ప్రస్తుతము చాలా మంది ముఖ్యముగా చిన్నవారు ఎదుర్కొనే సమస్య రక్తవిహీనత(ఎనీమియా)డాక్టరు దగ్గరకు ఏ సమస్య గురించి వెళ్లిన డాక్టరు ముందు చెప్పేది "మీకు రక్తము తక్కువ "అని అంటే ఆక్సిజన్ ను గ్రహించే ఎర్ర రక్తకణాలు సరిగా శరీరములోని అవయవాలకు లేదా కణాలకు అందటంలేదు అని అర్ధము ఈ ఎనీమియాతో భాధ పడే వారు తక్కువ శక్తివంతము గాను, నీరసముగాను కనిపిస్తారు త్వరగా అలిసిపోతారు .ఎందుకంటే గుండె రక్తాన్ని శరీరభాగాలు పంపటానికి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఎనీమియా అనేది వ్యాధి కాదు కాబట్టి భయపడవలసిన పనిలేదు సులభముగా నయము చేసుకోవచ్చు.
కొన్ని సందర్భాలలో ఇది మిగిలిన జబ్బులతో ముడిపడి ఉంటుంది. మీరు ఎనిమిక్ అని మీరు భావిస్తే డాక్టరును సంప్రదించటం మంచిది. రక్త పరీక్ష ద్వారా ఎనీమియాను గుర్తించవచ్చు. ఎనీమియా ఎందుకు వస్తుంది ? అన్న విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఎనీమియా ఎందువల్ల వస్తుందంటే మన శరీరములో అవసరమైనన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తికాకపోవటం లేదా ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ అనే ఐరన్ ధాతువు సరిపడా లేకపోవటంవల్ల వస్తుంది హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ రవాణాలో ప్రధాన పాత్ర వహించే ప్రోటీన్ హీమోగ్లోబిన్ తగ్గితే శరీరములోని కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఏదైనా సందర్భములో రక్తాన్ని కోల్పోవటము లేదా త్వరగా కొత్త రక్త కణాలు ఏర్పడకపోవటము జరిగినా మనిషి ఎనీమియాకు లోనవుతాడు ఆడవారు బహిష్టు సమయాలలో లేదా గర్భిణీ గా ఉన్నప్పుడు లేదా ప్రసవం తరువాత రక్త స్రావము వల్ల ఎనీమియాకు లోనవుతారు. శస్త్రచికిత్స వల్ల లేదా కడుపులో పుండ్ల వల్ల ఏర్పడే అంతర్గత స్రావాల వల్ల లేదా ఏరకమైన జీర్ణవ్యవస్థ లోని లోపాలవల్ల కూడా ఎనీమియా ఏర్పడుతుంది.
ఎనీమియాలో రకాలు:-చాలా రకాల ఎనీమియా లు ఉన్నాయి కానీ సాధారణముగా ఏర్పడే ఎనీమియా ఐరన్ లోపమువల్ల ఏర్పడే ఎనీమియా అంటే మన ఆహారము ద్వారా ఐరన్ లభించకపోవటం లేదా శరీరములోని కణాలు ఆహారంలోని ఐరన్ శోషించక లేకపోవటము
వల్ల ఈ రకము ఎనీమియా ఏర్పడుతుంది విటమిన్ బి 12 లేదా ఫోలిక్ ఆమ్లము లోపమువల్ల కూడా ఎనీమియా ఏర్పడుతుంది. చాలా అరుదుగా ఎనీమియా వంశ పారంపర్య రక్త సంబంధిత జబ్బుగా రావచ్చు సిక్ సెల్ ఎనీమియా, అప్లాస్టిక్ ఎనీమియా, తలస్సేమియా వంటివి .
ఎనీమియా వ్యాధిని గుర్తించటం ఎలా?
ప్రారంభములో ఏవిధమైన స్పష్టమైన లక్షణాలు ఏమి కనిపించవు క్రమముగా ఎనిమిక్ గా ఉన్నవారు త్వరగా అలసి పోవటము ,స్వాసక్రియలో ఇబ్బంది పడతాము జరుగుతుంది దీనిని ఈ దశలో గుర్తించకపోతే ఇతర లక్షణాలు అంటే గుండె వేగముగా
కొట్టుకోవటం తలనొప్పి , తలదిమ్ముగా ఉండటము , చెవులలో హోరు శబ్దము,కాళ్ళుపీకుతున్నట్లు ఉండటము కనిపిస్తాయి. అదనంగా చర్మము,చేతి గోళ్లు పాలిపోయినట్లు ఉంటాయి. జుట్టు ఊడిపోవటంకూడా జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్త పరీక్ష చేయించుకోవాలి
ఎనిమిక్ అని తెలిసినప్పుడు దానికి చికిత్స మరియు గృహ వైద్యము :-
1.ఐరన్ మాత్రలు :-సాధారణముగా ఎనీమియాకు ముఖ్య కారణము ఐరన్ ధాతు లోపము కాబట్టి మనము డాక్టర్ ను సంప్రదించినప్పుడు అయన మొదట ఇచ్చేవి ఐరన్ మాత్రలు డాక్టర్ సలహా లేకుండా ఐరన్ మాత్రలు సొంతముగా వాడటము ప్రమాదకరము కాబట్టిశరీరము బారును బట్టి కరెక్ట్ డోస్ లో ఐరన్ మాత్రలు వాడాలి. గృహ వైద్యములో భాగముగా ఎనీమియాకు అరటిపండ్లు,తేనె, బాదము
పప్పు,ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. ఇవి హీమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతాయి ఉడాయెనే తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఆహార పదార్ధాలను ఓట్స్ తో కలుపొకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఐరన్ శోషణకు ప్రతిబంధకాలుగా ఉండే పదార్ధాలను భోజన సమయములో తీసుకోకూడదు అవి ట్యానిన్లు అధికముగా ఉండే రెడ్ వైన్,బ్లాక్ మరియు గ్రీన్ టీ ద్రాక్షపండ్లు ఇదేవిధముగా కెఫిన్ అధికముగా కలిగిన కాఫీ, చాకొలేట్ మొదలైనవి. క్యాల్షియమ్ కలిగిన పదార్ధాలు,సోయా ఉత్పత్తులు,, ఫోస్విటిన్ అనే ప్రోటీన్ కలిగిన కోడిగ్రుడ్డు సొన లాంటివికూడా భోజన సమయములో తీసుకోకూడదు విటమిన్ సి అధికముగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవటము వల్ల ఐరన్ శోషణ
బాగా జరుగుతుంది. ఐరన్ ను మన శరీరానికి అందించే ఆహారపదార్ధాలను తెలుసుకుంటే వాటిని మన ఆహారములో చేర్చుకొని ఎనీమియాను జయించవచ్చు. మాంసాహారులైతే చేప,చికెన్ లివర్,ఆల్చిప్పలు,రెడ్ మీట్ మొదలైన వాటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.కాబట్టి వాటిని తీసుకోవచ్చు. శాఖాహారులు చిక్కుడు జాతి కూరలు,ఆకు కూరలు,డ్రై ఫ్రూట్స్, పప్పుధాన్యాలు మొదలైనవి విరివిగా టీయూకోవాలి అప్పుడు కృత్రిమమైన ఐరన్ మాత్రలతో పని ఉండదు ఎనీమియా దరిచేరదు .