అమ్మ దయ - భమిడిపాటి ఫణిబాబు

amma daya

అమ్మ పరాశక్తి. అమ్మవారి రూపాలు, లీలలు,అసంఖ్యాకం. దుర్గ, లక్ష్మి, సరస్వతి, కాళీ, చండి, చాముండి, లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి,రాజరాజేశ్వరి,గాయత్రి, స్వాహా,స్వధ,ఇలా ఎన్ని రూపాలు, ఎన్నెన్ని లీలలు చెప్పనలవికానిది. ఆమె శక్తి స్వరూపిణి, శక్తి లేనిదె శివం లేదు, శివం లేనిదే శక్తి లేదు, ఆ శక్తి స్వరూపమే దుర్గ. సంవత్సరంలొ శరన్నవరాత్రులు చాలా తొందరగా గడచిపోతాయి. అమ్మవారి నిత్యపారాయణతో, మాతారాణీ పాటలతో, ఎపుడు తెల్లవారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలీదు.అందరి యిండ్లలోను ఓ రకమయినా సంతోషం, ఉద్వేగం, ఆనందం,మరొ పక్క మన ఏడుకొండలవాని బ్రహ్మోత్సవాలు,పూజ త్వరగా ముగించి , టెలివిజన్లో బ్రహ్మోత్సవాలు వీక్షించడం కోసం,ట్.వి. ని అతుక్కుపోవడం, సాయంత్రం కీర్తనలు, భజనలు, పూజలు, పేరంటాలు ఒకటే హాడావిడి.

మా బెంగాలి స్నేహితులయితే ఇంట్లొ ఒక అడుగు, దుర్గ మందిరంలొ మరొ అడుగునూ, వారి ముద్దులగుమ్మ దుర్గని, వారి యింటి గారాలపట్టి, సంవత్సరంలొ ఆ మూడు రోజులు పుట్టింటికి వస్తుందని,పరమశివుడు వారి జామాతని అంటారు.ఇంటికి వచ్చిన ముద్దుల కుమార్తెని ఆప్యాయతతో, ఆనందంతో, అభిమానంగా,ఆదరించి పూజిస్తారు. షడ్రచులతో,భక్ష్యాలు దేవికి సమర్పిస్త్తారు సామూహికంగా మందిరంలోనె వాళ్ళ భోజనాలు అవీను. సాయంత్రం మళ్ళి పూజలు, సాంస్క్రృతికార్యక్రమాలు, రోజూ రెండు పూటలా కొత్తచీరలు, చెప్పలెని ఆనందం, సంతోషం.

మా నార్తు స్నేహితులయితే శరన్నవరాత్రులను మాతారాణి భజనలతో, రామయణ గానంతో, పరవశింపచేసేస్తారు, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ చక్కని నృత్యాలతో,ఉల్లాసంగా గడుపుతారు.కొంతమది కన్యకలకి భొజనం,విభిన్న వస్తువులిచ్చి సంస్కృతి, సంప్రాదాయననుసరించి వారిశక్తి కొద్దీ జరుపుతూవుంటారు. మనవారు బొమ్మలకొలువుతో,ఇంద్రకీలాద్రి కనకదుర్గ పూజలతో,లలితాసహస్రనామార్చనలతో, గడచిపోతుంది. దేవి ఉపాసకులయితే వారి పూజా విధానం, అదీ చాలా శ్రద్దగా నియమ నిష్టలతో చేస్తారు.

దసరా అంటే గుర్తుకువచ్చేది ,చిన్నపుడు అయ్యవారికిచాలు, ఐదు వరహాలూ, పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు, జయా విజయీభవ, దిగ్విజయీభవా, అంటూ యింటింటికి వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తాయి,ఆ రోజులు తలచుకుంటే, ఎంత వయసు వారికయినా మనలోని చిన్నపిల్ల మనస్తత్వం బయటపడుతుంది.   దసరా పండగొచ్చిందంటే , ఇంటి ఆడపడుచూ, కొత్త అల్లుడూ రావడం, వాళ్ళతో హడావిడిగా ఉండేది.  దసరా వచ్చిందంటే చాలు, కొత్త సినిమా రిలీజవ్వాలే. కొత్త సినిమా, కొత్త బట్టలూ, ఒకటేమిటి ఎక్కడచూసినా కళకళలాడే ఆహ్లాదకరమైన వాతావరణమే.

ఇక్కడ పూణె లో " చతుర్ శ్రింగి మాత" ఆలయంలో చక్కని పూజలు, మేళా వుంటుంది ఆదేవి దర్శనానికి పొరుగూరినుండి భక్తులు వస్తూంటారు. ఆందరం కలసి విభిన్నసంస్కృతులతో అమ్మని కొలుస్తారు.. ఏ ఆర్బాటాలు ఆడంబరాలు లేకుండా నిష్కల్మషమయిన మనసుతో పవత్రమైన భక్తితో, అర్చించినా ఆరాదించినా పూజించినా చాలు కదండీ! .

ఉద్యోగంలో ఉన్నప్పుడు, విజయదశమి కి శలవు కాబట్టి, ముందురోజు , మా ఫాక్టరీలో ఆయుధ పూజ చేసేవారు. పైగా పండగలకి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకి ఇచ్చే బోనసు కూడా దొరికేది. ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు  తేవాలంటే, విజయదశమికే వచ్చేట్టు చూసుకోవడం. ఇక్కడ పూణె లో ఓ సాంప్రదాయం ఉంది. చిన్నపిల్లలు , ఓ సంచీలో జమ్మి ఆకులు తీసికుని, పెద్దవారి చేతిలో పెట్టి, వారి ఆశీర్వచనం తీసికోవడం. ఆ “ జమ్మి ఆకులు “  “ సోనా ( బంగారం ) “ అంటారు.

వీధివీధికీ అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి, గణపతి నవరాత్రి కి చేసినట్టు దసరా నవరాత్రి  ఉత్సవాలు చేయడం కూడా ఓ ఆనవాయితీగా వస్తోంది.  సర్వశక్తిమయీ
, అభయప్రదాయిని, ఆనందదాయిని, ఆనందరూపిణీ, అయిన ఆతల్లి అనుగ్రహం మనకందరికి కలగాలని కోరుతూ

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి