పగిలిన లేదా పొడిబారిన పెదాలకు గృహవైద్యము - అంబడిపూడి శ్యామసుందర రావు

foot protection  treatment in home

చలికాలములో చాలామంది ఎదుర్కొనే సమస్య చలికి పెదాలు పగలటము ఎన్ని రకాల కోల్డ్ క్రీములు వాడినా ఎంత జాగ్రత్తలు తీసుకున్న ఈ సమస్య చలికాలములో ఎక్కువగా ఉంటుంది. పెదాలు పగలటం లేదా పొడిబారిపోవటము అనేది సహజముగా పెదాలు ఏ కారణముచేతైనా తేమ సరిగా అందకపోవటంవల్ల జరుగుతుంది. కాబట్టి ముందు పెదాలు పగలటానికి లేదా పొడిబారతానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాము.

అవి నిర్జలీకరణము, పోషకాహారలోపం, ఎండలో ఎక్కువగా తిరగటం,ధూమపానము ,నోటిపూత, ఎలర్జీలు మొదలైనవి. లక్షణాలు కూడా తెలుసుకుందాము. పెదాలు ఎండిపోవటం,ఎర్రబడటము ,వాపు,పగుళ్లు ,పగుళ్ల వెంబడి నెత్తురు రావటము మొదలైనవి . ఇంకా వాటికి సంబంధించిన గృహవైద్యము ఏమిటో తెలుసుకుందాము.

1. తేనె :-పగిలిన పేదలకు తేనె సహజమైన బామ్ లాగా పనిచేస్తుంది. పెదాలకు  అవసరమైన తేమను అందిస్తుంది పైపెచ్చు తేనె యాంటీ బ్యాక్ టీరియల్ లక్షణాలు కలిగినది అవటమువల్ల పగుళ్లలో చేరిన బ్యాక్ టీరియాను నశింపజేస్తుంది. దీనిని వాడటము కూడా  చాలా సులువు రోజుకు రెండు సార్లు పెదాలపై తేనె ను పూతగా పూసుకోవాలి రాత్రి పడుకోబోయే ముందుకూడా రాసుకుంటే మంచిది.

2.పంచదార :-దంతాలకు పంచదార మంచిది కాకపోయినప్పటికీ పగిలిన పెదాలకు మంచిది. ఎందుకంటే పంచదార మృతకణాలను తొలగించి వాటిస్థానే కొత్తకణాలు ఏర్పడటములో తోడ్పడుతుంది. ఒక చెంచా తేనే లో రెండు చెంచాల పంచదారను కలిపి పగిలిన పెదాలపై ఈ పేస్ట్ ను పూసి ఒక గంటా లేదా రెండు గంటలపాటు ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.

3. నీరు:-పెదాలు పగలటానికి ఒక ముఖ్య కారణము డీహైడ్రేషన్ కాబట్టి వీలైనంతవరకు నోరు పొడిబారకుండా చూసుకోవాలి రోజుకు 6 లేదా 8 గ్లాసుల మంచినీరు త్రాగాలి. అందువల్ల బయటికి వెళ్ళేటప్పుడు వెంట మంచి నీళ్ల బాటిల్ ఉంచుకోవటము మంచిది .

4. పెట్రోలియం జెల్లీ:-పెట్రోలియం జెల్లీ పెదాలకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.  అంతేకాకుండా దెబ్బతిన్న కణాలను బాగుచేస్తుంది. కొద్దిపాటి వేజలైన్ కూడా పగిలిన పెదాలకు ఉపయోగపడుతుంది. అందువల్ల బయటికి వెళ్ళేటప్పుడు చిన్న వేజలైన్ ట్యూబ్ ఉంచుకోవటం మంచిది. తేనే కొద్దిగా పూసి ఆరనిచ్చిపెట్రోలియం జెల్లీని పూతగా పూయాలి కొంచము సేపు తరువాత గోరు వెచ్చని నీటిలో తడిపిన దూదితో పెదాలను తుడవాలి. ఈ విధముగా రాత్రి పడుకోబోయే మును చేస్తే మంచి ఫలితము ఉంటుంది.

5.ఆలోవెరా జెల్:-అలోవెరా(కలబంద) చర్మానికి బాగామేలుచేస్తుంది. కొద్దిగా జెల్ ను పగిలిన పెదాలపై రెండుమూడు సార్  రాయాలి. అలోవెరా జెల్ పెదాలను తేమగాఉంచుతుంది దేని రుచి బాగుండక పోయిన ఫలితము మటుకు బాగాఉంటుంది.

6.కొబ్బరినూనె :-కొబ్బరినూనెలోని సహజ సిద్ద పదార్ధాలు చర్మమును తేమగాఉంచి పొడిబారిన పెదాలకు ఉపశమనాన్ని ఇస్తాయి. పెదాల మృదుత్వాన్ని పెంచుతాయి. ఒక చెంచా కొబ్బరినూనెకు ఒక చెంచా ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని పెదాలపై వేళ్ళ ను గుండ్రముగా తిప్పుతూ రాయాలి  కొంచము సేపు తరువాత పొడిగుడ్డతో తుడవాలి.

7.ఆముదము :-పొడిపెదాలను బాగుచేయటంలో ఆముదము బాగా ఉపయోగిస్తుంది.చర్మము  పొలుసులుగా ఊడిపోకుండా కాపాడుతుంది. ఆముదాన్ని పగిలిన పెదాలపై పూతగాపూసి పైన పెట్రోలియం జెల్లీని పలుచగా పూయాలి. గ్లిజరీన్ కూడా వేజలైన్ బదులు వాడవచ్చు ఒకచెంచా ఆముదము ఒకచెంచా గ్లిజరీన్ కొన్ని చుక్కల నిమ్మరసము కలిపి ఈ మిశ్రమాన్ని పగిలిన పెదాలపై రాత్రి పడుకోబోయేముందు రాయాలి. పొద్దున్నే లేచినవెంటనే గోరువెచ్చని నీటిలో తడిపిన దూదితో తుడిచివేయాలి ఈవిధముగా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితము కనిపిస్తుంది.

8. కీర దోసకాయ:- వీటిని చక్రాల్లా తరిగి కండ్లపైన వాపు తగ్గించటానికి ఎక్కువగా వాడతారు ఈ కీర దోసకాయలు పగిలిన పొడిబారిన పెదాలకి మంచి మందుగా పనిచేస్తాయి దీనిలోని అస్కోరబిక్ ఆమ్లము కొలాజిన్  ప్రేరేపిస్తుంది కీర దోసకాయ ను చక్రాల్లా తరిగి ఒకటి తీసుకొని పెదాలపై నెమ్మదిగా పెదాలపై రుద్దాలి. ఆ తరువాత ఆ దోసకాయ చక్రాన్ని పెదాలపై ఒక అరగంట సేపు ఉంచాలి ఆ తరువాత పెదాలను గోరువెచ్చని నీటి తో కడగాలి. ఈ విధముగా రోజులో వీలైనన్ని సార్లు చేస్తే మంచి ఫలితము కనిపిస్తుంది.

9. గులాబీ పూల రేకులు:-గులాబీ పూల రేకులలో సహజమైన నూనెలు ఉంటాయి అవి పగిలిన పెదాలకి సత్వర ఉపశమనాన్ని ఇస్తాయి. వీటికి చర్మము క్రింద ఉండే రక్తనాళాలను ముకుళింపజేసే గుణము ఉన్నది ఇవి పెదాలకు మంచి రంగును ఇస్తాయి. గులాబీ పూల రేకులను నీటితో శుభ్రముగా కడిగి, పాలలో కొంచెముసేపు నానబెట్టి ఈ రెంటిని చిక్కటి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను పగిలిన పెదాలపై
పూయాలి రాత్రి పడుకోబోయే మును తప్పనిసరిగా రాయాలి.

10. పాల మీగడ :-పాల మీగడలో ఉండే క్రొవ్వు పగిలిన పెదాలకు మంచి ఔషదం గా పనిచేస్తుంది. కొద్దీగా పాల మీగడ ను  పొడిగా ఉండే పెదాలపై  పూస్తే క్రొవ్వు పదార్ధము లోపలికి ఇంకి పెదాలు పగుళ్ళను నయము చేస్తుంది. ఈ మీగడకు కొద్దిగా నిమ్మ రసము కలిపితే త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు అవకాశాన్ని బట్టి పైన చెప్పిన పది లో ఎదో ఒకటి ఉపయోగించి  పగిలిన లేదా ఎండిన పెదాలకు ఉపశమనాన్ని ఇవ్వచ్చు. కాబట్టి ఈ చలికాలములో ఈ సమస్య ఎదురైతే వీటిని ప్రయత్నించండి.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి