శుకప్రియ - నేరుడు చెట్టు . - -హైమాశ్రీనివాస్.

neredu tree

పుర్వం నేరేడు చెట్టును కృష్ణ ప్రీతికర వృక్షం గా భావించేవారు. కృష్ణ జయంతి రోజున తప్పక నేరేడు పండ్ల ను శ్రీ కృష్ణమూర్తికి నివేదించాక ,ప్రసాదంగా సేవించి అందరికీ పంచడం జరిగేది. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో నేరేడు ఒకటి.నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు. నేరేడు భారతదేశం, పాకిస్థాన్, మరియు ఇండోనేషియా లో ప్రధానంగా పెరుగుతుంది. భారతదేశంలోని గుజరాత్ ఇంకా నేక ప్రాంతాల్లో దీనిని దేవతా ఫలంగా భావిస్తారు. శ్రీరాముడు పద్నాలుగేళ్ళు  వనవాసం చేసినపు డు, ఎక్కువ భాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. ఎందుకంటే అడవుల్లో ఈ నేరేడు వృక్షాలు విస్తారంగా విస్తరించి , నిండా పండ్లు కాసేవి.అక్కడ వీటిని కోసి తినేవారు ఉందనందున చెట్టుమీదే బాగా పండి రాలుతుండేవి. చెట్టుకు పండిన పండ్ల రుచే వేరు. 

చిన్న నేరేడుపండ్లు బ్లాక్ చెర్రీల్లాగా ఉంటాయి. తమిళం లో 'జంబు' అనీ , 'నాగపళమ్‌'అనీ, కన్నడము లో 'నేరలెహణ్ణినగిడ'లేక 'నేరలెతోపు' అనీ అంటారు.తెలుగు పర్యాయపదాలను చూస్తే శుకప్రియ,జంబువు, జమ్ము, నీలఫల, రాజఫల, శుకప్రియ -ఇలా చాలానే ఉన్నాయి, ఎలా పిలిచినా ఆరోగ్యప్రదాయిని ఐన నేరేడు మనకు ప్రీతికరమైనది.

కొంచెం వగరుగాను, అదోతరహా తీపి గానూ ఉండే నేరేడు మాత్రం ఆరోగ్యాని కెంతో మేలు చేస్తుంది .నేరేడు వనం మొక్క. పూర్వం గ్రామసమీప అడవుల్లోచిన్న వనాల్లో పెరిగే చెట్టు. వీటిని సాధారణంగా ఇళ్ళలో వెయ్యరు. ఒక్కోమారు పొలాలవద్ద గట్ల సమీపానల్లో పెరిగి నపుడు రైతులు చల్లదనానికి, ఎండనుంచీ పని చేశాక విశ్ర మించ నూ ,నీడన మధ్యాహ్న భోజనం తర్వాత కాస్తంత పవళించనూ చెట్ల నలాగే పెరగ నిచ్చే వారు. అంతేకాక గ్రామ వాసులు ఈ పండ్లను బాగా పండే సమయంలో చెట్లెక్కికోసి, క్రిందపడ్దవి ఏరుకుని గంపల్లో ఉంచి తెచ్చి నగరాల్లో ,పట్టణాల్లో అమ్మి కాస్తంత సొమ్ము గడించడం పరిపాటి. మంద పాటి, ముదు రాకు పచ్చ ఆకుల తో నిండైన చిక్కని నీడ నిస్తుంది నేరేడు.     

నేరేడు పండ్లలో చాల రకాలున్నాయి. గుండ్రంగా పెద్దగ వుండేవి, కోలగా పెద్దగా వుండే అల్ల నేరేడు రకం. గుండ్రంగా వుండి చిన్నవిగా వుండే చిట్టి నేరేడు రకం ఒకటి.  మనం స్వీకరించిన ఆహారంలో పొరబాటున లోని కెళ్ళిపేగుల్లో  చుట్టుకుపోయిన వెంట్రుకలను చక్కగా బయటికి పంపేస్తాయి నేరేడు పండ్లు .అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం నేరేడు పండ్లు తప్పక తినా లనీ పెద్దలు చెప్తారు. పెద్దలమాట పెరుగన్నం మూట కదా! అన్నట్లు నేరేడు పండ్లను మజ్జిగలో కొంత సేపు ఉంచి ఆతర్వాతే తినాలిట! దానివల్ల ఆపండు లోని వగరు గుణం పోతుంది. 

వర్షాకాలం నుండీ నేరుడు పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో ప్రకృతి ప్రసాదించే ఫలం నేరేడు. చూడటానికి నల్ల ద్రాక్ష లాగా ఉంటాయి ఈ నేరేడు పండ్లు.చూడగానే తినాలని నోరూరిస్తుండే నేరుడు పండ్లు ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. నేరుడు పండ్లు ఇటు పిల్లలకు అటు పెద్దలకూకూడా ఆరోగ్య ప్రదాలు. నేరుడు పండ్లలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కేవలం పండే కాదు, నేరేడు చెట్టు ఆకులు, గింజలు, బెరడు అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. నేరేడు మధుమేహం, క్యాన్సర్ వంటి వివిధ ఆరోగ్య సమ స్యలకు పరిష్కారం కలిగిస్తుంది.ఎటొచ్చీ వైద్యులసలహామేరకు వాడాల్సి ఉంది. నేరేడు లోపోషక విలువలు.— బాగా పండిన నేరేడు పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా దొరుకుతాయి. ఇతర పండ్లతో పోల్చి చూస్తే మినరల్స్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు పెరుగరు.నేరుడు గింజల నుండి కూడా అధిక సంఖ్యలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొద్దిగాక్యాల్షియం, విటమిన్ బి, సి, ఐరన్ లు కూడా లభిస్తాయి. ప్రతి వంద గ్రాముల నేరేడు పండ్లలో రెండు మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. శరీరానికి రోజుకి కావల్సిన విటమిన్ సి నలభై మిల్లీగ్రాము లైతే,వందగ్రాముల నేరుడులో 18మిల్లీగ్రాములవరకూ మనకు దొరుకుతుంది. కెరోటిన్, ఫైటోకెమికల్స్ అంటే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషి యం, పొటాషియం, సోడియం, పీచుపదార్థాలు,క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్‌, జింక్‌, ఇరన్‌, విటమిన్‌, సీ, ఎ రైబోప్లెవిన్‌, నికోటిన్ ఆమ్లం, ఫోలిక్‌,  యాసిడ్లు  మొదలైన పోషకాలన్నీ కూడా నేరుడు తినడం వల్ల మనకు లభిస్తాయి..నేరుడు చెట్టుకు ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలను పటిష్టం గా ఉంచడం, చిగుళ్ల సమస్యలను నివారించడంలో తగు పాత్ర పోషిస్తాయి. 
సంపూర్ణ ఆరోగ్యం కోసం మనకు ప్రకృతి మాత ప్రసాదించిన ఆయాకాలాల్లో లభించే ఫలాలను తప్పక తినడం ఎంతో మంచిది, వైద్యులిచ్చే గుళికలూ, మాత్రలూ సేవించే బదులుగా ఇలా సీజనల్ ఫ్రూట్స్ తినే ప్రయత్నం చేయడం ఉత్తమం కదా! భగవంతుడు ప్రకృతిమాత ద్వారా అందించిన అమోఘమైన ఫలాల్లో నేరేడు ఒకటి అని చెప్పక తప్పదు.నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని అని చెప్ప వచ్చు. అనారోగ్యాలను దూరంగాఉంచే ఆరోగ్యదాయిని. నేరేడు పండ్లు శక్తి నిచ్చి,ఆరోగ్యానికి మేలు చేయ డమే కాక కొన్నిరకాల రోగాలనూ రాకుండా మనశరీరం పోరాడే పటిమను అందిస్తుంది.

ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్‌ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండి పదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్‌ 15, ఐరన్‌ 1.2, విటమిన్‌ సి 18మి.గ్రా. ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడును జామ్‌లు, వెనిగర్‌, సాండీస్‌, ఆల్కహాల్‌, తక్కువ శాతం ఉండే వైన్‌ల తయారీలో కూడావాడుతారు. నేరేడు  పండ్లను 'ఆరోగ్య ఫల ప్రధాలూ ‘అని అంటారు.ఎందుకంటే దీనిలోని ఆహార విలువలు మన ఆరోగ్యా నికి బహు విధాలుగా ఉపయోగిస్తాయి గనుక  . నేరేడు రసం, నిమ్మరసం కలిపిన మిశ్రమం  మైగ్రేన్‌కు పరిష్కారం కలిగిస్తుంది.  నేరేడులో విషాన్ని హరించే శక్తి ఎక్కువగా ఉందని పురాతన వైద్యశాస్త్రంలో వెల్ల డించారు. పూర్వకాలంలో ఏదైనా విషపురుగులు శరీరంలో ఏదైనా భాగంలో కుట్టినట్లయితే వెంటనే నేరేడు ఆకులను అక్కడవేసి కట్టు కట్టేవారు. శరీరంలో ప్రవేశించిన విషం ప్రభావం మెల్లిగా నేరేడు ఆకులకు చేరి తెల్లారే సరికి రోగి లేచికూర్చునేవాడట.

