నవ్వండి నవ్వించండి - చెన్నూరి సుదర్శన్ కన్నవి , విన్నవి

1. ఈ మధ్య ఖరీదైన వాచీ ఒకటి కొన్నానోయ్ "
" చాలా సంతోషం. బాగా తిరుగుతోందా ?"
"తిరక్కేం నాకూ మరమ్మత్తు చేసే వాడిమధ్య బాగానే తిరుగుతోంది "

2. "అలా వెళ్ళే కోతి మొహం వాడెవడు?" అడిగింది ఆమె.
" వాడా మా తమ్ముడు " అతను జవాబిచ్చాడు
"అయ్యో నామొహం మండ,పోలికను బట్టయినా తెలుసుకోలేకపోయాను "

3. ఒక  వ్యక్తి  ఒక ఇంటిముందు  ఆగి  “దయచేసి  ఈ  గుండీలు  ఏదైనా  మీ  ఇంట్లో  పాత కోటుకు  కుట్టి  ఇవ్వగలరా?” అని  అడిగాడుట,

4 .  సుబ్బారావు  భార్యను  హోటలికి తీసుకెళ్ళాడు.  “ఇంకో  కూల్డ్రింక్  తాగుతావా  ?” అని  అడిగాడు 
“అదేమిటి రెండోది  అంటున్నారు  . మొదటిది  ఎక్కడ  తాగాం  ?”
“మర్చి పోయావా  కిందటేడు  హోటలికి  వచ్చినప్పుడు  తాగలేదూ  ?”

5.  అదేమిటి  డాక్టర్  పన్నుకు  రెండొందలు  మాత్రమే  అని  చెప్పి  ఒక్క  పన్ను  తీసినందుకు  వెయ్యి  రూపాయలు  అడుగుతున్నారు  .
నిజమే. నువ్వు  అరిచిన  అరుపుకు  నలుగురు  పేషంట్లు  పారిపోయారు. మరి  ఆ  నష్టం  ఎవరిస్తారు  ?      

6.. “నిన్న  ఆదివారం  నేను  మా  ఫ్రెండ్  ఇంటికి  వెళ్లాలని, మా  ఆవిడ  సినిమాకి  వెళ్లాలని  ఒకటే  గొడవ  పడ్డాం”
      “ అది  సరే  కాని  ఇంతకీ  సినిమా  ఎలా  వుందో  చెప్పు  .”      

7. "ఈ మధ్య నేనో పులిని ముఖాముఖి ఎదుర్కున్నానోయ్ !" అన్నాడు ఒకడు.
" అది నిన్నేమీ చెయ్యలేదా ?" ఆశ్చర్యంగా అడిగాడు మిత్రుడు.
" అది నా మీదకు రాబోతూంటే ఆ బోను విడిచి మరో బోను వైపు వెళ్ళిపోయానులే" మిత్రుని సమాధానం.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి