1. వెంకటమ్మ గారి భర్తకి కాలుకి ఆక్సిడెంట్లో దెబ్బ తగిలి మంచాన పడ్డారు . . . .
ఆవిడని పరామర్శించడానికి పక్కింటి పిన్ని గారు వచ్చారు . . . . . .
పిన్నిగారిని చూడగానే ఏడుపు ఆపుకోలేక . . . . . . . . . .
ఎంత పని జరిగింది పిన్నిగారు, ఇలా జరుగుతుందని నేనస్సలు అనుకోలేదు, ఎంతో
ఆశపడి దీపావళికి పట్టు చీర కొనుక్కుందామని దాచుకున్న డబ్బంతా ఈయన
హాస్పిటల్ బిల్లులకే ఖర్చు చేస్తానని ఊహించలేదు పిన్నిగారు అయ్యో . . . .
. . .
పిన్ని గారిని పట్టుకుని ఏడవ సాగింది . . . . . వెంకటమ్మ
******************************************************************
2. పండక్కి మీ అత్తారింటికి వెళ్తున్నావా ........ ఆహా నీదిరా
అదృష్టమంటే ....... ,
పెళ్లయి పదిహేళ్లయినా . . . . . ఇంకా పండగలకి మీ అత్తరు
పిలుస్తున్నారంటే . . . . నువ్వురా అదృష్ట వంతుడవు
మిత్రుడి అదృష్టాన్ని పొగడసాగాడు సాంబయ్య . . . . . . .
వైభవమా నా బొందా . . . . . ,
పండగలకి పిండి వంటలు చేయడంలో మా మామకి సాయంగా ఉంటానని పట్టుబట్టి
తీసుకెళ్తాడు మా మామయ్యా . . . . . . .
అసలు విషయం కక్కాడు శివయ్య .
******************************************************************
3. ఒకావిడ కొరియర్ బాయ్ తెచ్చిన పార్సెల్ ఓపెన్ చేసి చూసి , ఏడవడం మొదలు పెట్టింది
ఏమైంది సరూ . . . . . . . అడిగాడు భర్త
ఫిఫ్టీ పెర్సెంట్ డిస్కౌంట్ దీవాళీ ఆఫర్ అంటే ' షూ ' ఆర్డర్ చేసానండి .
అయితే ఏం ....... షూ పంపలేదా ?
పంపారు ఫిఫ్టీ పెర్సెంట్ డిస్కౌంట్ లో
ఒక్క కాలుదే . . . . . . . . .!!!!!!!!!!!
******************************************************************
4. వెర్రి నాగన్న ; నేనింత జాగర్తగా కవర్ చేసాను , నేను దీపావళి
టపాసులు కాల్చలేదు , ఇదంతా
బిల్డప్ అని ఎలా కనిపెట్టావురా ?
మిత్రుడు ; ఒరేయ్ వెర్రోడా టపాసులు పేల్చితే వేళ్ళు కాలతాయ్
లేదా చేతులు కాలతాయ్ ,
మోచేతులు కాలవురా . . . . . . మోచేతుకి కట్టు
కట్టావ్ అది విప్పేయిరా
******************************************************************
5. నేను పంపిన దీపావళి టపాసులు బాగా పెలాయా బుజ్జి . . . . . .
ఫోన్లో అడిగాడు బుజ్జి గాడి మామయ్యా . . . . . . .
ఓ బ్రహ్మానందంగా పేలాయి మామయ్యా . . . . .
కాకపోతే మీరు టపాసులు కొన్న షాపు వాడు వాటికి సైలెన్సర్ బిగించి ఇచ్చి
నట్లున్నాడు . . . . .
అన్నీ ........ తుస్సు . . . . . . . బస్సు . . . . . . పుస్. . . . . .
. . అన్నాయ్
******************************************************************
6. టపాసులు పట్టు కున్నారా ?
లేదు అట్లు పట్టుకున్న . . . . . !
అట్లు పట్టుకుంటే చెయ్యేలా కాలింది . . . . ?
అట్లు వేడిగా కావాలి పోగలుకక్కాలి అని గద్దించి అడిగా మా ఆవిడని ,
అట్ల పెనంతో సహా చేతిలో పెట్టింది మాయావిడ !
******************************************************************
7. అత్యంత విలువయిన దీపావళి గిఫ్ట్ తీసుకోండి అంటూ కుటుంబ సభ్యులందరికి
తల ఒక బాక్స్
అందించాడు పెద్దాయన . . . . . . . . .
అందరు ఎంతో ఉత్సాహంగా , ఆతృతగా కాస్ట్లీ గిఫ్ట్ అయి ఉంటుందనుకుంటూ బాక్స్ ఓపెన్
చేశారు . . . . . . . . .
బాక్స్ లో ఒక కాగితపు లక్ష్మి దేవి పటం పైన . . . . " లక్ష్మి కటాక్ష
సిద్ధిరస్తు " మీ అందరికి నా దీపావళి శుభాశీషులు , పెద్దల
ఆశీషులకంటే విలువైనది ఏముంటుంది ఈ లోకంలో
అని రాసి ఉంది .