.సాంకేతిక పరిజ్ఞానంతో పడే పాట్లు.. - భమిడిపాటి ఫణిబాబు

difficulty by   using  technology

ఇదివరకటి రోజుల్లో ప్రతీ పనీ ఓ పధ్ధతిలో చేసుకునేవారు. దేనికైనా ఓ ప్రణాలిక తయారుచేసుకునేవారు.. ఇప్పుడు వాటిగురించి గుర్తుచేసికుంటే, బహుశా వాళ్ళ పధ్ధతే సరైనదేమో అనికూడా అనుకోవచ్చు. ఉదాహరణకి , ఏ చాకలికో బట్టలు వేసినప్పుడు ఓ పద్దు రాయడమనండి,  రోజూ పాలుపోసేవాడికి , ఎన్నిరోజులు పాలు పోయలేదో గుర్తుపెట్టుకుని,  కాలెండరుమీద టిక్కు పెట్టుకోడమనండి, ఇలా ప్రతీదానికీ ఓ లెక్కుండేది. పైగా ఏ దేవుడిబొమ్మా లేని, అంకలున్న కాలెండర్లు ప్రత్యేకంగా సంపాదించేవారు. అలాగే  మనం కట్టే పన్ను రసీదులూ, పొరుగూరినుండి వచ్చిన ఉత్తరాలూ, ఓ స్టీలు తీగకు గుచ్చి ఉంచేవారు. అవసరానికి వెదుక్కునే సందర్భాలే తక్కువ..ఇవేకాకుండా, రోజూ అవసరమయే వస్తువులు—వాటికి ఓ ప్రత్యేక స్థలం ఏర్పాటుచేసి అందులోనే పెట్టేవారు. అన్నిటికంటే ముఖ్యం ఇంట్లో ఉండేవాళ్ళందరూ కూడా పాటించేవారు. ఒకరకమైన క్రమశిక్షణ తో పెరిగి పెద్దవారయ్యారు.

కానీ కాలక్రమేణా , ప్రతీ విషయంలోనూ కొన్నికొన్ని  comforts  కి అలవాటుపడిపోయాము. ఈరోజుల్లో ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లూ, లాప్ టాప్పులూ.. అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయనడంలో సందేహం లేదు. కానీ, సాంకేతిక పరిజ్ఞానం మీదే ఆధార పడ్డం కూడా ఒక్కోసారి కష్టాలు తెస్తూంటాయి.. ఈరోజుల్లో వస్తూన్న  gadgets  నిరంతరం పనిచేస్తాయని చెప్పలేముకదా, వాటికీ నలతలు వస్తూంటాయేకదా.  ఉదాహరణకి ఇంటికెవరో వస్తున్నారని, ఏ గారెలో వేయడానికి, పప్పు నానపెడతారు, తీరా రుబ్బడానికి చూస్తే, ఆ మిక్సీ కాస్తా మొండికేస్తుంది. ఇదివరకటిరోజుల్లోలాగ, రుబ్బురోళ్ళు ఉండవాయె. నవతరం వారనొచ్చు.. “ ఏమిటీ ఈరోజుల్లోకూడా పిండి రుబ్బడాలేమిటీ, హాయిగా ఏ వడా మిక్సో, ఇడ్లీమిక్సో తెచ్చేసికోక.. “ .  ఎలాఉందంటే.. ఉత్తరాలకి బదులు  ఈ మైల్సూ, పుస్తకాలకి బదులు ఈ బుక్సూ లాగ.. అదృష్టం బావుండి, ఇంకా “కాపరాలుచేయడం”   digitalise  అవలేదు.

ఒక్కొక్కప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తూంటుంది.అవడం విషయం చిన్నదే అవొచ్చు, కానీ వయస్సొచ్చేకొద్దీ మనలో వచ్చే పరిణామాల ప్రభావం ధర్మమా అని ఇలాటివి అనుభవాల్లోకి వస్తూంటాయి. వయస్సుమీద పడేకొద్దీ, మనలో జ్ఞాపకశక్తి తగ్గిపోతూంటుంది.ఏదో మామూలుగా కాలక్షేపానికైతే పరవాలేదు, కానీ బయటకెప్పుడైనా వెళ్ళినప్పుడు, అదృష్టం బాగోక కొంతమంది వాళ్ళుండే ప్రాంతం పేరు మర్చిపోతూంటారు. ఒకటి రెండుసార్లు జరిగేటప్పటికి ఏ డాక్టరుదగ్గరకో తీసికెళ్ళాల్సొస్తూంటుంది. ఇలాటివి సర్వసాధారణంగా వయస్సొచ్చినవారికి జరిగేవే.   మనుష్యులమధ్య communication కోసం ప్రతీవారూ ఈరోజుల్లో cell phones ఎందుకు ఉపయోగించుకోవాల్సివస్తుందో, వాటిని మంచి కండిషన్ లో పెట్టుకోవాల్సిన అగత్యం ఏమిటో, అనుభవం మీదకానీ తెలియదు. ఏదో ఓ "పెద్దరికం" అడ్డుపెట్టేసికుని " ఏమిటోనండీ ఈ రోజుల్లో ఎవరిచేతుల్లో చూడండి ఆ దిక్కుమాలిన సెల్లులే.." అంటూ sermonize చేయడం బాగానే ఉంటుంది. పైగా " మారోజుల్లో ఇలాటివేమైనా చూశామా, పెట్టామా.." అంటూ సాగదీసుకుంటూ కబుర్లు చెప్పడం కూడా బాగానే ఉంటుంది upto a limit. కానీ, చేతిలో సెల్ల్ ఫోను ఉన్నా, అది పనిచేయకపోవడం మాట దేవుడెరుగు, పోనీ ఇంకో ఫోనునుంచైనా ఫోను చేయడానికి, అసలు ముఖ్యమైన నెంబర్లే గుర్తులేదంటే thats the height of it అసలు ఈ గొడవలన్నీ ఎందుకొస్తున్నాయంటే ఒళ్ళంతా బధ్ధకం పెరిగిపోయి. ప్రతీదానికీ బధ్ధకమే. ఇదివరకటిరోజుల్లోనూ ఉండేవి ఈ ఫోన్లూ అవీనూ. ఆ నెంబర్లన్నీ లక్షణంగా ఓ pocket diary లో వ్రాసుకుని ఎవరికైనా ఫోను చేయాల్సొచ్చినప్పుడు ఆ నెంబరేదో చూసుకుని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జేబుల్లో అలాటి డైరీలు పెట్టుకోడానికి నామోషీ.ఆ మాయదారి సెల్లులోనే, అవేవో నొక్కేసి సేవ్ చేసేసికోడం.పైగా పూర్తినెంబరు చేయడానికి కూడా బధ్ధకమే. వాటికి అదేదో speed dial ట దాంట్లో పెట్టుకోడం, అవసరం వచ్చినప్పుడు ఆ నెంబరుని ఓ నొక్కు నొక్కడం.ఇన్నేసి సదుపాయలున్నప్పుడు ప్రత్యేకంగా నెంబరు గుర్తుపెట్టుకోమంటే ఎవడు పెట్టుకుంటాడూ? హాయిగా అదో పని తప్పింది అని సంతోషించడం.

ఒక్కొక్కప్పుడు ఎవరినైనా మీ నెంబరెంతా అని అడిగిచూడండి, గుర్తులేదండీ అని చిద్విలాసంగా చెప్తాడు. పైగా " నా ఫోనెప్పుడూ నాదగ్గరే ఉంటుంది కదండీ.." అని ఓ వెర్రిమొర్రి explanation కూడా ఇస్తాడు ! ఓరి భబ్రాజిమానం, ఇంకోరెవరికో చెప్పాలన్నా గుర్తుండాలికదురా అని ఎవరైనా అంటారేమో అని, తన నెంబరు మాత్రం గుర్తుంచుకుంటాడు.  ప్రస్తుత పరిస్థితి exactly అదే !

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి