శ్రీ కొడవటిగంటి కుటుంబ రావు గారు తెలుగు సాహిత్యములో తనదైన ప్రత్యేకమైన శైలితో రచనలు చేసి తెలుగు పాఠకులకు బాగా దగ్గర ఆయిన్ రచయితా. ఈయన 1909లో తెనాలిలో మధ్య తరగతి కుటుంబములో పుట్టాడు బాల్యము లోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఇంటర్ వరకు గుంటూరు ఏ. సి కాలేజీలోను ఆ తర్వాత డిగ్రీ విజయనగరం మహారాజా కాలేజీలోని చదివాడు.1924లోనే 11ఏళ్ల పద్మావతిగారి వివాహమాడాడు. ఆ తరువాత ఫిజిక్స్ లో M.Sc చేయటానికి బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరాడు కానీ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభము వల్ల చదువు మాని ఉద్యోగ అన్వేషణ లో పడి వివిధ రకాల ఉద్యోగాలు అంటే గుమాస్తా, టీచర్, చలనచిత్ర రచయిత వంటి ఉద్యోగాలు,సిమ్లా ,బొంబాయి, మద్రాసు నగరాలలో చేసి చివరకు జర్నలిజమం వృత్తి లో స్థిరపడి 1952 నుండి 1980 వరకు అంటే చనిపోయేటంత వరకు ప్రముఖ పిల్లల పత్రిక చందమామ కు ఎడిటర్ గా ఉన్నాడు
విద్యార్థి దశలోనే సాహిత్యములో కొత్త కొత్త ప్రయోగాలు చేసిన దిట్ట కుటుంబరావుగారు. విప్లవ రచయితల సంఘములో సభ్యుడిగా ఉండి చురుకైన పాత్ర నిర్వహించేవారు. అశ్విని బ్రహస్పతి అనే పెన్ నేమ్స్ తో వివిధ పత్రికలు రాజకీయ వ్యాసాలు పంపేవారు. సాహిత్యము విమర్శనాత్మకంగా ఉండి,మానవజీవితాన్ని సుసంపన్నము చేసి చివరకు మనుషుల ఆలోచనలను సంస్కరించేదిగా ఉండాలని నమ్మే రచయిత కొడవటిగంటి . సంగీతము,ఫోటోగ్రఫి,హోమోయో వైద్యములలో కూడా ఈయనకు పరిచయము ఉంది. దాదాపు 12
కదా సందోహములు,6 నవలికలు,3 సైన్సుపుస్తకాలు,1. రేడియ నాటికల సంపుటి,,ఆంగ్ల రష్యన్ కధల అనువాదాలు మొదలైనవి ఈయన కృతులు. ప్రస్తుతము అయన వ్రాసిక్న "అక్క పెళ్లి" అనే కధ ముచ్చటించుకుందాము ఈ కధలో సూత్రధారులు ,పాత్రధారులు ఒక కుటుంబములోని సభ్యులు ,తండ్రి శ్వేతాంబరము,తల్లి గుణమణి, పెద్దకూతురు కల్యాణి ,చిన్న కూతురు సీత ఎదిగిన కూతుళ్లు ఉంటె అందరికి వచ్చిన సమస్యే శ్వే తాంబరానికి వచ్చింది అది వాళ్ళ పెళ్లిళ్ల సమస్య .స్నేహితులంతా "ఆయనకేమి మహారాజు ఇద్దరు కూతుళ్ళకు రాజా లాంటి సంబందాలు అవలీలగా తీసుకురాగలడు", అంటుంటే శ్వేతాంబరానికి కొంచెము గర్వము అంతకన్నా ఎక్కువ భయము కలిగేవి. తన శక్తిపై తనకే నమ్మకము లేనప్పుడు స్నేహితులకు ఎందుకంత నమ్మకమో ఆర్ధమయేదికాదు పోనీ హనుమంతుడికి మల్లె తనకు
తన శక్తి సామర్ధ్యాలను గుర్తించలేకపోతున్నాడా , అయినా హనుమంతుడికి తనకు పోలిక ఏమిటి అని అనుకుంటుంటాడు హనుమంతుడిని పొగిడితే విజేరంభిస్తాడు తనో దిక్కుమాలిన పొగడలకు కుంగిపోతాడు. పైపెచ్చు స్నేహితులు లేదా చుట్టాలు
,"ఇవాళ అనుకుంటే రేపు పెళ్ళిచేస్తాడు శ్వేతుకు అది పేద్ద పనికాదు ", అని అనుకోవటం చెవులారా విన్నాడు ఆ విధముగా కూతుళ్ళ పెళ్లి ప్రయత్నాలలో శ్వేతు పెళ్లి ప్రయత్నాలలో పూర్తిగా ఒంటరివాడు. అన్నింటిలో తనను నిశితంగా విమర్శించే భార్య గుణమణి కూడా,"మీరు శ్రద్ద పెట్టి వెతికితే పెద్దదానికి సంభందం కుదరదా? మీకు చీమ కుట్టినట్లైయిన లేదు ", అంటుందే తప్ప,"ఇది నీవల్ల ఆయె పనికాదుగాని వేరే ఎవరికైనా అప్పజెప్పు",అని అనదు తన పలుకుబడి, తన ఆర్ధిక స్థితి ఎంత ఉన్నా పెద్దకూతురు కల్యాణికి మొగుణ్ణి తీసుకు రావటానికి చిన్నమెత్తు ఉపకరించలేదు. ఏదైనా సంబంధము తెచ్చిన భార్య గుణమణి ఆక్షేపించటంలో ,వంకలు పెట్టటములో సిద్దహస్తురాలు గుణమణి మనుషులను తనకు ఇష్టమైనవాళ్లు, కానీ వాళ్ళు అని రెండు రకాలుగా విభజిస్తుంది తనకి ఇష్టమైన వాళ్లలో ఏ కనిపించవు. కనిపించే ఉదార హృదయముతో క్షమించేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయము ఒకటి ఉంది అది ఏమిటి అంటే గుణమణికి పెద్దకూతురు
కల్యాణి అంటే వల్లమాలిన ప్రేమ ,"పాపము దానికి ఏమి తెలియదు సీతలాగా (రెండవ కూతురు) గడుసుది కాదు,అందుకని మంచి సంబంధము పెద్దదానికి చూడాలి" అంటూ ఉంటుంది. మంచి సంబంధము అంటే ఎలా ఉంటుందో శ్వేతాంబాహారానికి ఎన్నడూ అర్ధముకాలేదు.ఈ పరిస్థితులలో సహజముగానే తండ్రికి చిన్న కూతురు సీత అంటే ఎక్కువ ప్రేమ అభిమానము పెరిగినాయి అదికాక సీత చాలా విషయాల్లో తండ్రిపోలికే తండ్రికి గల నిగ్రహము తీక్షణమైన బుడ్డి వచ్చాయి .
ఆపిల్ల మానసికముగా ఏకాంతవాసిని అంటే తండ్రితోగాని తల్లితోగాని అక్కతో గాని చెప్పకుండా అన్ని ఆలోచనలను తన లోనే దాచుకుంటుంది. తన భర్తకు కల్యాణి అంటే ఇష్టము లేదనీ రుజువు చేయటానికి గుణమణి దగ్గర బోలెడంత సాక్ష్యము ఉంది ఊళ్ళో అందరికి పెళ్ళిళ్ళు కుదురుస్తాడుగాని తనకూతురుకు సంబంధము కుదర్చడు అని, తానె పెళ్ళికొడుకు తండ్రి అయినట్లుగా కల్యాణిలో లోపాలు వెతుకుతాడని ఇవన్నీ మంచి సంబంధాలు చూడకుండా తప్పించు కోవటానికాని గుణమణి అభిప్రాయాలు ,అంతెందుకు సరస్వతమ్మగారి సుశీలకు సంబంధము కుదిర్చినది ఈయనే అని గుణమణి నమ్మకము పరాయివాళ్ళకు చేసేదానికన్నా సొంత కూతురుకు ఎక్కువ చేయాలిగాదా అని గుణమణి మొగుడిని సతాయిస్తూ ఉంటుంది. భార్య ఈ ధోరణిలో పడ్డప్పుడు శ్వేతాంబరము అస్త్ర సన్యాసము చేసి వింటూ ఉంటాడు. ఎందుకంటే గుణమణి మాటల్లో ప్రతి వాక్యానికి రెండేసి అబద్దాలు ఉంటాయి ముఖ్యమైన విషయము ఏమిటి అంటే సరస్వతమ్మ గారి సుశీలకు సంబంధము కుదిర్చింది శ్వేతాంబరము కాదు పిల్లను పెళ్ళివారు చూడటానికి వెళ్ళేటప్పుడు స్నేహితులు కాబట్టి వాళ్ళ
వెంట వెళ్ళాడు అంతే. గుణమణి స్టీమ్ రోలర్ నడిపించింది అంటే దానిముందులే నిజాము ఆగలేదు. అంచేత భర్త భార్య మాటల ధాటికి ఎదురు చెప్పడు ఈవిధముగా భార్యా భర్త లిద్దరు ఆడపిల్లలను కూడబలుక్కున్నట్లుగా పంచేసుకున్నారు కళ్యాణి (పెద్దపిల్ల)అమ్మ
పిల్ల,సీత(చిన్నపిల్ల)నాన్నపిల్
మాట్లాడుకున్నా ఆ మాటల వెనుక ఎదో పరస్పర విద్వేషము దాగి ఉన్నట్లు సీత తెలుసుకోగలిగేది. నిత్యమూ ఘర్షణ పడే దంపతులను చూసింది కాని తన తల్లిదండ్రుల మాదిరి సాగించే మూఢ యుద్ధము మరింత క్రూరముగా ఉన్నట్లు సీతకు అనిపించేది. ఎవరైనా గుణమణి శ్వేతాంబరాలు ఏంతో అన్యోన్యముగా ఉంటారు అని అనుకుంటూ ఉంటె సీత తెగ ఆశ్చర్య పోయేది. సీత మీద తల్లిదండ్రుల ప్రభావము
ఏమి లేకపోయినా శ్వేతాంబరము మటుకు సీత అచ్చు తన లాంటిదే అని ఆత్మ వంచన చేసుకుంటూ ఉంటాడు. సీత ఎవరు తప్పో,ఎవరు రైటో నిర్ణయించుకోలేకపోయేది కానీ పద్దెనిమిది ఏళ్ళు నిండాక ఇద్దరు తప్పే అన్న నిర్ణయానికి వచ్చింది. తండ్రి," సీత నా పొలికే పట్టుదల విషయములో",అంటే తల్లి పట్టుదల ఏమీకాదు మొండితనము అం అనేది .సీత మానసిక ధైర్యానికి ఒక రకముగా అక్క కల్యాణి
కారణములెవరు కూడా కల్యాణి లాగ ఉండకూడదని సీత అభిప్రాయము. తండ్రి తనను చూసి గర్వపడటాన్నిసీత పెద్దగా సంతోషించేదికాదు. కల్యాణి పెళ్లి ప్రయత్నాల విషయములొసరియైన ప్రయత్నాలు తండ్రిచేయటంలేదన్న తల్లి ఆరోపణను సీతకూడా చాలా వరకు ఆమోదించింది. తనను పొగుడుతూ అక్కను అవమానపరచటాన్ని సీత హర్షించేది కాదు ఎట్టకేలకు కల్యాణికి ఒక సంబంధము
వచ్చింది . వరుడు ప్రకాశము పాతికేళ్ళవాడు బియ్యే చదివాడు ,ఆస్తిపాస్తులు ఏమీలేవు,రెండు వందల యాభై నెలకు సంపాదిస్తాడు. అన్నయ్య పోవటంతో కుటుంబభారము అంతా అతనిపైనే బడింది .తన అన్న కొడుకు పైకి వచ్చేదాకా తానే చూడాలి కాబట్టి భార్య తరఫున ఏదైనా ఆర్ధిక సహాయము పక్షములో పెళ్లిచేసుకుంటానని పెళ్ళి చూపులప్పుడు నిర్మోహమాటంగా చెప్పాడు . ఆటను
లేచినప్పుడు శ్వేతాంబరము,"సరే నాయనా ఇంటికి వెళ్లి రెండు మూడు రోజుల్లో నీ నిర్ణయాన్ని తెలియజెయ్యి లోపు మేము కూడా ఒక నిర్ణయానికి వస్తాము,"అని అన్నాడు.
"నా నిర్ణయము నేను ముందే చెప్పాను కనీసము ఐదు సంవత్సరాలైనా నేను మాకుటుంబాన్ని ఆదుకోవాలి కాబట్టి మీరు కట్నము రూపేణా కొంత ముట్టజెప్పిన సరే, లేకపోతె నెల నెల రెండు వందలకు తక్కువకాకుండా నాకు సహాయము చేయగలిగితే నేను ఈ పెళ్ళికి సిద్దమే నేను ఇది ఒక బేరము క్రింద అనుకోకండి నా పరిస్థితి దాచి మిమ్మల్ని మభ్య పెట్టలేను ",అని వరుడు ప్రకాశము వెళ్ళిపోయాడు. గుణమణి ఎంతో ప్రయత్నమూ మీద తన్ను తానూ నిగ్రహించుకొని ప్రకాశము గడప దాటగానే అగ్ని పర్వతముల బద్దలయింది.
"నువ్వువద్దు నీ సంబంధము వద్దు అని మొహంమీద చెప్పక ఆలోచిస్తాము అని చెప్పటం ఏమిటి ఈ సంబంధానికి నేను చచ్చినా ఒప్పుకోను "అని గుణమణి ఖరాఖండిగా చెప్పింది. "అతన్ని మర్యాదగా పంపినందువల్ల నష్టము ఏమిలేదులే ,అదీగాక ఈ సంబంధము అంత తీసేయ దగ్గది కాదేమో అని నాఉద్దేశ్యము ",అని శ్వేతాంబరము చాలా ఓర్పు అభినయిస్తూ అన్నాడు. ఇంకేముంది ఇంకేముంది భార్యా భర్తల మధ్య మాటల యుద్ధము మొదలైంది "మనము ఇంట ఘర్షణ పడేకన్నా ఉద్దేశ్యము కనుక్కుంటే మంచిదేమో కదా?"అని
శ్వేతాంబరము కల్యాణి వంక చూశాడు కల్యాణి ఒక్కసారి తల్లి వంక చూసి ,"ప్రయివేట్ మాష్టార్ని జీతము మీద నాకు మొగుడ్ని పెడతారా? నాకు ఇష్టములేదు. అంత డబ్బు కోసము చేసునేవాడి దగ్గర నేనేమి సుఖపడతాను నాకు ఈ సంబంధము వద్దు,"అని ఖచ్చితముగా చెప్పింది. ఇంక ఓర్పు నశించిన శ్వేతాంబరము భార్యను తనదైన శైలిలో విమర్శించటం మొదలుపెట్టాడు. సీత తల్లిదండ్రుల
ఘర్షణలో వివిధ కాబట్టి గమనిస్తుంది. ఒక దశలో గుణమణి ,"ఇదే సంబంధము సీతకు వస్తే మీరు ఒప్పుకుంటారా? అని భర్తమీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది.
"నాకు నీవు అనుకున్నట్లు పక్షపాతాలు ఏమీలేవు,అయితే గియితేలు నాకు నచ్చవు సీతకు సమ్మతమయితే నేను అభ్యంతరము చెప్పను ",అని శ్వేతాంబరము అన్నాడు. "దానికి ఇష్టము లేదంటే శాపనార్దాలు పెట్టారుగా? " గుణమణి శ్వెతాంబరము ఉక్కిరిబిక్కిరి అయ్యాడు కల్యాణి ఇష్టము లేదని చెప్పిన వెంటనే చర్చ ముగించి ఉంటె ఇంట విపత్తు వచ్చేదికాదు. ఇటువంటి పరిస్థితిలో సీత ఆయనకు
సహాయము వచ్చింది. "నేనైతే ఈ సంబంధానికి ఒప్పుకుంటానమ్మా " అని సీత అన్నది. గుణమణి ఎదో అనటానికి ప్రయత్నమూ చేసింది కానీ ఊహించని ఈ పరిణామానికి ఆమె నోట మాట రాలేదు. "అక్కకు మరో సంబంధము చూసి పెళ్లిచేసె దాకా ఆతను ఆగేటట్లయితే నేను అతన్ని తప్పక చేసుకుంటాను తన అన్న కుటుంబాన్ని ఆదుకోవాలని చూసేవాడు డబ్బు మనిషి అని ఎలా అంటాము ?అయినా చూపించేవాడిని మనము వేళాకోళముగా మాట్లాడతాము మంచిది కాదు ', అని తన నిర్ణయాన్ని చెప్పి సీత గదిలొంచిజీ వెళ్ళిపోయింది
మిగిలిన ముగ్గురు ఆ పిల్లకేసి నోళ్లు తెరుచుకు చూస్తూ ఉండిపోయారు