సింగరాజు లింగమూర్తి రచన "నీడ తెగినమనిషి " సమీక్ష
1922లో కృష్ణా జిల్లా నందిగామలో జన్మించిన లింగమూర్తి గారు పరిస్తుతుల ప్రభావము వల్ల చదువును అర్ధాంతరంగా అపి 1936 ప్రాంతములో జీవనోపాధికి హైదరాబాద్ చేరి ఉద్యోగము చేస్తూ దాదాపు మూడు శతాబ్దాల పాటు రచనలు చేసాడు. తన రచనలలో మధ్య తరగతి వాళ్ళ జీవితాలను సమస్యలను వాస్తవికంగా చిత్రికరించాడు.నిజ జీవితములో చాలీచాలని జీతముతో సంసారము వెళ్లదీసిన లింగమూర్తిగారు మధ్య తరగతి వాళ్ల సమస్యలను యధాతముగా చిత్రీకరించారు. అంటే అయన రచనలు కష్టాల కొలిమిలో నుంచి వెలువడ్డవి. సమాజము బడిలో తయారయిన రచయిత లింగమూర్తిగారు అయన రచనలలో నిజాయితీ నిబద్దత కనిపిస్తాయి. తన చుట్టూ ఉన్న సమాజములో దిగజారుతున్నకనుమరుగవుతున్న మానవతా విలువలను గమనించి వాటిని తన రచనలలో చూపించాడు. మొదట 1936లో హైదరాబాద్ వచ్చి"మీజాన్" పత్రికలో ప్రూఫ్ రీడర్ గా చేరి కుటుంబ భారాన్ని మోస్తూ ప్రముఖ రచయితలైన అడవి బాపిరాజు ,రాంభట్ల, తిరుమల రామచంద్ర వాటి ప్రముఖుల సాంగ్యత్యముతో అప్పుడప్పుడు రచయితగా కాలము వెళ్లదీసేవాడు. ఆ పత్రిక మూత పడటం తో అప్పుడే ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ లో ఉద్యోగిగా చేరి ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సెక్రటేరియట్ లోకి మారి తుది వరకు అంటే 1974వరకు అక్కడే పని చేశాడు.అరవైవ దశకంలో ప్రచురణ కర్తలు ఈయన రచనలను ప్రచురించటానికి పోటీపడేవారట అది ఆ రోజుల్లో ఆయనకు ఉండే పాపులారిటీ. పాపులారిటీ ఎందుకంటే 1950,60 దశకాల నాటి ఏ అభివృద్ధి లేని దేశములోని మధ్య తరగతి కుటుంబీకుల జీవితాలను ఎటువంటి అలంకారాలను చూపకుండా ఓపెన్ గా వివరించాడు కాబట్టి. ఆర్ధికంగా వెనుక బడి ఉన్నందున ఆరోగ్యపరిస్థితిని పట్టించుకోకపోవటంవల్ల అనారోగ్యముతో ఉస్మానియా ఆసుపత్రిలో 1974లో మరణించారు.
నీడ తెగిన మనిషి కధలో రచయిత తండ్రి దగ్గర డబ్బు కాజేసిన కొడుకు, ఆ తరువాత ఆ తండ్రి కొడుకు దగ్గర డబ్బు దొంగతనము చేసే పరిస్తుతులు రావటాన్ని చాలా సున్నితముగా వివరిస్తాడు. రామమూర్తి ఒక ఉద్యోగి మామూలుగానే ఆఫీసుకు వెళ్లబోయే ముందు తన జేబులో నుంచి యాభై రూపాయలు మిస్ అవటాన్ని గమనించి ,సీతా సీతా అని భార్యను గట్టిగా పిలిచీ,"నాజేబులో డబ్బులు నీవు ఏమైనా తీసావా?" అని గద్దిస్తాడు పాపము ఆ ఇల్లాలు తనకేమితెలియది చెబుతుంది. రామమూర్తి అనుమానము అప్పు అడగటానికి వచ్చిన మేనల్లుడు గిరిమీదకు వెళుతుంది "గిరి ఈ గదిలోకి ఏమైనా వచ్చాడా ?" అని అడుగుతాడు లేదని భార్య చెపుతుంది ఇంకా రామమూర్తి అనుమానము పుత్రరత్నము ప్రకాశము మీదకు వెళుతుంది వెంటనే కొడుకు ను పిలిచి గద్దిస్తాడు.
నేనసలు ఈ గదిలోకి రాలేదు ఆ డబ్బుల సంగతి నిజముగా నాకు తెలియదు "అని నిజాయితీగా చెపుతాడు కానీ నమ్మని తండ్రి,"నీ దోగా వేషాలు నాకు తెలియా డబ్బు ఎక్కడ దాచావు బుకాయించకుండా మర్యాదగా ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయి."అని కొడుకును రామమూర్తి కటువుగా దబాయిస్తాడు" నీవు దెబ్బ పడందే నిజాము ఎందుకు చెపుతావు?' అని కొడుకును కొట్టటము మొదలు పెడతాడు. "ఎవరు తీసారోగాని తన్నులు తినటానికి నేను ఒకడ్ని దొరికాను". అని ఏడుస్తూ ఉంటాడు. రామమూర్తి అరుపులకు పిల్లవాడి ఏడుపులకు ఇంట్లో వాళ్లంతా అక్కడికి చేరుతారు రాళ్ళు సీత "అయ్యో పిల్లవాడిని గొడ్డును బాదినట్లు బాదుతున్నారు వాడు బ్రతకాలా వద్దా?" అని భర్తను ఆడ్డగించే ప్రయత్నము చేస్తుంది. " నోరు మూసుకో నీ అలుసు చూసుకొనే వాడు ఇలా తయారు అయినాడు "అని భార్య మీద విరుచుకు పడ్డాడు
ఈ దశలో రామమూర్తి తండ్రి విశ్వనాధముగారు వచ్చి మనవడిని ప్రక్కకు లాగి,"పసివాడిని అంతలా కొట్టాలా?పోనీ తీస్తే తీశాడు పరాయి చోటనుంచి ఎత్తుకు రాలేదుగా "అని మనవడిని సమర్ధించాడు. "ఇవాళ ఇంట్లో తీసాడు,రేపు పరాయి కొంపల్లో తీస్తాడు పసివాట్ట పసివాడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి పి .యు.సి వెలగబెడుతున్నాడు జ్ఞానము ఉండక్కర్లా?"ఆని ప్రకాశమును మళ్ళా కొట్టబోయినాడు . ప్రకాశము ఏడుస్తూనే,"తాతయ్య నేను నిజముగా తియ్యలేదు ఒట్టు ",అని తాతయ్యతో నిజాయితీగా చెప్పుకున్నాడు. "వీడు నాకడుపున చెడ బుట్టాడు"అని రామమూర్తి కోపముగా అన్నాడు అది విని విశ్వనాధము గారు,"నేను ఇలాగే అనుకొంటే నీవు ఇంతవాడివి అయ్యేవాడివావీడికింకా పద్దెనిమిది ఏళ్ళే , నీకెప్పుడు ఇరవై ఏళ్ళు బి,ఏ చదువుతున్నావు కాస్తా జ్ఞాపకము చేసుకో అప్పుడు నువ్వు ఏమిచేసావో "అని అన్నాడు. 'చాలు లెండి ఎప్పుడో జరిగినవి ఇప్పుడెందుకు ",అని రామమూర్తి వెనక్కు తగ్గాడు.
విశ్వనాధముగారు అందరిని బయటకు వెళ్ళమని సౌంజ్ఞ చేసి అందరు వెళ్లినాక గది తలుపులు మూసి కిటికీ దగ్గర నిలబడి గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్న రామమూర్తి వంక చూసాడు. రామమూర్తికి పాతరోజులు జ్ఞాపకము వస్తున్నాయి. కాలేజీలో చదివే రోజుల్లో స్నేహితులు కలకత్తా ప్రోగ్రామ్ పెట్టుకొని రామమూర్తిని రమ్మనమని బలవంతపెట్టగా తండ్రి విశ్వనాధాన్ని డబ్బులు మూడు వందలు అడిగాడు విశ్వనాదఃము పెద్ద అసిపరుడేమికాదు బస్తీలో ఉంటూ పిల్లలకు చదువులు చెప్పిస్తూ కూతురు పెళ్ళికి
డబ్బు సమకూర్చుకుంటున్నాడు ఇంట్లో డబ్బులు ఉండి తనకు ఇవ్వటములేదని అని తండ్రిమీద కోపముతో ఉన్నాడు స్నేహితుల ప్రోద్బలంతో ఎలాగైనా కలకత్తా వెళ్లాలన్న కోరికతో తండ్రి ఇంట్లో లేనప్పుడు మారు తాళముతో తండ్రి పెట్టె తెరచి మూడు వందలు తీశాడు. తండ్రి ఇంటివచ్చినాక కొడుకును డబ్బులు ఏమైనా తీసావా అని అడిగాడు "ఆబ్బె నాకేమి తెలియదు"అని కొడుకు సమాధానము చెపుతాడు తండ్రి మారు మాట్లాడకుండా,"సర్లే చదువుకో "అని బయటకి వస్తాడు అనుకోకుండా రకరకాల కారణాల వల్ల కలకత్తా ప్రోగ్రామ్ ఆగిపోతుంది. తీసిన డబ్బును రామమూర్తి దశలవారీగా తన అవసరాలకు వాడుకుంటు ఉంటాడు. ఆ రోజు అంట డబ్బు దొంగలించిన తండ్రి ఎందుకు ఉరుకున్నాడో రామమూర్తికి అర్ధముకాలేదు.
"నేను తియ్యలేదు మొర్రో అని నీకొడుకు నిజాము చెబుతున్నా నీవు నమ్మక వాడిని గొడ్డును బాదినట్లు బాధావు. ఆరోజు నీవు నిజముగా తీసినా నీవు తియ్యలేదు అంటే నేను నమ్మాను,కాదు నమ్మినట్లు నటించాను ఎందుకో తెలుసా? ఎదిగిన కొడుకుకు అవసరాలు సరదాలు ఉంటాయి వాటిని గుర్తించి నేను డబ్బు ఇవ్వకపోవాతము వల్లే కదా నీవు నాకు తెలియకుండా తీసుకున్నది తప్పు నాదే అని సరిపెట్టుకున్నాను." అని విశ్వనాధముగారు అన్నారు. "వాడు నిజాము చెప్పిన నమ్మటంలేదని మీరు అంటున్నారు మరి నాజేబులో డబ్బులు ఎలా మాయము అయ్యాయి"అని తండ్రిని ప్రశ్నించాడు రామమూర్తి . "ఆరోజు నా పెట్టె లో డబ్బు మాయము అయినట్లే " అని విశ్వనాధముగారి సమాధానము విన్న రామమూర్తి విస్తుపోయాడు "ఏమిటో నాకు ఏమి అర్ధముకావటంలేదు" , అంటే "నీకు ఏది అర్ధము అయింది కనుక నీకు తెలిసినది పెద్ద పెద్దగా అరుస్తూ అందరిని అల్లంత దూరములో ఉంచటమే సీతను ఎరికోరిచేసుకున్నావు ఆమె అవసరాలను ఎప్పుడైనా అర్ధము చేసుకున్నావా? పిల్లలు ఎదిగారు వాళ్ల సరదాలు అభిరుచులను అర్ధము చేసుకున్నావా? పాళ్ళు ఏదైనా అడిగితె దాటేస్తావు గాని ఎప్పుడైనా సరే అన్నవా? పోనీ తల్లిగా స్వతంత్రముగా నీ భార్య చేసే అవకాశము ఇచ్చావా?పోనీ నీ సంపాదన తక్కువ ఏమీకాదు పైగా ఏంతో కొంత పై సంపాదన ఉన్నవాడివే " అని విశ్వనాదఃముగారు మాట్లాడుతు ఉంటె రామమూర్తికి ఏమి సమాధానము చెప్పాలో అర్ధముకాక బిక్క చచ్చి పోయాడు
చివరికి,"నాన్న మీరు అనవసర విషయాలు మాట్లాడుతున్నారు ",అని అనగలిగాడు దానికి విశ్వనాధముగారు ,:"ఈ విషయాలు నీతో ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఈ ఒక్క రోజు మాట్లాడనీయి ఇంకెప్పుడు నీ ముందు మాట్లాడితే ఒట్టు ఇందాక నీ కొడుకును ,"నా కడుపున చెడబుట్టావు "అని తిట్టావు ఇప్పుడు ఇంతగా పెరిగిన నిన్ను చూసి నేనేమనుకోవాలి . నీ భార్య ఒకటి రెండు సార్లు నీకు తెలియకుండా నీ డబ్బు తీసింది అంటే నీవు అటువంటి పరిస్తుతులు కలుగజేశావు. ఓ బీద గుమాస్తా జీతము చాలక సంసారము జరక్క లంచము పట్టాడు అనుకుందాము నీకు ఏమి తక్కువఅయిందని పై సంపాదన మరిగావు తప్పుకాదా ?ప్రభుత్వాన్ని, ప్రజలను వంచిస్తున్నావన్న ఆలోచన నీకు ఏమైనా ఉందా?"
దానికి రామమూర్తికి కోపము వచ్చి,"నాన్న మీరు హద్దు మీరుతున్నారు ,"అని కోపముతో ఆసహనంతో,అవమానంతో కుంచించుకుపోతూ అన్నాడు దానికి తండ్రి,"చెప్పానుగా ఈ ఒక్కసారే నని ఇది మనిద్దరి మధ్యే జరిగిన సంభాషణ,ఇతరులెవరూ వినటము లేదు , ఆస్తులు సంపాదించుకోవటం కాదు నలుగురిలో మంచి అనిపించుకో ఇంట్లో వాళ్లకు ప్రీతిపాత్రుడిగా ఉండు నేను నాకున్నది కాస్తా నీచేతులో పెట్టి కాటికి కాళ్ళు జాపు కున్నవాడిని నా దగ్గరేముంది మనవడిగాని మానవరాళ్లకుగాని ఇవ్వటానికి దేనికైనా నిన్ను అడగాల్సిందే " అంటూ తన మనుమళ్ల ,మనుమరాళ్ళ ముందు నిస్సహాయతను తెలిపే సంఘటనలను కొన్నింటిని కొడుక్కు చెపుతాడు
"ఇంతకీ అసలు సంగతి ఏమిటో చెప్పకుండా నన్నెందుకు ఈ విధముగా దులిపేస్తున్నారో నాకు అర్ధము కావటంలేదుఒక పక్క నాడబ్బులు ఎవరు తీసారో అర్ధముకాక నేనెరుస్తుంటే మధ్య మీసోద ఏమిటి",అని తండ్రి మీద రామమూర్తి విసుక్కున్నాడు
"ఆ విషయానికే వస్తున్నా పొద్దున్న గిరి నీ మేనల్లుడు కాలేజీ ఫీజు 45రూపాయలు కట్టాలి ఈరోజే చివరిరోజు ఫీజు కట్టకపోతే పరీక్ష వ్రాయనివ్వరు సంవత్సరము వృధా అవుతుంది అని నిన్ను బ్రతిమాలాడు నీవు ఇవ్వగలిగి ఉండి వాడు నాకు మనమడే నాకూతురు కొడుకే వాళ్ళ పరిస్థితి బాగోలేక ఇబ్బందులలో ఉండి నిన్ను నన్ను ప్రాధేయ పడ్డాడు అన్ని తెలిసిన నేను నిస్సహాయుడిని,ఏమి చేయలేని పరిస్థితి. నాకు నువ్వుఎంతో నాకూతురు అంతే వాడు నీవు ఇవ్వనని కసురుకున్నాక," నాకు చదివే అదృష్టములేదు లే తాతయ్య", అని ఏడుస్తుంటే వాడి చదువు ఆగిపోకూడదనుకున్నాను అంతే నీ జేబు లోంచి యాభై తీసి వాడికి ఇచ్చాను ". అని విశ్వనాధముగారి జవాబుకు రామమూర్తి ఆశ్చర్యపోయాడు.
"చిత్రంగా వుంది కదూ కొడుకు దగ్గర తండ్రి దొంగతనము చేయటము, ఎదో ఒక సందర్భములో నీవు,నేను,నీభార్య,నీకొడుకు అందరమూ దొంగలమే, పరిస్తుతులకు అందరము బానిసలము ఆ డబ్బు నా సొంతానికి కాదు ఆ డబ్బును సద్వినియోగము చేశానన్న తృప్తి ఒక్కటుంటే చాలు నాకు. ఇక నీతో ఎప్పుడు ఇలా మాట్లాడే అవసరము రాదనుకుంటా నిజముగా నాది దొంగతనము అయితే నన్ను క్షమించు మళ్ళి నీకుకనిపించే సందర్భము రాదు వస్తా రామము "అని అంటుంటే విశ్వనాధముగారి కళ్ళలో నీళ్లు తిరిగాయి తలా పక్కకు తిప్పుకొని గదిలోంచి చివాలున బయటకు వచ్చి వీధిలోకి వచ్చిరిక్షా ఎక్కడము చూసిన రామమూర్తి వరండాలో స్థాణువులా నిలబడిపోయాడు.