ్చు.  నిమ్మలో విటమిన్ సి అధికముగా ఉంటుంది దీనికి తోడు యాంటీ ఆక్సిడెంట్లు ,బి విటమిన్ క్యాల్షియమ్ కూడా ఉంటాయి  అన్న విషయము  అందరికి తెలిసినదే . వీటివల్ల మన శరీరానికి కలిగే  లాభాలను తెలుసుకుందాము .

ప్రస్తుతము మన జీవన విధానము వల్ల ,కాలుష్యము వల్ల,తినే ఆహారమువల్ల ముఖ్యముగా జంక్ ఫుడ్ , తగిన శారీరక శ్రమ లేకపోవటంవల్ల  లాంటి అనేక కారణాల వల్ల శరీరములో కొన్ని అనవసర పదార్ధాలు (విషపదార్ధాలు )పోగు అయి శరీరములోని ఆమ్ల ,క్షార ద్రావణాలు సమతుల్యత (పి. హెచ్ విలువలను)ను దెబ్బతీస్తున్నాయి . ఈ  పి.హెచ్ విలువలను సమతుల్యము చేయటానికి నిమ్మ బాగా ఉపయోగ పడుతుంది. నిమ్మఆమ్ల  స్వభావము కలిగినది అయినప్పటికీ దీనిలోని పోషకాలు  ఉత్పత్తి చేసి  ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేశక్తిని ఇస్తాయి. రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసమును కలుపుకొని త్రాగితే ఆరోగ్య సమస్యలు చాలా మటుకు అదుపులో ఉంటాయి.

నిమ్మరసము మంచి సూక్షజీవినాశని అందువల్ల హానికరమైన సూక్షజీవులను నాశనము చేస్తుంది మంచి ఉపయోగకరమైన సూక్ష్మ జీవుల వృద్ధికి తోడ్పడి అజీర్ణము,మలబద్దకముల ను దరిచేర నివ్వదు. ఆహారంతో పాటు ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి త్రాగితే అన్నవాహికలో ఆహారము కదలికలు సాఫీగా ఉండి జీర్ణక్రియ  బాగా జరుగుతుంది. ఎక్కువ తింటున్నాము లావు అవుతున్నాము అనుకునేవాళ్లు ఆహారానికి ముందు ఒక కప్పు లెమన్ (నిమ్మ) తీ త్రాగితే ఎక్కువ అన్నము తినలేరు ఆ విధముగా తినే ఆహారము పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. నిమ్మ గల పెక్టిన్ అనే పీచు పదార్ధము కొద్దిగా ఆహారము తీసుకున్నా కడుపు నిండుగా ఉండేటట్లు చేస్తుంది

జీర్ణ నాళము లోని పరాన్న జీవులు కొన్ని రకాల క్రిములను చంపటానికి సహజ  సిద్దమైన మందు నిమ్మ రసము నోటి దుర్వాసన తో భాధపడే వారు తాజా నిమ్మరసముతో నోటిని పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే చిగుళ్ల నుండి రక్తము కారుతున్నప్పుడు ఆ ప్రాంతాలలో నిమ్మరసముతో నెమ్మదిగా రుద్దిన ఫలితము ఉంటుంది. ఆందోళనలో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మంచి తాజా నిమ్మపండు వాసనను గట్టిగా పీలిస్తే చాలా ఉపశమనము కలుగుతుంది. చేసే పనిమీద శ్రద్ద పెట్ట గలుగుతారు తాజా నిమ్మ ఆపండ్ల వాసనకు ఆ శక్తి ఉంది చాలా మటుకు చర్మ సంరక్షణకు వాడే ప్రోడక్ట్స్ లో విటమిన్ సి అధికముగా ఉంటుంది ఈ విటమిన్ సి చర్మము లోని కొత్త కణాల పెరుగుదలను అధికము చేస్తుంది నిమ్మ కాయను ముక్కలుగా తరిగి చర్మముపై రుద్దితే ముఖము పై గల మలినాలు తొలగి ముఖ వర్చస్సు అధికము అవుతుంది

నిమ్మలోని పుల్లదనము కాలేయము మూత్రపిండాలు ప్రభావితము చేస్తుంది అని నేచురోపతి  వైద్య నిపుణులు చెపుతారు ఎందుకంటే నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాలు,కాలేయము బాగా పనిచేయటానికి సహాయపడతాయి. నిమ్మ శరీరములోని నిలవ వున్నా అధికముగా ఉన్న నీటిని వ్యర్ధ పదార్ధాలతో సహా బయటకి పంపుతుంది నిమ్మలో వుండే పెక్టిన్ అనే పదార్ధము అధిక రక్త పీడనానికి  కారణమయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. నిమ్మలోని  ఫ్లావనాయిడ్స్ రక్త నాళాలను బలపరుస్తాయి అందువల్ల అధిక రక్త  పీడనం వల్ల రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయిఆడామగా అనే తేడా లేకుండా జుట్టు ఉన్న ప్రతివాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చుండ్రు సమస్యతో భాధపడుతుంటారు దీనికి పరిష్కారము కొబ్బరినూనెను నిమ్మరసాన్ని కలిపి మాడుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది కానీ ఈ ప్రయోగాన్ని  చేయరాదు ఎందువల్ల అంటే నిమ్మ రసము జుట్టు రంగును మారుస్తుంది. కాళ్ళ పగుళ్లు నయము చేయటానికి పాదాలను నిమ్మరసము పావుకప్పు పాలు ,రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపినా వేడి నీటిలో రోజు ఇరవై నిమిషాల పాటు ఉంచితే పగుళ్లు తగ్గి చర్మము మృదువుగా తయారు అవుతుంది

లేమన్ టీ , నిమ్మ రసము లను  చాలా కాలము నుండి సాధారణముగా వచ్చే జ్వరాలను తగ్గించటానికి  గృహ వైద్య చిట్కాగా వాడతారు. ఒక కప్పు లెమన్ టీ తేనెతో కొన్ని గంటల విరామముతో తీసుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది అలా చేసినప్పటికీ జ్వరము తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించటం మంచిది. నిమ్మలోని విటమిన్ సి  కొలాజిన్ మరియు ఎలాస్టిన్  తయారు అవటానికి ఉపయోగపడుతుంది ఈ రెండు కూడా చర్మము లో కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడి చర్మ కాంతిని పెంచుతాయి అందువల్ల నిమ్మను ఆహారంతో పాటు తీసుకోవటం నిమ్మ రసాన్ని చర్మముపై లేపనముగా వాడటం చేస్తే మంచి ఫలితము ఉంటుంది.

నొప్పి తగ్గటానికి ముఖ్యముగా వాపు తగ్గాలి నిమ్మలోని నూనెలు వాటికి ఉండే సువాసనలు రక్తనాళాలను సడలించి వాపును తగ్గేటట్లు చేసి నొప్పిని తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులతో భాధపడేవారు రోజు ఒక గ్లాసు నిమ్మరసము కలిపినా నీరు త్రాగటం మంచిది  ఎండా వేడికి చర్మము కమిలినట్లు అయినప్పుడు నిమ్మ కాయ గుజ్జును నీతితో కలిపి మొఖముపై పూసిన చర్మము నొప్పి తగ్గుతుంది. ఆఖరిగా నిమ్మ వెరికోజ్ వీన్స్ (కాలిలోని రక్తనాళాలు ఉబ్బటం) నయముచేయటానికి పనికి వస్తుంది మాయిశ్చరైజింగ్  ఆయిల్ కు నిమ్మ నూనెను కలిపి రక్తనాళాలు ఉబ్బినచోట నెమ్మదిగా రుద్దితే క్రమముగా ఫలితము కనిపిస్తుంది అంటే బయటకు ఉబ్బినట్లుగా కనిపించే రక్తనాళాల వాపు క్రమముగా తగ్గుతుంది. ప్రకృతి వైద్యములో నిమ్మ రసానికి చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యముగా లావు తగ్గటానికి రోజు ఒక చెంచాడు తేనే అంతే పరిమాణములో నిమ్మరసము ఉదయానే తీసుకోవాలి   

కాబట్టి నిమ్మ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన ఆహారములో నిమ్మ ఉండేటట్లు చూసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మందులకు దూరముగా   ఉండండి.

 

-అంబడిపూడి  శ్యాం సుందర రావు

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి