కపిత్థవృక్షం- వెలగచెట్టు. - .హైమాశ్రీనివాస్

velaga tree

కపిత్థవృక్షం-  వెలగ చెట్టు.
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును

కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ! - అంటూ సుమతీ శతక కారుడు బద్దెనకవి వెలగపండు గురించీ ఆనాడే తన శతకంలో ప్రస్తావించాడు .ఏనుగు మింగి వదలిన వెలగపండులో గుజ్జు మాయమైనట్లు సంపద పోతుందని హెచ్చరిస్తూ వెలగపండు గుజ్జును ఉపమానంగా వాడాడు.

దీన్ని ఆంగ్లంలో ‘ఎలిఫెంట్ యాపిల్  ‘లేక ‘  ఉడ్ యాలిప్ ‘ అంటారు.  ఇది ‘రూటేసి’ కుంటుంబానికి చెందిన పండ్ల వృక్షము. వెలగ  శాస్త్రీయం నామ 'ఫెరోనియా లిమోనియా' అనిగాని, లేదా 'లిమోనియా ఎలిఫెంటమ్' .ఇది దాదాపు అన్నినేలల్లో పెరుగుతుంది.
దీన్ని తెలుగు లో’ కపిత్థము’ అనీ , తమిళము లో –‘విళాంపళమ్ ‘అనీ, కన్నడం లో’ బెళవహణ్ణు ‘అంటారు.

దీనికి చిన్న ముళ్ళు కూడా ఉంటాయి.లేత పసుపురంగు పూలు.పండు గుండ్రంగా గట్టిగా  ఉంటుంది. దీన్ని నిప్పులో వేసి కాల్చి పగలకొట్టి పచ్చడి చేసుకుంటారు. రుచి చెప్తే తీరదు తిని తీరాల్సిందే!

భారతీయ ఆచార పూజా విధానంలో వెలగపండు స్థానం గొప్పది .వెలగపండ్లు వినాయకుడికి ఇష్టం. వినాయక పూజ రోజున వినాయకుని మట్టి విగ్రహం ఉంచే  పీటమీద ఏర్పాటు చేసుకునే మంటపానికి పాలవెల్లికడతాం, దానికి అన్ని రకాల పండ్లూ పూలూ కట్టేప్పుడు వెలగపండును తప్పని సరిగా కట్టి అలంకరిస్తాం.వెలగ గుజ్జు తీపైన  వగరుతో కొత్త చింతపండు రంగులో ఉంటుంది ఈ చట్నీలో పెరుగు కలిపి భుజిస్తాం.

విఘ్నేశ్వరునికి అత్యంత ఇష్టమైన,  ప్రీతిపాత్రమైన పండ్లు నేరేడు తోపాటుగా వెలగ కూడా. కార్యసిద్ధికీ లక్ష్మీకటాక్షానికీ చేసేగణపతి హోమాల్లో వెలగపండును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వినాయక చవితినాడు గణపతికి సమర్పించే 21 రకాల పండ్లలో వెలగ తప్పకుండా ఉంటుంది.
 'గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు’ అనే సామెత కూడా ఉంది. ఎందుకంటే బాగా వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం.   
 మిగిలిన పళ్లలానే ఈ వెలగ గుజ్జులోనూ పోషకాలు దండిగా ఉంటాయి.  ప్రోటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా లబిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు.

వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రక్తహీనత లేకుండా చేస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధ పడేవారు  ఈ పండ్లు బాగా తినడం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తుంది. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. దృష్టి దోషం రాకుందా కంటి చూపు కాపాడుతుంది.

తెలంగానాలో ఇలాపాట పాడుతారు.
ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ॥2॥
ఎక్కువ పూలు గూర్చి పెక్కు నోములు నోమి ॥2॥ 

వెలగ పండు గుజ్జును రుచి  బావుంఉంది, కనుక అంతా తినను ఇష్టపడతారు. దీని నుండి జామ్, పచ్చళ్ళు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు. ఇది మంచి జీర్ణకారి. పెంకు గట్టిగా గిన్నెలా ఉంటుంది  .వెలగ ఆకులు, పుష్పాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి.చెట్టు కాండం కలప గా ఉపయోగపడుతుంది. 20 మీటర్ల ఎత్తు పెరుగు తుంది.పూలు చిన్నవిగా ఉండి లేత ఎరుపు రంగులో గుత్తులుగా కొమ్మల చివర  పూస్తాయి.పండ్లు బత్తాయి పండంత పెద్దవిగా గుండ్రంగా , గట్టిగా ఉంటాయి.విత్తనాలు పులుపు కలిసిన తీపిదనపు  గుజ్జులో ఉంటాయి. ఆయుర్వేద, సిధ్ధ, యునానీ వైద్యాలలో వాడుతారు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి