మోసంబి -- బత్తాయి . - హైమాశ్రీనివాస్.

mosambi battaayi

" నాకిప్పుడే బత్తాయిరసం కావాలి,ఆకలేస్తున్నది " అంటూ మారాం చేస్తున్న మాలిగాడిని ఊర్కోబెట్టను శత విధాలాప్రయత్నించి.చేతకాక ,"సరే బజారెళ్ళి ఆజ్యూస్ కొనుక్కొస్తాను, కాయలు మార్కెట్లోకి ఇంకారాలేదురా నాన్నా! "అంది. "ఊహూ ఆరసం నాకదొద్దు ,ఇంట్లోనే బత్తాయి కాయలు తెచ్చి , రసం తీసి ఇవ్వు." అంటూ గోలమొదలెట్టాడు.ఏంచేయాలో తోచక అయోమయంగా తల పట్టుకు కూర్చున్న తపతి,  డోర్ బెల్ మోగడం తో వెళ్ళి తీసింది.

" ఏం తపతీ!అలా చికాగ్గా ఉన్నావు? ఇంద ఈ బత్తాయిలు రసం తీసుకు త్రాగు కాస్తంత ఓపికొస్తుంది" అంటూ బత్తాయిలున్న సంచీ అందించింది స్నేహితురాలు సంధ్యం.

" అబ్బా! సంధ్యా !దేవుడు పంపినట్లు వచ్చావే! ఉదయం ఉంచీ మా మాలిగాడు బత్తాయిరసం కావాలని ఒకటే పోడు పెడుతున్నాడు. థాంక్సే!"అంది.

"థాంక్సెందుకే! నిన్నటినుంచీ రావాలని ప్రయత్నం ,కానీ కుదర్లేదు. బత్తాయిచెట్లు రెండూ ఈ ఏడాది తెగకా శాయి, నిన్ననే పనివాళ్ళ చేత దింపించాను, అందరికీ పంచుతూ ,ఇదో నీకివ్వను ఇప్పటికి తీరింది." అంది ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ సంధ్యం.

"ఎంత దృష్టమే ! మీ ఇంట్లో ఎన్ని పండ్ల చెట్లు? జామ, నిమ్మ, మామిడి,సపోటా బత్తాయి! పదహారు పండ్ల నోము నోచుకున్నట్లు ప్రతి ఏడాదీ అందరికీపండ్లు పంచుతూ భలే పుణ్యం సంపాదించు కుంటున్నావే! ఉండు కాఫీ చేస్తాను " అంటున్న తపతి ఆపి,

"వద్దే ఇప్పుడే బత్తాయి రసం తాగొచ్చాను. ఈ ఏడాది పళ్ళలో నిండా రసం ఎంత బావుందో!  అదునులో వాన లు పడి మంచి రసం పుంజు కున్నాయి బత్తాయిలు. మనం ఎంత నీరు పెట్టినా సహజంగా పడ్డ వర్షాలతో సమానం కాదు గదా!సరేముందు మాల్యాద్రికి రసం తీసివ్వు. పాపం బత్తాయి రసం కావా లంటున్నాడన్నావ్! పాపం వాడికి ఆకలేస్తున్నదేమో! ""ఔనే! వాడికి మూడురోజులుగా జ్వరం, డాఖ్తరేమో  బత్తాయిరసం మూడు పూటలా ఇవ్వమన్నాడు.అందుకే వీడి గోల!" అంటూ రసం తీయసాగింది తపతి. 

బతావియయను ద్వీపమునుండి బటేవియాజాతి వారినుండీ వచ్చిన  నారింజపండుకనుక దానిని వాడుక క్రమంలో బత్తాయిగా పిలుస్తున్నారు.  ఇది ఆ బటేవియాజాతి వారి రుచి కరమైన నిమ్మపండు .  హిందీలో మోసంబి అంటారు. గజనిమ్మ అని నెల్లూరీయులూ,చీనీపండు అని రాయలసీమవారూ, సాత్కుడి అని దక్షి ణాదివారూ బత్తాయి ని పిస్తుంటారు.  పెదనిమ్మ, అనేది కళింగ ,రాయలసీమ మాండ లిక నామం . బత్తాయి, మోసంబి, నిమ్మ అనేది తెలంగాణ మాండలిక నామం. ఎవరెలా పిలిచినా బత్తాయి బత్తాయే, దాని రుచి, అది చేసేమేలు ఏనామంతో పిలిచినా ఒకటే!  

బత్తాయిపండు  ఒక తియ్యని రసం ఉన్నపండు.ఇది రూటేసి కుటుంబానికి సంబంధించిన పండ్ల చెట్టు. చూట్టా నికి పెద్ద నిమ్మపండులా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని కూడా పిలుస్తారు. పండిన బత్తాయి తోనల్లోని  గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని చాలా మందిమి  ఒలు చుకుని తింటాం,మరికొందరు, ముఖ్యంగా వృధ్ధులకూ, చిన్నపిలల్లకూ  దీన్ని రసం తీసి బలానికి ఇస్తారు.

బత్తాయిలో పోషక విలువలు చాలా ఉన్నాయి, వాటితోపాటుగా  ఔషధ పరంగానూ బత్తాయిలో అనేక లాభా లున్నాయి. జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికిబత్తాయి రసాన్నిత్రాగమని వైద్యులు సూ చిస్తారు.

బత్తాయి  పండ్ల నుండి రసం తీసి ప్యాకెట్స్ లో వ్యాపారపరంగా అన్ని ప్రాంతాల్లో లభ్యమవుతున్నా , వాటిలో నిలువ ఉంచను కలిపే రసాయనాల ద్వారా అవి కొంత రుచిపరంగానూ,పోషకాల్లోనూ తేడాగానే ఉంటాయి. ఇహ తప్పని పరిస్థితుల్లోతప్ప వాటిని సేవించకపోడం ఉత్తమం. తాజాపండ్ల నుండీ తయారుచేసే పానీయం ఆరోగ్యానికీ, రుచికీ కూడా మంచిది.  బత్తాయిల దిగుబడి బాగా ఉండే కాలంలో బండ్లమీద బత్తాయిల తోలు వలిచి చేతి యంత్రాల ద్వారా మనం కోరగానే గ్లాసుల్లో రసం వంపి ఇస్తుం టా రు.  ఇది ఒక జీవనాధారంగా అనేకమంది బండ్లవ్యాపారులు బజార్లలో మనకు కనిపిస్తుంటారు. 

బత్తాయి చెట్ట నుండి కోసిన బత్తాయి పండ్ల నుండి తీసిన రసాన్ని బత్తాయి రసం అంటారు. ఈ విధంగా రసా లు తీయడానికి కొన్ని చిన్న చేతి యంత్రాలు ఉపయోగిస్తారు. కొన్నిమార్లు  రసం తీసిన తర్వాత వడపోసి  ఆ పిప్పిని వేరుచేస్తారు. కొన్ని మార్లు ఆ రసం అలా  చిక్కగా నే త్రాగుతారు,కొందరు చిక్కని రసానికి తగి నన్ని నీరు కలుపుకొని తాగుతారు. కొందరు  ఎక్కువ తీపి కోసం పంచదార  కలుపుకు తాగుతారు. కొందరు పండ్లు బాగాలభించేకాలంలో రసం  నిలువ ఉంచడం కోసంకొన్ని  పదార్ధాలను కలుపుతారు. వీటి రుచి తాజా ఫల రసం కంటే వేరుగా ఉంటుంది. ఏదైనా పండును వలిచి ఆముత్యాలను అలాగే నమిలి పిప్పితోసహా తినడం వల్ల మనశరీరానికి తగినంత పీచు పదార్దం అంది మలబధ్ధకమ్రాదు. ఫ్రీ మోషన్ అవుతుంది. అదే ఆరోగ్యానికి ముఖ్య చిహ్నం.

పండ్లన్నిటిలోలాగానే బత్తాయిలోనూ పుష్కలంగా లభ్యమవుతుంది. విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధి ని అరికట్టడంలో బత్తాయి  పండురసం  బాగా పనిచేస్తుంది.ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణ మవు తుంది. లాలాజలమే కదా ఆహారం త్వరగా బాగా జీర్ణమవను సమ్హకరించే సహజ మైన మనశరీరంలో లభిం చే మందు.ఈ లాలాజలం లోని ‘ ఫ్లేవనా యిడ్లు , పిత్తరసం తోపాటు ఇతర జీర్ణ రసాలు, ఆమ్లాలు విడుదల య్యేం దుకు దోహద పడతాయి. అందువల్ల తీసు కున్న ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా ఈ రసం త్వరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది. ఈ బత్తాయిరసం  మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనిలోని ఆమ్లా లు పేగుల్లోని విషపూరిత పదార్థాల్నితరి మే స్తుంది.  ఈ బత్తాయి రసం  వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ మైన ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండాబత్తాయిరసం సేవిస్తే చర్మమ్మీది మచ్చల్ని మాయం చేస్తుంది.

పోషక విలువలతోబాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవ డానికి బత్తాయి రసాన్నే ఎంతో పూర్వం నుంచీ వైస్ధ్యులు సూచిసూనే ఉన్నారు. సాధారణంగా మనం ఎన్నో రకాల పండ్లను మార్కెట్లో చూస్తాం. ఐతే వాటన్నిటిలో అన్ని ఆరోగ్యకరమైనవే  ఐనా, అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బత్తాయి ముఖ్యమైనది . సీజన్‌లో మార్కెట్లలో లభిం చే బత్తాయి పండ్ల రసంలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగాలభిస్తుంది. అంతేకాదు, ఈ రసం రుచి కర మైనది. తాజాగా ఉండి మనల్ని త్వరగా రిఫ్రెష్ చేస్తుంది. ఈ బత్తాయి జ్యూస్ శరీరాన్ని చల్లబర్చడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 

పీచు పదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, కాల్షియం వంటివి బత్తాయిలో అధికంగా ఉన్నాయి. క్యాలరీలు, ఫ్యాట్ కూడా తక్కువగా ఉంది. ఉదర సంబంధింత రోగాలకు బత్తాయి సహకరిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ పండ్ల రసాన్ని రోజూ ఓ గ్లాసు తీసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాం వస్తుంది. గర్భిణీ స్త్రీల ను తరచూ బత్తాయి రసాన్ని త్రాగమని వైద్యులు అంటు న్నారు. ఇందులో ఉండే కాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి మేలు చేస్తుందని వారి ఉవాచ. బత్తాయి రసంను తీసుకో వడం వల్ల శరీరంలోని కొవుకూడా  తగ్గుతుంది.

నోటిపూత, గొంతునొప్పి, ఉదర సంబంధిత బాధగాలను కూడా బత్తాయిరసం తగ్గేందుకు సహకరిస్తుంది. బత్తా యిరసం త్రాగడం వల్ల , లేదా పండు తినడం వల్ల  శరీరానికి అందాల్సిన పోషకాలు పూర్తిగా అందు తాయి. బత్తాయి శరీరానికి శక్తినివ్వడంతో పాటు రక్తాన్ని బాగా ఉత్పత్తి చేయను సహకరిస్తుంది.

బత్తాయి పండ్లలో కొన్ని పుల్లగా ,కొన్ని తియ్యగా ఉంటాయి.బాగా పక్వానికి వచ్చిన బత్తాయి లోని ముత్యా లు తేనె రంగులో ఉండి తియ్యగా ఉంటాయి.  అందాజ్ గా బత్తాయిలో తేమ 82 శాతం. ఫలచక్కెర 16 శాతం. సేంద్రియ లవణాలు ఒక శాతం లభిస్తాయి.అన్ని  వయసులవారికి, శక్తిని కలిగించే ఫలం  బత్తాయి .

100 గ్రాముల బత్తాయిరసంలో పోషక విలువలు ఇలాఉంటాయని పోషక నిపుణులు చెప్తున్నారు. పిండి పదార్థాలు 10.6 గ్రాములు, క్రొవ్వు పదార్థాలు 0.3 గ్రాములు, మాంసకృత్తులు 0.9 గ్రాములు, కాల్షియం 50 మిల్లీగ్రాములు, భాస్వరం 20 మిల్లీగ్రాములు, ఇనుము 0.1 మిల్లీగ్రాములు శక్తి 49 కేలరీలు.

బత్తాయి పండు సులభంగా జీర్ణం అవుతుంది.  రసం కంటే తొనలను అలాగే ముత్యాలు నములుతూ తిన డం వలన నోటిలోని పళ్ళకూ, దవడలకూ మంచి కదలిక కలిగి మంచి ఎక్స్ర్ సైజ్ కాగలదు. మూత్ర వ్యాధుల ను పోగొట్టే గుణం కూడా బత్తాయి పండుకు ఉంది. బత్తాయిలోని ఫల చక్కెర లో అతి మూత్రవ్యాధిని తగ్గించే గుణం ఉంది. అందువలన మధుమేహ వ్యాధిగ్రస్తులు బత్తాయి పండును నిరభ్యంతరంగా తీసుకో వచ్చు. జీర్ణా శయసంబంధమైన ,ప్రేగులో పుండు, క్షయ, పాండువు, నోటిపూత, అతిసారము, గ్రహిణి, పొడి దగ్గు, కోరింత దగ్గు తదితర ఎన్నో వ్యాధుల నుండి బత్తాయి రసం ఉపశమనం కలిగి స్తుంది.   గుండె జబ్బు ఉన్నవారు ఈ బత్తాయి రసాన్ని బాగా వాడ వచ్చు. దీని వలన రక్త శుద్ధి బాగా జరుగుతుంది. గుండె జబ్బున్న వారికి ఉప శమనం కలిగిస్తుంది. బత్తాయి రసం రోజూ రాత్రి కాస్త తీసుకుంటే ఉదయం సులువుగా  సుఖ విరోచన మవు తుంది.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి