కావలసిన పదార్థాలు:
అరటికాయ, చింతపండు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి-జీలకర్ర మిశ్రమం
తయారు చేయు విధానం:
నూనె వేడిచేసాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులో వెల్లుల్లి, జీలకర్ర కలిపి చేసుకున్న పేస్టు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అందులో అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం మరియు 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా వేగనివ్వాలి. అరటికాయ ముక్కలు బాగా వేగాక అందులో చింతపండు పులుసు వేసుకొని సన్నని మంటపై 10-15 నిమిషాలు ఉంచాలి. పులుసు బాగా మరిగాక అందులో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చక్కటి అరటికాయ పులుసు రెడీ