శరీరము నుండి వచ్చె దుర్గంధమును అరికట్టటము ఎలా? - అంబడిపూడి శ్యాం సుందర రావు

how to remove bad smell our bady

సామాన్యముగా ప్రతివారు శరీరము నుండి వచ్చే దుర్గంధము వల్ల ఏదో ఒక సందర్భములో భాదను అనుభవిస్తుంటారు . శరీరము నుండి వచ్చే దుర్గందానికి కారణాలు చాలా ఉన్నాయి ముందు అవి ఏమిటో తెలుసుకుందాము. మొదటిది చెమట ఎక్కువగా పట్టడము.దానివల్ల చర్మముపై బ్యాక్టీరియా వృద్ది చెందటము హార్మోనుల ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు ఉండటము ,వ్యక్తిగత పరిశుబ్రత పాటించక పోవటము ,సరిగా ఉతకని బట్టలు వేసుకోవటము,ఉబకాయము,మధుమేహము వంటి అనారోగ్యాలు ,మొదలైనవి. ఇవే కాకుండా తీసుకొనే మందులు ముఖ్యముగా యాంటి డిప్రస్సంట్ ,యాంటి సైక్రియాటిక్ మందులు కూడా కారణాలు ఆయుర్వేదము ప్రకారము సుగంధ పూరిత ఆహారపదార్ధాలను వేపుడు పదార్ధాలను,ఉల్లి, వెల్లుల్లి వంటివి ఎక్కువగా తీసుకోవటమువల్ల పిత్త దోషము ఏర్పడి శరీర దుర్గంధము ఎక్కువ అవుతుంది .

శరీర దుర్గంధాన్ని నివారించటము ఎలా?:- చెమట ఎక్కువగా పట్టే వేసవికాలములో వేప ఆధారిత సబ్బులతో తప్పనిసరిగా రోజుకు రెండు సార్లు స్నానము చేసిన బ్యాక్టీరియా నశిస్తుంది. స్నానము తరువాత టాల్కం పౌడర్ ను శరీరముపై పలుచగా చల్లుకోవాలి లేదా రోజ్ వాటర్ చర్మలోకి ఇంకెలా రుద్దుకోవాలి.  రాత్రి పూట గంధాన్ని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ ల చేసి చెమట ఎక్కువగా పట్టే చంకలలోఅరిచేతిలో పాదాలలో రాయాలి.వీలు అయినంతవరకు తేలికైన వదులుగా ఉండే నూలు వస్త్రాలనే ధరించాలి. ప్రతిరోజు  శుబ్రముగా ఉతికిన పొడి బట్టలనే ధరించాలి స్నానానికి ఉపయోగించి నీటిలో కొన్ని వేప అకులను లేదా వేప బెరడును కలపాలి.ఫలితముగా నీటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి చంకలలో పెరిగే జుట్టును తీసివేస్తు ఉండాలి చందనాది తైలముతో శరీరాన్ని మర్దన చేయాలి .

ఆహారము విషయములో పిత్త  దోషాన్ని పెంచే వాటిని తీసుకోకూడదు కాఫీ టీలు తక్కువగా తీసుకోవాలి మద్యపానానికి దూరముగా ఉండాలి వీలైతే గ్రీన్ టీ లేదా ధనియాలుతో తయారుచేసిన టీ త్రాగాలి కూరలలో దోస,కాకర,సొర,గుమ్మడి వంటివి ఎక్కువగా తినాలి. నీరు ఎక్కువగా త్రాగాలి. నిమ్మరసము కలిపినా నీరు, పుచ్చకాయలు ఎక్కువగా తీసుకోవచ్చు పిత్తదోష నివారణకు త్రిఫల చూర్ణముతో తయారుచేసిన కషాయాన్ని తీసుకోవాలి ఒక చెంచా మెంతులను రాత్రి నీటిలో నానాబెట్టి ఉదయాన ఖాళీ కడుపుతో త్రాగాలి . యోగ ప్రాణాయామము నిత్యము చేస్తు ఉండాలి లావుగా ఉంటే సన్నబడటానికి ప్రయత్నిస్తే ఫలితము ఉంటుంది

ఈ విధముగా మంచి అరోగ్యకరమైన అలవాట్లు పద్దతులు మంచి ఆహారము ద్వారా  శరీర దుర్గంధాన్నినివారించ వచ్చు  ప్రయత్నించండి .  

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి