కథ : అపరకాళిక...నిర్భయ
రచయిత : ప్రతాప వెంకట సుబ్బారాయుడు
సమీక్ష : సరికొండ రవీంద్రనాద్
గోతెలుగు 27వ సంచిక!
పరిష్కారం చూపిన మంచి కథ
ఆడ పిల్లలకు రక్షణ కరువు అనే మాట ఇప్పటిది కాదు. పురుషాధిక్య వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి ఉన్నదే.దీనికి పరిప్కారం ఎలా అన్నదే అసలు సమస్య. ప్రతాప వెంకట సుబ్బారాయుడు రాసిన అపరకాళిక నిర్భయ కథలో ఈ సమస్యకు పరష్కారం కనిపిస్తుంది. చెడును శిక్షించే దేవుళ్లు, దేవతలు ఎక్కడి నుంచో రారు. మన మధ్య నుంచే పుట్టుకు రావాలి. చెడును శిక్షించగలిగిన ప్రతి ఒక్కరు దేవతే అనే విషయాన్ని ఈ కథలో స్పష్టంగా చెప్పారు సుబ్బారాయుడుగారు.
ఆడవాళ్ల పట్ల మృగాళ్లలా ప్రవర్తించే మృగాళ్లు ప్రతి అన్నిచోట్లా ఉంటారు. నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల వీరికి ఖాకీల సపోర్టు కూడా ఉంటుంది. ఎవరూ తమను ఏమీ చేయలేరన్న ధీమాతోనే నేరాలు చేస్తుంటారు. గ్రామంలోనే పుట్టి పెరిగి వకుళ అనే అమ్మాయి ఈ అమానుషాలను ఎదురించడానికి సాహసించడం గొప్ప విషయం. ఇది అమ్మాయిలందరికీ ఆదర్శం కూడా. ఆడపిల్లలు కరాటేలాంటి విద్య నేర్చుకోవడం కష్టమైన పనేం కాదు. ఆ విషయంపై దృష్టి పెట్టకపోవడమే లోపం. వకుళలాంటి ఒక అమ్మాయి కరాటే నేర్చుకుని గ్రామాన్నంతా కాపాడగలిగితే ఇతర అమ్మాయిలు కరాటే నేర్చుకుంటే ఉండే ప్రయోజనమెంతో తెలిపే కథ ఇది.
రచయిత చివరో్ల చెప్పిన మాట అక్షరాలా నిజం ఇప్పటి వ్యవస్థకి కావలసింది ప్రభుత్వాలు... అవి రూపొందించే చట్టాలూ కాదు. వకుళ లాంటి వారు... మగాసురుల పాలిట కాళికలు! కథ రాయడం ఇప్పుడు కష్టమైన ప్రక్రియ కాదు. కథ పుట్టిన నాటి నుంచి ఉన్న సమస్య ఒక్కడే.. సమస్యకు పరిష్కారం చూపించడం. అపరకాళిక నిర్భయలో తనదైన శైలిలో ఒక పరిష్కారం చూపించారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. గో తెలుగు అభిమానులకు మంచి కథ అందించిన ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారికి అభినందనలు.
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు.http://www.gotelugu.com/issue27/737/telugu-stories/aparakaalika-nirbhaya/