నవ్వండి-నవ్వించండి - ..

 

1. అదే వెలుగు
సందీప్: ఏంట్రా కరెంట్ పోయినా ఇంట్లో దీపం పెట్టలేదేంటి?
ప్రశాంత్ : మా ఆవిడ చదువుకుంటోందిరా, అందుకని.
సందీప్: అయితే?
ప్రశాంత్: " ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు" అన్నారుకదా, ఇక వేరే దీపం ఎందుకు, దండగ?
***********

2.చక్కని మార్గం
రాము: దోమలు విపరితంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
రమేష్: ఓ పని చెయ్యి- ఇంటికి 'టు లెట్' అని బోర్డు పెట్టు. 'ఇల్లు ఖాళీగా ఉంది కదా' అనుకొని, దోమలు లోపలకి రావు.

***********

3.పాపం పిసినారి!
చింటు: నాన్నా! పక్కింటి వాళ్ళు పిసినారులా?
తండ్రి: లేదే? ఎందుకు వచ్చిందిరా, నీకా అనుమానం?
చింటు: వాళ్లబ్బాయి పావలా మింగాడట. మరి ఆ మాత్రం దానికే వాళ్ళు అంతగా ఎందుకు ఏడుస్తున్నారు?

**********

4.చక్కని జంట!
పెళ్ళి కూతురు తల్లి: మా అమ్మాయి ఒట్టి పుస్తకాల పురుగండీ.
పెళ్ళి కొడుకు తండ్రి: ఫర్వాలేదులేండి, మా అబ్బాయిది పురుగు మందుల వ్యాపారమేగా!

 *******

5.ఏమీ మిగల్లేదు
కొడుకు:నాన్నా ! ఈ రోజుతో నా చదువు పూర్తయింది. అన్ని రకాల కోర్సులూ పూర్తి చేశాను.
తండ్రి: నా ఆస్తి కూడా పూర్తయింది. అన్ని రకాల అప్పులూ చేశాను.
******* 

6.ఇదొక్కటే చాలు
షాపు యజమాని: మా స్వీట్ షాపులో పని చేయడానికి మీకున్న అర్హతలేంటి?
సుబ్బారావు: నాకు షుగర్ ఉంది సార్!
****** 

7.తెలివి!
మాస్టారు: సునీతా, ఎనిమిదిలో సగం ఎంత?
సునీతా: అడ్డంగా కోస్తే సున్నా, నిలువుగా కోస్తే మూడు సార్!
******* 

8.ఏం పని!?
బ్రహ్మాం: సడన్ గా భగవంతుడు ప్రత్యక్షమైతే నువ్వేం అడుగుతావు?
వెంగళప్ప: 'నాతో ఏం పనుండి ప్రత్యక్షమయ్యారు స్వామీ?' అని అడుగుతాను.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి