"జానకీ ! జానకీ ! ఎక్కడున్నావమ్మా!?" అంటూ గాభ రాగా వచ్చింది పక్కింటి పిన్ని పంకజాక్షి.వంటచేస్తున్న జానకి కొంగుకు చేయితుడుచుకుంటూ ,"ఏమైంది పిన్నిగారూ ! అంత కంగారుగా ఉన్నారు?" అంటూ బయటి కొచ్చింది. చెమటలు కక్కుతున్న ముఖాన్నీ చీరకొంగుతో తుడుచుకుంటూ , "ఏముందమ్మా! తల్లీ తండ్రీ ఆదివారమైనా అర్జంట్ మీటింగని ఆఫీసులకెళ్ళారు. మా మనవడు మధుగాడికేమో ఇప్పుడే జామ పండు కావాలిట ,అది ఇస్తే కానీ పాలైనా త్రాగట్ట , వాడిని తీసుకుని పండ్ల మార్కెట్ కెళ్ళి వచ్చానమ్మా! ఇది జాంకాయల సీజన్ కాదు ఇప్పుడప్పుడే రావని చెప్పా రమ్మా! మీ పెరట్లో జామ చెట్టుంది కదా! ఒక్క కాయేమైనా ఉంటుందేమోని వచ్చా నమ్మా! కాస్తంత చూడవూ!" అని బ్రతిమాలుతున్న పంకజాక్షి ని చూసి చిరునవ్వుతో, " పిన్నిగారూ !మీ మధు గాడ్ని మాఇంటికి పంపి మీరెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి.
ఈ ఏప్రిల్ నెల్లో ఇంతెండలో మార్కెట్ కెళ్ళివచ్చారా! అసలే బీ.పీ., షుగరూనూ. నేనిక్కడే ఉంటాను. మీరెళ్ళి వాడ్ని పంపండి" అంటూ ఆవిడ్ని సాగ నంపింది. వాళ్ళ గేటు వద్దే గెద్దలా కాపున్న మధుగాడు లోపలికిరాగానే "రా !మధూ ! మాపెరట్లోని చెట్టుకు ఎన్ని పండ్లుంటే అన్నీ కోసేసుకో అచ్చంగా నీకే !నేనూ సాయం చే స్తాగా!"అంటూ వాడ్నిలోనికి పిలిచి తలు పేసుకుంది జానకి. వాడు పెరట్లోకెళ్ళి తలెత్తి చెట్టుకేసి చూడసాగాడు ,ఒక్క పండైనా దొరక్కపోతుందాని. జానకి వంటపని పూర్తిచేసుకుని వచ్చి తులసమ్మ అరుగుమీద కూర్చుని వత్తులు చేసుకుంటూ " మధూ ! నీవు ఐదోక్లాస్ చదువుతున్నావ్ కదా! నీ కసలు చెట్ల గురించీ ఏమైనా తెల్సా?" అంటూ మొదలెట్టింది.
&&&
జామ పండ్లు ఏడాది పొడవునా అక్కడక్కడా దొరికినా శీతాకాలం లోనే బాగా వస్తాయి , అప్పుడే వాటి రుచి చాలా బావుంటుంది .తొలి కాపు జూలై, ఆగష్టులలో వస్తుంది. రెండో కాపు నవంబర్‌లో మొదలై జనవరి వరకు కాస్తుంది. ప్రపంచంలోఅన్ని దేశాలలోనూ జామపండ్లు పండుతాయి. జామ పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది . అది తెలీకుండా నే జామపండు తినటానికి అందరూ ఇష్టపడతారు. దొరికే రోజుల్లో జామపండు ప్రతి రోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా మగ్గిన జామ పండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనె ను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి వెంటనే పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు.
జామ లేక జామిని ఆంగ్లం లో ‘గొవా ‘అం టారు. ఇది మనదేశంలో మన ఇళ్ళలో పెరిగే చెట్టు. దీనిని ఇళ్ళలో పం డ్ల కోస మే పెంచుకుంటారు.
జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.చిన్నవి, పెద్దవి, కోలగా కూజాల్లా ఉండేవి కూడా ఉంటాయి. శీతోష్ణస్థితి బట్టి 100 రకాలుగా ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో,మధ్య ,దక్షిణ అమెరికాలకు చెందినవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు వరకుఉంటూ చూట్టానికి ఆపిల్ పండులాగాకానీ, బేరి పండులాగా కానీఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా విత్తనాలతో కలసి ఉండి కమ్మని వాసనతో ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ- బ్రెజిల్ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కాస్తుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక ప్ర త్యేక మైన సువాసనతో , నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ రంగుతో ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉంటాయి.
ఉడికించిన జామను కాండీలు (అమెరికాలోని స్వీట్స్) జాములు, నారింజతో చేసే జాములు, రసాల తయారీలో ఉప యోగిస్తారు. టొమాటోలకు బదులు గా, ఎర్రజామ ఉప్పుతో చేసే ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జామ పళ్ల నుంచి, ఆకులనుంచి 'టీ' కూడా తయారు చేస్తారు.
జామ పళ్లను 'మేలైన ఫలాలుగా' చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్ 'ఏ', విటమిన్ 'సి' అధికంగా లభిస్తాయి. వీటి గింజలు కూడా ‘ ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి.
ఒక జామపండులో విటమిన్ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంటాయంటే నమ్మ లేము .! కానీ ఇది యదార్ధం. వీటిలో మిన రల్స్, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు ఎక్కువగానూ, పోషకాలు తక్కువ కేలరీలలోనూ ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్- ఆక్షీకరణం కాని సహజ రంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలుగ జేస్తాయి.
నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్, బాక్టీరి యా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్లకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంలో ’ డయేరి యా ‘కి మందుగా ఉపయోగి స్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్, ఏస్ట్రింజంట్ లక్షణాన్ని కలిగి ఉంది. వీటితో షుగర్ వ్యాధి ని కూడా తగ్గిస్తారు. . కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి ‘ రెడ్ గోవా ‘అనే పేరుతో మార్కెట్లలో అమ్ముతారు. ఎర్రని జామపండ్లను మధ్యకు పువ్వులాకోసి ఉప్పుకారం చల్లి బండ్లమీద అలంకారంగా ఉంచి అమ్ముతుంటే చూసేవారి నోరూరి కొనితినక తప్పని పరిస్థితి.
జామ పండులో 100 గ్రా.లలోలభించే పోషకాలు సాధారణాంగా ఇలాఉంటాయి
కాలరీలు 36-50 ,తేమ 77-86 గ్రా ,పీచు 2.8-5.5. గ్రా ,ప్రొటీన్స్ 0.9-1.0 గ్రా ,క్రొవ్వు 0.1-0.5 గ్రా, యాష్ 0.43-0.7 గ్రా ,కార్బోహైడ్రేట్లు 9.5-10 గ్రా, కాల్షియం 9.1-17 గ్రా ,పాస్ఫరస్ 17.8.30 మి.గ్రా ,ఐరన్ 0.30-70 మి.గ్రా ,కెరోటీన్ - విటమన్ 'ఏ'- 200-400 ,ఎస్కార్బిక్ ఆంలము అంటే విటమిన్ 'సి'- 200-400 మి.గ్రా. ,ధియామిన్ అంటే విటమిన్ బి1- 0.046 మి.గ్రా, రిబోప్లేవిన్ -విటమిన్ బి2- 0.03-0.04 మి.గ్రా ,నియాసిన్ -విటమిన్ బి3- 0.6-1.068 మి.గ్రా లభ్యమవుతుంటాయం టే ఎంతో ఆశ్చర్యం కదూ!
జామ ఆసియా దేశాల్లో అత్యధికగా పండ్ల నిస్తుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది . చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచను అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తి శరీరంలో జరగను ఇది కీలకం గా పని చే స్తుంది. కొవ్వు ‘మెటబాలిజం’ ను ప్రభావితం జేసే " పెక్టిన్" జామ లో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి , పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడం లోనూ పనిచేస్తుంది . జామ పండులో కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం హాయిగాతినవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధి కంగా ఉంటుంది. జామకాయలో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం రాదు. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .
అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. ఆకలి మంద గించిన వారికి ఈపండు తినడం వల్లా బాగా ఆకలి పుడుతుంది. ఆహారం తినాలనే కోరికా కలుగుతుంది .
ముఖ్యంగా మన గ్రామప్రాంతాల్లో ఇళ్లలోనూ, తోటల్లోనూ జామ చెట్లు ఉండటం వల్ల జామకాయ అంటే మనకు చిన్నచూపు. ‘ పెర టి చెట్టు ‘మందుకు పనికిరాదనే మాట ఇలానే వచ్చింది. పది ఆపిల్స్ తిన్నదానికంటే ఒక జామ కాయ తింటే పోషకాలు తగినంత గా లభిస్తాయని పోషకాహారనిపుణులు చెప్తున్నారు. పూర్వం ప్రతి ఇంటా జామ చెట్టు ఉండేది. ప్రస్తుతం దురదృష్ట వశాత్తూ పట్టణీకరణ, కాంక్రీట్ గృహాలూ, రోడ్ల విస్తరణ పుణ్యమా అని జామకాయ లు మొహం వాచినట్లు కొని తినాల్సిందే!
ఎన్నో పోషక విలువలున్న జామకాయ నిజంగా దివ్యవౌషధంమే! ఆహారం తీసుకున్నాక జామకాయో, పండో తింటే తొందరగా జీర్ణమవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు దూరమవుతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారికీ మంచి ఆహారం. రోజూ దోర జామకాయ తింటే ‘ ప్రోస్టేట్ క్యాన్సర్ను’ అరికట్టవచ్చు. పచ్చికాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టి పడతాయి. విటమిన్-సీ అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది.
పచ్చి జామ కాయ ముక్కలను కప్పెడు తీసుకొని బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైంధవ లవణా న్ని వేసి, మెత్తగా పొడి చేసి సీసాలో నిల్వ చేసుకొని ప్రతిరోజు పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టిపడడమే కాక చిగుళ్ల సమస్యలు రావు. బాగా పండిన జామ పండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మరసం పిండి తింటే మల బద్ధక సమస్య దూర మవు తుంది. అతిసార, జిగట విరేచనాలు, దోర జామకాయను కషాయం గానీ, మజ్జిగలో కలుపుకొని గానీ తాగితే చక్కని ఫలితం కనిపిస్తుంది .
బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తీసేసి పాలు, తేనె కలిపి తింటే విటమిన్-సీ, క్యాల్షియం అధికంగా లభిస్తాయి. పెరిగే పిల్లలు, గర్భిణులు దీనిని టానిక్లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంటలాంటి అనేక రకాల సమస్యలకు నివారణ కలిగిస్తుంది.
జామపండు అధిక దప్పిక ను తగ్గిస్తుంది. దోర జామపండును సానరాయి మీద గంధం చేసి, నుదుటి మీద లేపనంలా రాస్తే, తలనొప్పి తగ్గుతుంది. మైగ్రెయిన్తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందే చేస్తే చక్కని ఫలితం కనిపి స్తుంది. అతినీల లోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయలో ఉండే’ లైకో పిన్ ‘ అడ్డు కుంటుంది. జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బిపి పెరగకుండా చేస్తాయి. జామకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్(బి 6, బి 9) ఇ, కె విటమిన్లు ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామ కాయ ఎంత గానో సహాయపడుతుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. జామపండు పేదవారికి ఆపిల్ పండులాగా మేలు చేసే తక్కువ ధరకు లభించే పండు . హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన రీసెర్చ్ లో జామపండు మన ఆరోగ్యాన్ని కాపాడగల అన్ని పోష కాలూ ఉన్నట్లు బయటపడింది. ఆకులో విలువై న పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉన్నాయని మరువ రాదు. దోరగా ఉన్న జామ కాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరంటే అతిశ యోక్తి కాదు. కొందరికి పచ్చికాయలు నచ్చితే, మరి కొందరికి పండ్లమీద మన సు . ఏదే మైనా పిల్లల నుండి పెద్దల వరకూ ఇష్టపడేది జామకాయనే. మనం ఆరోగ్యంగా ఉండటానికి మనకు యాంటీ-ఆక్సిడెంట్స్ ముఖ్యంగా కావాలి. మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. వయసు పెరిగిన కొద్దీ మనలో ఉన్న కొన్ని జీవ కణాలు కూడా పాడవుతూ ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్స్ ఈ జీవ కణాలు పాడైపోకుండా కాపాడతాయి. వయసుతో పాటు మనకు ఏర్పడే ‘ డీ-జెనరేటివ్ ‘ వ్యాధులనూ, క్యాన్సర్ వ్యాధినీ ,ముసలితనాన్నిఅరికట్టడంలో సహాయపడుతుంది. కనుక ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ మనకు చాలా అవసరం. జాలీనిచ్చే జామనితింటూ జాలీజాలీగా జీవిద్దాం. &&&& "జామపండుకోసం ఇంతా బాధపడకపోతే ఒక జామ మొక్కను నీవే మీ పెరత్లో వేసుకుని రోజూ నీరుపోసి పెంచు కుంటే నీకు సీజన్లో కావల్సినన్ని జామ పండ్లు తింటూ, అందరికీ పంచుతూ చక్కని పోషకాలు శరీరానికి అందించు కుంటూ, మీ బామ్మని జామపండుకోసం బాధపెట్టకుండా ఉండచ్చుగా! నీవేం పసి పిల్లాడివికాదుగా! ఇదుగో మా ఇంట్లో మొలిచి ఉంది జామ మొక్క తీసుకెళ్ళి నాటు, రోజూ నీవు స్నానం చేసే నీరు వెళ్ళేలా పాది, కాలువచేయి.3,4 ఏళ్ల కల్లా కావల్సి నన్ని పండ్లు. మన తాతలు వేసిన పండ్లు మనం తింటున్నాం. నీవువేసిన చెట్లపండ్లు నీతర్వాతి తరాలవారు హాయిగా తింటారుగా మధూ! అదిగో ఆచిటారు కొమ్మకు అరమాగిన జామ నీకోసమే కాచినట్లుంది , ఈ కొడవలి కర్రతో ఇలా కొయ్యాలి, ఇంద తీసుకో రేపటికి బాగాపండుతుంది. తినేం-- " అంటూ తన పెరట్లోని ఒక జామ మొక్కను తీసి ఇవ్వగానే " థాక్స్ ఆంటీ ఈరోజు జామ గురించీ బోలెడన్ని విష యాలు తెల్సుకోడమే కాక జామ మొక్క , నాకోపండూ కూడా నాకు ఇచ్చారు, వెంటనే నాటి పెంచుతాను " అంటూ తన ఇంటి కేసి తుర్రుమన్నాడు మధు.