చాలామంది  పిల్లలకు నులిపురుగుల సమస్యఉంటుంది, వారికి నేరేడు పండ్లు మంచి ఔషధంలా పని చేస్తాయి. నాలుగైదు పండ్లను మెత్తగా చేసి రసం రూపంలో ఇస్తే అవి వెంటనే చనిపోయి,పిల్లలు బలంగా తయారవుతారు. నేరేడు పండు కాలేయానికి కావల్సిన శక్తి నిచ్చిదాని పని సక్రమంగా చేసేలా సహక రి స్తాయి .ఈపండ్ల లోని యాంటాక్సి డెంట్లు చిన్న పిల్లలు రాత్రుల్లో బెడ్ తడిపే అలవాటుంటే ,అర టేబుల్ స్పూన్ నేరుడు గింజల పొడిని  నీళ్ళలో కలిపి రోజుకు మర్లు ఇస్తే రెండు మూడు వారాల్లో ఈ అలవాటును పోతుంది. మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు పండు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతున్నారు.

నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతోమంచిది. ఇది వీరిలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాక, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణా లైన  దాహం వేయడం,ఎక్కువమార్లు యూరిన్ కెళ్ళాల్సిరావడం వంటి లక్షణాలను తగ్గిస్తుందికూడా.అందువల్ల ఇది వీరికి వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

నేరుడు పండులో ఉండే గుణాలు కాలేయం అంటే లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే సహజ  ఆమ్లాలు జీర్ణశక్తిని పెంచడంలో చాలా సహకరిస్తాయి.

వర్షాకాలంవచ్చిందంటే ముఖయంగాపిల్లలకూ , వయసు మళ్ళినవారికీ  జలుబు, దగ్గు వంటి సమస్యలు రావడం కద్దు. నేరేడు కూడా వర్షాకాలంలో లభించే పండు కనుక ,ఈపండ్లను తిన్నట్లైతే జలుబు, కోరింత దగ్గు, ఆస్తమా వంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.      నేరేడు పండ్లను రోజూ ఉదయం ఉప్పుతో లేదా ఉప్పునీటిలో పది నిముషాలసేపు ఉంచి తీసుకుంటే ఆరో గ్యానికి చాలా మంచిది. పైల్స్ సమస్యతో బాధపడే వారు నేరేడు పండును తేనెతో తీసుకుంటే మేలు చే స్తుంది. వర్షాకాలంలో మనకు అంటుకునే వివిధ సీజనల్ జబ్బుల నుండి మన శరీర ఆరోగ్యాన్ని కాపాడు కొనే శక్తిని నేరుడు ఇస్తుంది.

ఒక్కమాటలో చెప్పలంటే నేరేడు ఆరోగ్య ఫల ప్రధాయిని. నేరేడు పండ్ల లో 'పొటాషియం ' అత్యధికంగా ఉంటుంది . అంటే 100గ్రాముల పండ్లలో 55మి.గ్రా ల పొటాషియం ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్ పుష్క లంగా లభించే ముదురురంగు వైన నేరేడు పండ్లు లభించినప్పుడు తప్పక తీసుకోవడం వల్ల గుండె ఆరో గ్యంగా ఉంచను సహకరిస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు మంచి మందు. నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల పళ్ళసంబంధమైన సమస్యలను కూడా నివా రించే అనేక మందుల్లో వీటిని విరివిగా వాడుతున్నారు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం,చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి అతిత్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే నోటి దుర్వా సన తగ్గుతుంది.పూర్వం గ్రామాల్లో చేసుకునే వైద్యం ఇదేమరి.

వేసవిలో వేడి తాపానికి మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. మన చర్మ మీద మచ్చ లు రాకుండానూ, రాషెష్ ను నివారించి నునుపైన చర్మ నిలవనుసహకరిస్తుంది. నేరుడు గింజలను పొడి చేసి ఉంచుకుని , రాత్రిపూట ఆపొడిని పాలతో కలిపి ముఖానిరాచుకుని మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడుక్కుంటే మొటిమలు తగ్గిపోతాయి. నేరేడు పళ్ళలోని  'యాంటీఆక్సిడెంట్స్ 'వృద్దాప్యలక్షణాలను త్వరగా రాకుండా అడ్డుకుంటుంది వృద్ధులవు తున్న కొద్దీ ఙ్ఞాపక శక్తి తగ్గడం మొదలవుతుంది ,ఆబాధనుంచీకూడా నేరేడు పడ్లు కాపాడుతాయి.నేరేడు పండ్లలోని క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఇంకా విటమిన్స్ సి శరీరానికి ఎంతో సహాయకారులుగా ఉండి రోగనిధోక శక్తిని పెంచతాయి. నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుండటాన ,ఇవి కళ్లు, చర్మారోగ్యా నికి మంచివి. నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్స్ సి శరీరానికిఎంతో మేలు చేసి మన శరీరంలో ఎముకలు బలంగా ఉండేందుకు సహకరిస్తాయి.
 శ్వాససంబంధమైన రోగాలతో బాధపడే వారు నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరమవుతాయి.

నేరుడు పండ్లు శరీరంలో హెమోగ్లోబిన్ను పెంచుతుందని అన్నామలై యూనివర్సిటి అధ్యయనం నిర్ధారిం చింది. వీటిలో ఉండే విటమిన్ సి, ఐరన్ ఆరోగ్యాన్నికాపాడే క్రమంలో ముందున్నాయనిఆహార నిపుణులు చెప్తున్నారు. సహజంగా రక్తపోటు తగ్గించే గుణం  నేరేడు పళ్ళలో ఉంది. ఒక్క నేరేడుపండు తినగానే మనకునోరంతా అదోమాదిరిగా ఎండినట్లూ ,చుట్టుకుపోయినట్లు ,వగరుగానూ ఉండటంతో పిల్లలు అస్సలు తినను ఇష్టపడరు.నేరేడును ఆయుర్వేద శాస్త్రంలో అపర సంజీవిని అంటారు. అందువల్ల ఉప్పువేసిన పుల్లమజ్జిగలో కొంతసేపు ఉంచి పిల్లలకు తప్పక తినిపించే ప్రయత్నంచేయాలి.  

పండిన నేరేడు పండులో ఇతర పండ్లతో పోల్చి చూస్తే మినిరల్స్ అధికంగా, క్యాలరీలు తక్కువగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటున్న్మదున,వీటిని తినడం వల్ల బరువు పెరుగుతామన్న భయం ఉండదు . నేరుడు ఆకులను ఆయుర్వేధ చికిత్సల్లో ఎక్కువగా వాడుతున్నారు. వీటిలోనే వైద్యపరమైన అనేక గుణా లుండటం వల్ల డయోరియా ,అల్సర్ వంటి జబ్బులను తగ్గిస్తుంది. పూర్వం  గాయాలకు చీముపడితే  నయం చేయను నేరేడు ఆకులను వాడేవారు. ఈ ఆకులకు యాంటిబ్యాక్టీరియల్‌ గుణంఉంది. వేడి చేసి నపుడు కడుపులో గ్యాస్ చేరి తిన్నది అరగకపోతే ,వాంతి వచ్చినట్లుంటే నాలుగైదు నేరేడు పళ్ళు తింటే వెంతనే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించి,ఒంట్లోని వేడిని సైతం  తగ్గిస్తాయి నేరేడుపళ్ళు. నేరుడు పండ్లలో నల్ల ఉప్పు , జీలకర్ర పొడికలిపి తింటే ఎసిడిటి తగుతుంది.     నేరేడుపండు తిన్నాక దాహం వేస్తుంది ఎందుకంటే దానిలోని వగరు, నోరెండిపోయే గుణమూ ఉన్నదని చెప్పుకున్నాం కదా ,ఐనా వెంటనే నీళ్లు తాగరాదు. కొంచెంసేపు ఆగి తాగాలి. వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, తగ్గించుకోను,నేరేడు పండును శ్రీ శనేశ్వర స్వామికి పూజ చేసి,నైవేద్యంగా పెట్టి ప్రసా దాన్ని తినడం, నేరేడు పండును బ్రాహ్మణునలకు దానమివ్వడం  చేస్తే ఆ బాధలు తగ్గుతాయని నమ్మకం.  నేరేడు పండ్లను శనేశ్వరునికి ప్రియమైన నల్ల నవ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు వదులు తాయం టారు. నేరేడు పండ్లను దేవునికిపూజించి, నివేదించి  భిక్షగాళ్లకు దానం చేస్తే దారిద్ర బాధ కూడా పోతుం దని విశ్వాసం.  ఇతరులకు భోజనంపెట్టేప్పుడు నేరేడు పండును వడ్డిస్తే వారికి ఎప్పుడూ మృష్టాన్న భోజ నం లభిస్తుంది. అంటే పేదరికం మన దరిచేరదన్నమాట. నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో వేద బ్రాహ్మణు లకు దక్షిణా తాంబూల సహితంగా దానం చేస్తే భూదానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలంతారు. 

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి