నవ్వండి - నవ్వించండి - పోడూరి వెంకటరమణ శర్మ

 

1,  టీచర్ : రామూ నేను నీకు రెండు పిల్లుల్ని ఇచ్చాను, మళ్ళీ ఇంకో రెండు పిల్లుల్ని ఇచ్చాను ఆతరువాత ఇంకో రెండు పిల్లుల్ని ఇచ్చాను 
మొత్తం ఎన్ని పిల్లులు?
రాము : ఏడు పిల్లులు 
టీచర్ :  కాదు సరిగ్గా విను నేను నీకు రెండు పిల్లుల్ని ఇచ్చాను, మళ్ళీ ఇంకో రెండు పిల్లుల్ని ఇచ్చాను ఆతరువాత ఇంకో రెండు పిల్లుల్ని ఇచ్చాను 
మొత్తం ఎన్ని పిల్లులు?
రాము:  ఏడు 
టీచర్:  ఇంకోవిధంగా చెబుతాను నేను నీకు రెండు ఆపిల్స్ ఇచ్చాను మళ్ళీ ఇంకో రెండు ఆపిల్స్ ఇచ్చాను ఆతరువాత ఇంకో రెండు ఆపిల్స్ ఇచ్చాను 
మొత్తం ఎన్ని ఆపిల్స్?
రాము : ఆరు 
టీచర్: వెరీ గుడ్ ఇప్పుడు విను నేను నీకు రెండు పిల్లుల్ని ఇచ్చాను, మళ్ళీ ఇంకో రెండు పిల్లుల్ని ఇచ్చాను ఆతరువాత ఇంకో రెండు పిల్లుల్ని ఇచ్చాను 
మొత్తం ఎన్ని పిల్లులు?
రాము : ఏడు 
టీచర్: నీకు ఏడూ ఎక్కడినుంచి వచ్చాయిరా చవటా ?
రాము : ఎందుకంటే మీరు ఇవ్వకముందు నా దగ్గర ఒక పిల్లి ఉందిగా! 

__________________________________________________________________________________

2. ఉద్యోగి: సార్ రెండు  రోజులు సెలవు కావాలి 
యజమాని:  ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఆలోచిస్తాను 
ఉద్యోగి: అలాగే సార్ 
యజమాని:  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?
 ఉద్యోగి :  లీవ్ అడిగితే ఇవ్వనని అని ఉంటాడు సార్ 
యజమాని: సర్లే నువ్వు వారం రోజులు లీవ్ తీసుకో 

__________________________________________________________________________

3. ప్రొఫెస్సర్: నీకు ఎలాంటి భార్య కావాలి రాజూ ?
రాజు :   సార్ నాకు చంద్రుడు లాంటి భార్య కావాలి సార్ 
ప్రొఫెస్సర్: అంటే నీకు కామ్ గా కూల్ గా ఉండే భార్య కావాలి అన్న మాట 
రాజు : కాదు సార్ 
ప్రొఫెస్సర్:  మరి తెల్లగా అందంగా ఉండే భార్య కావాలన్నమాట 
రాజు:  లేదు సార్ రాత్రి వచ్చి ప్రొద్దుటే వెళ్లి పోయే భర్య సార్ 

__________________________________________________________________________________


4. కొట్టు యజమాని ఒక కస్టమర్ సిగరెట్టు కాలుస్తోంటే ఇలా అన్నాడు 
" సార్ ఇక్కడ సిగరెట్టు కాల్చకూడదు"
కస్టమర్ :  ఇక్కడే నీ దగ్గరే కొన్నాను కాదయ్యా 
యజమాని:  మేము మోషన్ టాబ్లెట్స్, ప్రొటెక్షన్ లు కూడా అమ్ముతాము సార్ 

_____________________________________________________________________________________

5. మేనేజర్ తన కింద పనిచేసే రామారావు కిఫోన్ చేసి 
రామారావు ' గో తెలుగు కి జోక్స్ పంపాలి రెండు జోక్స్ వెంఠనే చెప్పవయ్యా"
రామారావు : సార్ ఓ పని సీరియస్ గా చేస్తున్నాను అది అవగానే చెబుతాను సార్ 
మేనేజర్:  అహ్హ హ్హ : బలే జోక్ చెప్పవయ్యా. మరి రెండోది?

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి