' పెద్ద నోట్లు రద్దు ' అని మోడి గారు టీవీ లో చెప్పినప్పుడు మేం ' బనారస్ ' యాత్ర లో వున్నాం . ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న మొదటి ప్రధాన మంత్రి అని అతను తీసుకున్న ధైర్యమైన నిర్ణయాన్ని హర్షించేము . అతను అధికారం లోకి వచ్చినప్పటి నుండి నల్లధనం మార్చుకోమని అన్ని మీడియాలలోనూ యాడ్స్ యిచ్చేరు , తరువాత నల్లకుబేరులు విచారించవలసి వస్తుందని కూడా చెప్పేరు . నల్లకుబేరులు ' యితనేం చెయ్యగలడు ' అని అనుకున్నారు , యేమైనా చెయ్యగలను అని మోడి గారు చేతలలో చూపించేరు .
ఇలాగే ప్రతీ మూడేళ్లకి ఓ సారి అన్ని నోట్లు చెల్లవని మార్చేస్తూ వుంటే నల్లకుబేరులు తెల్లగా మారుతారేమో ! యిది నా భావన మాత్రమే . ఇంత పెద్ద దేశం లో , యింత జనాభా కలిగి వున్నప్పుడు యిబ్బందులు కలగక మానవు . వాటిని బూతద్దం లో చూపించి , ప్రతిపక్షాలు చేస్తున్న గోల కూడా సామాన్యడు చూస్తున్నాడు . మొదటి రెండురోజులు యిబ్బందులు కలిగిన మాట నిజమే , తరవాత బ్యాంకు దగ్గర నోట్లు మార్పిడి కోసం రోజు కూలి యింత అని యిచ్చి క్యూ లో నిలబెట్టి నల్లధనం రంగు మార్చే క్రమంలో సామాన్యుడికి కాస్త అసౌకర్యం యేర్పడింది
ఇక్కడ మాకు కలిగిన యిబ్బంది కూడా చెప్తాను . చేతిలో 9 అయిదు వందల నోట్లు ' 5 వందల నోట్లు తో వున్నాం . వ్యాసకాశీ ఆటో లో వెళ్లడానికి అయిదు వందలకు మాట్లాడు కున్నాం , ఆటో అతను అయిదు వంద నోట్లు తప్ప మరేమీ వద్దనడం తో అయిదు నోట్లు అయిపోయేయి . తరువాత యెలా ? మేమున్న హోటల్ మేనేజర్ తో మా యిబ్బంది చెప్పి మూడు వందనోట్లు అప్పుగా తీసుకున్నాం . అన్నపూర్ణా దేవి దయతో పొద్దున్న , సాయంత్రం తిండికి పైసా ఖర్చులేదు కాశీలో , ఒకటి రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లసాగేం .
ఇత్తడి విగ్రహాలు కొనాలి యెలా ? అనుకుంటున్న సమయంలో దుకాణం యజమాని అయిదు వందలు పుచ్చుకుంటానని భరోసా యిచ్చేడు , దాంతో నాకు కావలసినవి కొనుక్కొని బయటకి వచ్చేం . యెదురుగా కర్ర వస్తువులు అంటే కవ్వం , రొట్లు చేసుకొనే కర్రలు మొదలయినవి అతను మమ్మల్ని ఆపి యేదైనా తీసుకొని మప్పైయో నలభైయో యిమ్మని బ్రతిమాలసాగేడు . మాకు ఆ షాపులో యేమీ అఖ్కరలేదు , అతను హోమంలో నెయ్య వేసే కర్ర గరిట తీసుకొని యెంత చిల్లర వుంటే అంత యిమ్మన్నాడు . నాకొద్దు బాబూ అది నేనేం చేసుకోను అంటే అతను యింటికి పాలు తీసుకు వెళ్లాలి , చిన్నపిల్ల వుంది అంటే నేను అది తీసుకొని చిల్లర వెతికితే ముప్పై రూపాయలు దొరికాయి , యివి చాలు మేడం అన్నా నేను మరో పది రూపాయలు పర్సంతా కింద మీదా వెతికి యిస్తే మేడం రేపు మీకు అవుసరం అవుతాయేమో వుంచుకోండి అన్నాడు , లేదు పదిరూపాయల అవసరాన్ని నేను వాయిదా వేసుకోగలను పిల్లకు పాలు ముఖ్యం అని , యింత యిబ్బంది కలుగ చేసిన మోడి గారిమీద కోపంగా లేదా ? అన్నాను . పెద్ద పెద్ద క్రూర మృగాలను వేటాడే టప్పుడు చిన్న చిన్న జంతువులకు యిబ్బంది కలుగుతుంది కొన్ని సమయాలలో చిన్న జంతువులు ప్రాణాలు కోల్పోతాయి కూడా అలా అని క్రూరజంతువులను వేటాడకపోతే ప్రమాదం కదా అన్నాడు .
ఎంత విలువైన మాట కదా !
ఇలా మాకు యెదురైన రిక్షావాలానుంచి అందరూ సకారాత్మకంగా మాట్లాడారు .
' కావలసినన్ని కొత్తనోట్లు ముద్రించకుండా పాతనోట్లు రద్దు చెయ్యకోడదు ............ '
యిలా రకరకాల నినాదాలు చేస్తున్న నాయకులు యిలాంటి ప్రతిపాదిన యెందుకు చెయ్యలేదు ?
యెక్కడో చిన్నప్పుడు ఓ కథ చదివిన జ్ఞాపకం , అందులో కొన్ని బావులలో కొందరిని పడేసేరు , బయటకు యెవరూ రాకుండా అన్ని బావుల దగ్గర కాపలా పెట్టేరు కాని ఓ బావి దగ్గర కాపలా పెట్టలేదు . కారణం ఆ బావిలో వున్నవారు భారతీయులట , యెవరైనా పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే మిగతా వారు వాడిని కిందికి లాగేస్తారు కాబట్టి కాపలా అఖ్కరలేదు అనేది ఆ కథ సారాంశం . యెంత నిజం కదా ?
ఓ ప్రయోజనం కోసం ఓ మంచి పని జరిగితే మిగతా పార్టీలన్నీ కలిసి నానా యాగీ చెయ్యడం ఒక్క మనదేశం లోనే చూస్తామేమో ?
10 Nov కి రెండు వేలకు పాతనోట్లు మార్చుకొని మా ఖర్చులకు ఓ వెయ్యి వుంచుకొని ట్రైను లో ప్రయాణిస్తున్న మా వాళ్లకి మిగతా వెయ్యి యిచ్చేం . బొంబాయి ఎయిర్ పోర్ట్ లో దిగేసరికి ఆకాశంలో తాగిన టీకి ఓ వందకు రెక్కలొచ్చేయి . పొద్దున్న టీ తాగకుండా ఎయిర్ పోర్ట్ కి బయలుదేరేం మరి . పూనె వరకు టాక్సీ మనిషికి ₹900 / , మధ్యవర్తి తొమ్మిది వందలు తీసుకొని దిగేటప్పుడు మిగతా తొమ్మిది వందలు యివ్వాలనే షరతు మీద టాక్సీలో యెక్కించేడు . ఎయిర్ పోర్టులోని ATM లలో డబ్బులు లేవు . మా దగ్గర మంచినీరు బాటిల్ కి కూడా డబ్బులు లేవు , యెన్ని ATM లలో ప్రయత్నించినా డబ్బులు రాలలే . ఈ లోగా టాక్సీ అతనిని పాత నోటు పుచ్చుకోడానికి రాజీ చేసేం . ఒక వేళ అతను మార్చుకోలేక పోతే మళ్లా మా యింటికి వచ్చి నోటు మార్చుకోమని చెప్పి పాత నోట్లతో చెల్లింపు చేసేం . ఆ రోజు మాకు కటిక వుపవాసం రాత్రి పదింటికి పెరుగు అన్నం ఆవకాయతో తిన్నాం .
నాకు యివాళటి వరకు యెదురైన సామాన్యులు ( యిలా మన టివి వాళ్లు వాడు తున్న పదం ) యెవరూ కూడా యిబ్బందులు పడుతున్నాం . పెద్ద నోట్లు యెందుకు రద్దు చెయ్యాలి అని యెవ్వరూ అనడం లేదు . అందరూ ' మంచి పని చేసేరు మోడీ గారు ' సగం నల్ల సొమ్మేనా బయటికి వస్తుంది అని అంటున్నారు .
ఈ నల్లకుబేరులు యెవరు ? యెవరి దగ్గర నల్ల సొమ్ము వుండగలదు అంటే మనకి ముందుగా మన నాయకులు , పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు , పెద్దపెద్ద తిమింగలాలు కాకుండా చిన్నచిన్న చేపలు లెక్కకు మించి కళ్ల ముందు తిరిగేయి . అలాంటివే కొన్ని చెప్తాను మిగతావి మీకే తెలుస్తాయి .
ఆ రోజు నేను బెనారస్ లో వున్నానని చెప్పాను కదా అక్కడివే వుదాహరణగా చెప్తాను , కాశి వెళ్లిన వాళ్లు సాధారణం గా పూజలు , తద్దినాలు , శ్రాద్ధకర్మలకు వెళతారు . ఇలాంటివి చేయించేవాళ్లు ప్రాంతీయాభిమానాన్ని బాగా వాడుకుంటారు . మీది ' తెనాలే మాది తెనాలే ' టెక్నిక్ బాగా పనిచేస్తుంది . ఇంత అని మొత్తం యిచ్చేస్తే వాళ్లే అన్నీ చూసుకుంటారు , అది అందరికీ ఆమోద యోగ్యం కూడా ! అలాంటి ఓ జోషి గారి గురించి చెబుతాను . గత ముప్పై యేళ్లగా ఆంధ్ర ఆశ్రమం వున్న వీధిలో వున్న ఓ జోషిగారు శుభ , అశుభ కార్యాలు చేయిస్తూ వుంటాం . అక్కడే మా ఆడపడుచు లక్షవత్తుల నోము చేయించుకుంది . నోము నిమిత్తం యివ్వవలసిన సొమ్ము యిచ్చేసిన తరువాత పెద్ద నోట్లు చెల్లవనే నియమం వచ్చింది , మరునాడు మా మేనమామ గారి ఆబ్దికం , అందుకు చెల్లించ వలసిన సొమ్ము పాత నోట్లలో చెల్లించబోతే ఆ జోషిగారిచ్చిన సమాధానం మాకు తలతిరిగేలా చేసింది , వారి దగ్గర వందల కోట్ల విలువైన పెద్ద నోట్లు వున్నాయట , నల్ల సొమ్ముని యే డిటర్జెంటుతో ఉతకాలో తెలీక రెండు రాత్రులుగా నిద్రలేదుట , పెద్ద నోట్ల మాట వింటే యెదురుగా వున్నవారిని ఉతికి ఆరేయాలనిపిస్తోందట శ్రోతలమైన మాకు నోరెళ్లబెచ్టడం తప్ప మరేమీ తోచలేదు .లక్ష్మీదేవి యే రాజకీయనేతల చేతులలోనో , వ్యాపారవేత్తలు దగ్గరో , సినిమారంగం చేతులలోనో లేక పోతే రియలెస్టేట్ వారి దగ్గరో రంగుమారి పరుపులకిందో యినమబీరువాలలోనో దాగుతుంది అనుకుంటున్న మాకు కళ్లు తెరుచుకొని యిలాంటి రిసీటు లేని యెన్నో చిన్న చిన్న ( అలా కనిపించే ) వ్యాపారుల దగ్గర కూడా లచ్చిందేవి రంగుమారి అటకమీద దాక్కోగలదని తెలిసింది .
అది నిజమేనని రుజువు చేసింది బొంబాయిలోని మా అనుభవం , ఎయిర్పోర్టు నుంచి పుణె టాక్సీ మనిషికి తొమ్మిది వందలకు మాట్లాడుకున్నాం , మాదగ్గర తొమ్మిది వందలు తీసుకొని జేబులో వేసుకొని ఓ టేక్సీ యెక్కించేడు అతని దగ్గర మరో వంద తీసుకొని మాలాగా మరో అతనిని టాక్సీ యెక్కించి నాలుగు వందల యాభై జేబులో వేసుకున్నాడు . టాక్సీ యజమానికి ముట్టింది సగమే . ఇలాంటి ఆర్జనకు లెక్క వుందా ? పన్నులు యెవరు వసూలు చేస్తున్నారు .
కాశీలో బోర్డున్న లాడ్జింగులు తక్కువ , యింటిని లాడ్జ్ గా మార్చి అద్దలకిచ్చేవే యెక్కువ , అలాంటి వాళ్లు పడక కి యింత అని ధర నిర్ణయిస్తారు . ఆరు పడకల గదికి సుమారు 1500 రోజులకి వసూలు చేస్తూవుంటారు . వీరికి యేడాది ఆదాయం యెంత , గదికి తాళం కూడా యివ్వరు , వారి ఖర్చు యెంత ? ఆదాయం యెంత ? పన్నులు కడుతున్నారా ? ఇలాంటి రశీదులు యివ్వని వ్యాపారాలు యెన్నో ? వీళ్లని చిన్నచిన్న చేపలనొచ్చు .
కూరలు , పళ్లు కొని అమ్మే దళారులు యెంత నల్లలక్ష్మిని గోనెసంచీలో దాచారో ?
ఇంత నలుపును తెలుపు చెయ్యడానికి మోడీ గారి దగ్గరవున్న డిటెర్జెంటు సరిపోతుందా అంటే అనుమానమే ?
యే మంచయినా ఆచరణలోకి రావాలంటే ప్రజల సహకారం యెంతో అవుసరం .
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి 10 వ తారీఖు మద్యాహ్నం కేష్ బ్యాంకులకు వచ్చింది ( కాశిలో ) , టైమయిపోయినా వుద్యోగులు పనిచేసి ప్రజలకు నోట్లు మార్చుకొనే సులువు కల్పించేరు . దేశం మొత్తం వున్న అందరు బ్యాంకు వుద్యోగులకు నా అభినందనలు .
మోడీ గారి పెద్దనోట్లనే వలలో చిన్న చేపలు పడతాయేమో గాని తిమింగలాలు పడతాయా ? .
ఈ నెల్లాళ్లలోనూ మనం చూసింది చిన్న చేపలను , తిమింగలాలు కోట్లు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు , పండగలు చేసుకుంటున్నాయి .
సామాన్యుడు యెప్పుడూ ఆశాజీవే , ఈ సారి చిన్నచేపలు పడ్డాయి , రేపు తిమింగలాలు కూడా పడతాయి అనే ఆశతో యిప్పుడు పడుతున్న యిబ్బందులను సంతోషంగా ' నేను సైతం ....... నేను సైతం ....... ' అని పాడుకుంటూ గడిపెస్తాడు .
ఇలాగే ఒకటి రెండు సంవత్సరాలకోసారి పాతనోట్లను చెల్లవు అంటూ వుంటే బడాబాబులు లక్ష్మీ దేవిని నల్లబడకుండా వుంచుతారని సాధారణ సామాన్యురాలిగా నా ఆశ .
వార్తలలో చూపిస్తున్నంత ఘోరంగా పరిస్థితి లేదు , నిన్నటి నుండి కొన్ని స్టోర్స్ లలో కార్డ్ స్వైప్ చేసుకొని రెండువేలవరకు నగదు తీసుకొనే వీలుకూడా కలిగించేరు .
మళ్లా ఎన్నికలలో గెలవడం సాధ్యం రాకపోవచ్చు అనే భయం తో యిప్పటి వరకు యే ప్రధాన మంత్రి చెయ్యని పనిని యే భయం లేకుండా చేయ సాహసించిన మోడీ గారి ధైర్యానికి నా నమస్కారాలు .