మెదడుకు హానిచేసే ఆహార పదార్ధాలు - అంబడిపూడి శ్యామసుందర రావు

harmful food items for brain

మనము గుండెకు, కాలేయానికి మూత్రపిండాలకు జీర్ణ వ్యవస్థకు హానిచేసే ఆహారము గురించి విన్నాము కానీ మన శరీరములోని అతి ముఖ్యమైన అవయవము మెదడు కు చెడు చేసే ఆహారము గురించి మనకు అసలు తెలియదు మనము పట్టించుకోము. సాధారణముగా
మధ్యాహాన్నము భోజనము చేసినాక అలసిపోయినట్లు మందకొడిగా ఉండాటాన్ని గమనించవచ్చు ఎందుకంటే మనము తిన్న ఆహారము మెదడు మీద ప్రభావము చూపించి ఉంటుంది,మెదడు చురుకుగా పనిచేయటానికి మనము ఎటువంటి ఆహారాన్నితగ్గించాలో తెలుసుకుందాము.

1.చక్కర :-సాధారణముగా అందరు చెప్పేది ఎక్కువ చక్కర తీసుకోవటం ఆరోగ్యానికి హాని అని. ఎక్కువకాలం చక్కర ఎక్కువ తీసుకోవటము జరిగితే నాదీ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి ఎక్కువ చక్కరలు తీసుకోవటం వల్ల కొత్త విషయాలు నేర్చుకొనే శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా తెలుసుకొన్న విషయాలను మెదడు ఎక్కువ కాలము జ్ఞాపకము ఉంచుకోలేదు. అందువల్ల రోజుకి మగవారు పది చెంచలా
చక్కర, ఆడవారు ఆరు చెంచలా చక్కర మించి తీసుకోరాదు, 

2.ఉప్పు:-ఉప్పు రక్త పీడనానికి సమస్యలను కలుగజేస్తుంది. హార్ట్ బీటింగ్ ను పెంచుతుంది,జీర్ణ వ్యవస్థకు శ్వాస వ్యవస్థకు కూడా హాని చేస్తుంది. ఉప్పు శరీరానికి అవసరము కానీ ఎక్కువ మోతాదులో ఉండకూడదు. మెదడు మిగిలిన అవయాలు మాదిరి గానే  కార్డియో వాస్కులార్ సిస్టమును వినియోగించుకుంటుంది కాబట్టి ఇతర వ్యవస్థలకు హానిచేసే ఎక్కువ ఉప్పు మెదడుకు కూడా హానిచేస్తుంది. రోజుకు ఒక టీస్పూన్ ఉప్పు తీసుకుంటే చాలు యాభై ఏళ్ళు దాటినవారు మధుమేహ వ్యాధిగ్రస్తులు దీర్ఘ కాళికా మూత్రపిండాల వ్యాధులతో
భాధపడేవారు టీస్పూన్ లో సగము ఉప్పు తీసుకుంటే మంచిది. 

3.జంక్ ఫుడ్ :- నేటి యువత, పిల్లలు బర్గర్లు ,పీజ్జాలు లాంటి జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు ఈ జంక్ ఫుడ్ వ్యసనంగా మారే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఈ జంక్ ఫుడ్  లోని డోపమైన్ అనే రసాయనము (ఇది సంతోషానికి తృప్తికి కారణము) విత్ డ్రాయల్ లక్షణాలుగా డిప్రషన్ మరియు ఆందోళనలను కలుగజేస్తుంది. డోపమైన్ స్థాయిలు ఎక్కువ అయితే జ్ఞాపక శక్తి సన్నగిల్లితుంది చాలా అరుదైన సందర్భాలలో అల్జీమర్స్ వ్యాధి కి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ జంక్ ఫుడ్స్ ను తినవచ్చుకాని రోజు ఎక్కువగా తినరాదు నిపుణుల అభిప్రాయము ప్రకారము ఆహారములో 500కెలోరీల మించి జంక్ ఫుడ్ ఉండరాదు. అసలు సమస్య ఏమిటి అంటే ఏ జంక్ ఫుడ్ అయినా 800కెలోరీలు మించి ఉంటుంది. అందుకనే విదేశాలలో జంక్ ఫుడ్ అమ్మే రెస్టారెంట్లలో వాటి కెలొరీలనుకూడా ప్రదర్శించాలని చట్టాలు ఉన్నాయి కానీ మంకు అటువంటి చట్టాలు ఏమీలేవు 

4. ఫ్రైడ్ ఫుడ్ (వేయించిన ఆహార పదార్ధాలు):- సన్ ఫ్లవర్ ,అవిసె గింజలనూనె వంటి నూనెలు ఆల్డిహైడ్స్ ను విడుదల చేస్తాయికొద్దిపాటి వేడికే ఈ ఆల్డిహైడ్లు మెదడుయొక్క కార్యకలాపాలకు భంగము కలిగిస్తాయి . ఈ  వేపుడు ఆహారపదార్ధాలు కూడా జంక్ ఫ్డ్ మాదిరి  గానే  వ్యసనంగా మారుతాయి.  2008లో  జరిపిన పరిశోధనలలో ఫ్రైడ్ ఫిష్ తిన్నవారిలో మెదడుకు సంబంధిచిన ఇబ్బందులను
MRI స్కాన్ ద్వారా గుర్తించారు. కాబట్టి వేయించిన ఆహార పదార్ధాలు తీసుకోవాతాము అంత  మంచిదికాదు తప్పదు అనుకున్నప్పుడు సం ఫ్లావర్, అవిసెగింజల నూనెలను వాడకుండా పామ్ ఆయిల్ ను వాడటం మంచిది. 

5. కృత్రిమ తీపి కారకాలు(ఆర్టిఫిషీయల్  స్వీటెనర్స్):- ఎస్పార్టమ్ అనే రసాయనం ఎక్కువగా కృత్రిమ తీపి కారకాలలో ఉపయోగిస్తారు.పరిశోధకులు దీనిని వాడటం మంచిది కాడి అని చెపుతారు ఎందుకంటే ఇది బ్రెయిన్ క్యాన్సర్ ను వృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కృత్రిమ తీపి కారకాలు మెదడు లోని ఎనర్జీ స్థాయిలను తగ్గిస్తాయి వీటి వాడకం ఎక్కువ అయితే మెదడు చేసే
పనులు నెమ్మదిస్తాయి . ఈ కృత్రిమ తీపి కారకాలు మనము నిత్యమూ వాడే టూత్ పేస్ట్ ,మౌత్ వాష్  చప్పరించే విటమిన్ మాత్రలు మొదలైన వాటిలో కూడా ఉంటాయి సాఖరిన్ కలిగిన కృత్రిమ  తీపికారకమును రోజుకు 8 సాచెట్స్ తీసుకుంటే అది రెండు క్యాన్ల సాఫ్ట్ డ్రింక్ ( పెప్సీ కోకోకోలా వంటివి) తో సమానము అటువంటిది అదే పరిమాణము లోని  ఎస్పార్టమ్  32 సాచెట్లకు సమానము అంటే
8క్యాన్ల సాఫ్ట్ డ్రింక్  తాగినట్లే 

6. ట్రాన్స్ ఫ్యాట్స్ (మార్పుచెందే క్రొవ్వులు):- డిమెన్షియా వ్యాధి గ్రస్తులు కానీ పెద్దవారిని వారిపై పోషక ఆహారము ప్రభావము గురించి
పరిశీలిస్తే ట్రాన్స్ ఫ్యాట్స్ మెదడు కుంచించుకు పోవటానికి  కారణముగా గుర్తించారు .అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అల్జీమర్స్ లో లాగా పనిచేస్తాయి. అమెరికా లోని FDA సంస్థ రాబోయే రోజుల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ నిషేదానికి గురికావచ్చు అని తెలిపింది. మనము తినే ఆహారం 2,000 కెలోరీలు గనుక అయితే దానిలొ ట్రాన్స్ ఫ్యాట్స్ 13గ్రాముల మించి ఉండరాదు అంతకన్నా తక్కువ ఉంటేనే మంచిది.

7. తొఫు  (సోయాబీన్ పాలనుండి తయారైన మాంసకృత్తులు అధికముగాకలిగిన ఆహారము):- శాఖాహారులు మాంసమునకు మారుగా మాంసకృత్తులకోసము దీనిని ఉపయోగిస్తారు. కానీ ఇది నాడీసంబంధమైన సమస్యలను కలుగజేస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు 52 - 98 ఏళ్ల మధ్య వారిని పరిశీలిస్తే ఎక్కువ తొఫు తిన్నవారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోవటం ,డిమెన్షియా వ్యాధి లక్షణాలను గమనించారు. కాబట్టి రోజుకు రెండు కప్పుల తొఫు మించి తీసుకోవటము  మెదడుకు హానికరం అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. 

8.ఆహారాన్ని నిల్వచేయటానికి వాడే ప్రిజర్ వేటివిస్ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహారము (క్యాన్లలో ఉండే జాములు లాంటివి) :-ఆహారాన్ని నిల్వచేయటానికి వాడే ప్రెజర్ వేటివ్స్ రంగుకోసము,సువాసన కోసము కలిపే పదార్ధాలు వాటిలో ఉండే రసాయనాలు మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి మెదడులోని కణాలను నశింపజేసి  మెదడును దెబ్బతీస్తాయి కాబట్టి ఇటువంటి రసాయనాలతో నిలవ చేసిన ఆహారము కన్నా తాజా ఆహారాన్ని తినడమే మేలు కాబట్టి మెదడును రక్షించుకోవటానికి, అల్జీమర్స్ డిమెన్షియా వంటి వ్యాధుల
బారి పడకుండా ఉండాలంటే పైన చెప్పిన ఆహార పదార్ధాలను దూరముగా ఉంచాలి. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి