నవ్వండి - నవ్వించండి - సేకరణ - జీడిగుంట నరసింహ మూర్తి

1. “మీ పళ్ళు అంత ధగ ధగ మెరిసిపోవడానికి ఏ టూత్ పేస్టు వాడుతారు ?” అడిగాడు ఒక నటిని విలేకరి.
“ ప్రత్యేకంగా ఒక టూత్ పేస్టుకు నేను అలవాటు పడను. కాని రెండు పూటలా చేతిలోకి తీసుకుని బాగా పాలిష్ చేస్తాను అంతే “ 
అంది ఆ నటి దవడ నొక్కుకుంటూ .

********************************************************
2. “నువ్వు నాకు చేసిన సహాయానికి నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు “ 
అన్నాడు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్న పేషంట్ తో .
“ ఏమీ అక్కర్లేదు. ముందు ఆక్సిజన్ పెట్టిన ట్యూబ్ మీద నుండి నీ కాలు తీసెయ్యి చాలు “ 
అన్నాడా పేషంట్ ఆయాస పడుతూ
********************************************************

3. "రామా పురం వెళ్ళడానికి దగ్గర దారి ఏమైనా ఉందా ?" 
అని అడిగాడు ఒక వ్యక్తి అక్కడ రచ్చబండ మీద కూర్చుని చుట్ట కాలుస్తున్నఒక పెద్ద మనిషిని.
" ఇక్కడనుండి ఒక గంట ప్రయాణం వుంటుంది " అని జవాబిచ్చాడు ఆయన. 
" అంత కన్నా త్వరగా వెళ్ళే మార్గం లేదా ?" అడిగాడు వ్యక్తి.
"లేకేం. మా ఆంబోతు మీ వెంటపడితే అరగంటలోనే మీ వూరు చేరుకుంటారు " 
అన్నాడు ఆ పెద్దమనిషి భళ్ళున నవ్వుతూ.

********************************************************
4. "పాపి చిరాయువు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు " అన్నాడు ఒక వ్యక్తి మిత్రుడితో.
"అయితే నీ ప్రాణానికేమీ డోకా లేదన్న మాటేగా?" అన్నాడు మిత్రుడు టక్కున.

********************************************************
5.. "ఈ చీర కట్టుకుంటే మీరు నలభై ఏళ్ల ఆవిడ లాగా అందరికీ కనపడతారు మేడం " 
అంటూ చీరల షాపులోని ఒక వ్యక్తి ఒకామెకు చీరను చూపిస్తూ పొగుడుతూ అన్నాడు.
" ఏడ్చినట్టుంది . నా వయసు ముప్పయ్యే. " అంటూ ఆ చీరను అతని మీద విసిరి కొట్టింది ఆ లేడీ కస్టమర్ కోపంగా..
********************************************************
6. ఒక వ్యక్తి కిళ్ళీ షాపు దగ్గరికి వెళ్లి అక్కడ తగిలించి ఉన్న అరటిపళ్ళ గెలమీద చెయ్యి వేసాడు. వెంటనే షాపతను
 " గెలమీద చెయ్యి వేసావంటే పళ్ళు రాలుతాయి " అన్నాడు. 
అందుకా వ్యక్తి "సున్నం తక్కువెయ్యి లేకపోతే దవడ పగులుతుంది జాగ్రత్త " అన్నాడు 
కిళ్ళీ కడుతున్నషాపు వ్యక్తిని ఉద్దేశించి.

********************************************************
7. "ఇప్పటికిప్పుడు తడుముకోకుండా అబద్దమాడితే వందరూపాయలు ఇస్తాను" అన్నాడు వాసు.
"అదేమిటిరా ఇందాకే కదా రెండొందలు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చేసావ్ !" అన్నాడు మిత్రుడు వెంటనే.
********************************************************
8. "ఈ మధ్య నేనో పులిని ముఖాముఖి ఎదుర్కున్నానోయ్ !" అన్నాడు ఒకడు.
" అది నిన్నేమీ చెయ్యలేదా ?" ఆశ్చర్యంగా అడిగాడు మిత్రుడు.
" అది నా మీదకు రాబోతూంటే ఆ బోను విడిచి మరో బోను వైపు వెళ్ళిపోయానులే" మిత్రుని సమాధానం.
********************************************************
9. "మీ కథలు సామాన్యంగా దేంట్లో పడుతూ ఉంటాయి ?" అని అడిగాడు ఒక వ్యక్తి ఒక రచయితను.
"చెత్త బుట్టలో " రచయిత టక్కున సమాధానం ఇచ్చాడు..
********************************************************
10. హోటల్లో శుభ్రంగా తిన్నాక డబ్బులు ఇంట్లోనే మర్చిపోయినట్టు గుర్తొచ్చింది వెంకయ్యకు.  
పర్వాలేదు లెండి గుర్తు కోసం మీ పేరు గోడమీద రాసుకుంటాం రేపు తెచ్చి ఇచ్చెయ్యండి అన్నాడు హోటల్ ప్రొప్రయిటర్, 
నా పరువు పోతుంది ఆ పని మాత్రం చెయ్యకండి అంటూ వేడుకున్నాడు వెంకయ్య. 
ఎందుకండీ అంత కంగారు పడతారు మీ పేరు కనపడకుండా అక్కడ మీ చొక్కా తగిలిస్తాంగా !" 
అన్నాడు హోటల్ ప్రొప్రయిటర్ విశాల హృదయంతో 

********************************************************
11. "పట్టపగలే వంద మంది నిట్టనిలువునా మోసపోయిన వైనం"
అంటూ ఒక పేపర్ బోయ్ బజారులో పేపర్లు అమ్ముతున్నాడు. 
ఇంతలో ఒక పెద్దాయన ఆ వార్త ఏదో తెలుసుకోవాలని ఆత్రుతతో వాడిని పిలిచి ఒక పేపర్ కొనుక్కున్నాడు.
ఆ వెంటనే పేపర్ బోయ్ " పట్టపగలే నూటొక్కమంది నిలువునా మోసపోయిన వైనం "
అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
********************************************************
12. ఈ మధ్య ఖరీదైన వాచీ ఒకటి కొన్నానోయ్ "
" చాలా సంతోషం. బాగా తిరుగుతోందా ?"
"తిరక్కేం నాకూ మరమ్మత్తు చేసే వాడిమధ్య బాగానే తిరుగుతోంది "
********************************************************
13. "అలా వెళ్ళే కోతి మొహం వాడెవడు?" అడిగింది ఆమె.
" వాడా మా తమ్ముడు " అతను జవాబిచ్చాడు
"అయ్యో నామొహం మండ,పోలికను బట్టయినా తెలుసుకోలేకపోయాను "
********************************************************
14. ఒక  వ్యక్తి  ఒక ఇంటిముందు  ఆగి  “దయచేసి  ఈ  గుండీలు  ఏదైనా  మీ  ఇంట్లో  పాత కోటుకు  కుట్టి  ఇవ్వగలరా?” అని  అడిగాడుట,
********************************************************
15 .  సుబ్బారావు  భార్యను  హోటలికి తీసుకెళ్ళాడు.  “ఇంకో  కూల్డ్రింక్  తాగుతావా  ?” అని  అడిగాడు 
“అదేమిటి రెండోది  అంటున్నారు  . మొదటిది  ఎక్కడ  తాగాం  ?”
“మర్చి పోయావా  కిందటేడు  హోటలికి  వచ్చినప్పుడు  తాగలేదూ  ?”
********************************************************
16.  అదేమిటి  డాక్టర్  పన్నుకు  రెండొందలు  మాత్రమే  అని  చెప్పి  ఒక్క  పన్ను  తీసినందుకు  వెయ్యి  రూపాయలు  అడుగుతున్నారు       నిజమే. నువ్వు  అరిచిన  అరుపుకు  నలుగురు  పేషంట్లు  పారిపోయారు. మరి  ఆ  నష్టం  ఎవరిస్తారు  ?  
********************************************************
17. “నిన్న  ఆదివారం  నేను  మా  ఫ్రెండ్  ఇంటికి  వెళ్లాలని, మా  ఆవిడ  సినిమాకి  వెళ్లాలని  ఒకటే  గొడవ  పడ్డాం” 
 “ అది  సరే  కాని  ఇంతకీ  సినిమా  ఎలా  వుందో  చెప్పు  .”       
    
మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి