కథా సమీక్ష - .

 

కథ : నాణేనికి రెండోవేపు
రచయిత : పి . బి . రాజు
సమీక్ష : కర్రా నాగలక్ష్మి
గోతెలుగు 116వ సంచిక!

పి . బి . రాజు గారు రచించిన ' నాణేనికి రెండో వేపు '  కధ యీ మధ్య కాలంలో నాకు నచ్చిన కధ అని చెప్ప గలను. హంగులు  ఆర్భాటాలు లేకుండా చక్కగా నడిపించిన కధ. క్లుప్తంగా సూటిగా చెప్ప దలచుకున్నది చక్కగా చెప్పేరు రచయిత.

అసలు మంచి కథ అని చెప్పడానికి పెద్ద పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతి రానక్కర లేదు, పెద్ద పెద్ద కొటేషన్స్, బరువైన సంభాషణలు అవసరం లేదని పాఠకులను ఏక బిగిన చదివించగలిగే కథైతే చాలని తెలియ జేసే కథ. ఈ కథకు మరో  ప్లస్ పోయింట్ కూడా వుంది, కథ అయి పోయేక  చాలా సేపటి వరకు అందు లోని పాత్రలు మన చుట్టూ తిరుగుతూ మనతో మాట్లాడుతూ వుంటాయి.

స్థూలంగా  రిటైరై అన్ని విధాల జీవితం తో సంతృప్తి చెందిన యిద్దరు స్నేహితులు యెదుర్కొన్న సమస్య అని చెప్ప వచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా కాలేజీలలో అడుగు పెట్టిన అమ్మాయిల నుండి అమ్మమ్మల వరకు ముసుగులలో తిరగడం చూస్తున్నాం, రంగు రంగుల సీతా కోక చిలుకల్లా అమ్మాయిలు తిరగడం చూసిన మనకు యీ పరిణామం మింగుడు పడదు. అలాగే కథలోని రాంబాబుకు కూడా, అందుకే అమ్మాయిలు తప్పుడు పనులు చేసేందుకే ముసుగులు ధరిస్తారనే అపోహ పడుతూ వుంటాడు. అతని ఊహ తప్పని, యాక్సిడెంట్ దాడిలో వికృత రూపాన్ని పొందిన తనకి ముసుగు ధరించడం యెంత అవుసరమో చెప్తుంది మరో ముసుగు అమ్మాయి. మొత్తం కథంతా యింతే, కథ ముగిసేక ముసుగు వెనుక యివి రెండు కారణాలు కాక యింకా యెన్ని వున్నాయో అని అనిపించక మానదు.

నా మటికి నాకు ముసుగు వల్ల ఈవ్ టీజర్ల బాధ వుండదు. వెనుక నుంచి ఫిగరు బావుంది కదా అని ఫాలో అయేనురా ముందు చూస్తే యాక్ ' అనే కామను కామెంటు నుంచి తప్పించుకో వచ్చు. ఇంకా యిలాంటి చాలా (అన్ని కామెంట్ల గురించిన ప్రస్తావన అప్రస్తుతం) పచ్చి కామెంట్ల నుంచి తప్పించుకోవచ్చు. అంటే అందంగా వున్నా కామెంట్ల బాధ తప్పదు, అందంగా లేక పోయినా తప్పదు. అలాగే వాతావరణ కాలుష్యం నుంచి తప్పించుకోడానికి కూడా ముసుగే శరణ్యం. మెడలో మంగళ సూత్రాలను కూడా యీ ముసుగే రక్షిస్తుంది కూడా ! కథ చదివిన తరవాత నాలో గాంధీ గారు స్వాతంత్రం గురించి చెప్పిన 'ఆడవారు అర్ధరాత్రి ధైర్యంగా తిరుగగలగడం' అనే అర్దాన్ని మార్చి 'పట్ట పగలు ఆడ వారు ముసుగు లేకుండా తిరగ గలిగిన నాడు' అని చెప్పుకో వలసిన ధౌర్భాగ్యం వస్తుందేమో అని అనిపించింది.

 ఈ కథను ఈ క్రింది లింక్ లో   చదవచ్చు..http://www.gotelugu.com/issue116/3049/telugu-stories/naaneniki-remdo-vaipu/

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి