1. పెద్ద నోట్ల రద్దు నిజంగా స్వాగతించాల్సిన విషయం. ప్రధాని మోదీ నిజంగా దేశం కోసం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇది అందర్నీ అడిగి, పార్లమెంటులో బిల్లు పెట్టి తీసుకునే నిర్ణయం కాదు. చాలా రహస్యంగా తీసుకోవాలి. అలాగే చేసారు. దీని వల్ల పేదల జీవితాలు బాగుపడతాయి. ప్రస్తుతం చాలాచోట్ల కొత్త నోట్ల రూపంలో దొంగమార్గంలో నల్లధనన్ని కూడబెడుతున్న వారు కనిపిస్తున్నా వారికి కూడా త్వరలో చరమగీతం పాడతుంది ప్రభుత్వం. జనం బలవంతంగా డిజిటల్ వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి మరింత కల్పిస్తుంది ప్రభుత్వం. దానిని కూడా కష్టమైనా స్వాగతించాల్సిందే. త్వరలో 2000 నోట్లు కూడా రద్దవుతాయి. ఒక ఏడాది ఇబ్బందులున్నా తర్వాత అంతా స్వర్ణభారతమే! 2019లోనూ మోదీకే జనం పట్టం కడతారు.
2. పెద్దనోట్ల రద్దు చేయాల్సిన విధంగా చేయలేదు. ఇది పేదలకే ఇబ్బంది తప్ప బడాబాబులకి కాదు. మోదీది తుగ్లక్ పాలన. ఎవర్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆర్థికవేత్తలు ఎందరో మన దేశంలో ఉన్నారు. వారెవ్వరికీ తెలియదు. ఇది జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పనులాపుకుని అందరూ బ్యాంకుల్లోనూ, ఏ టీ యం ల దగ్గర నిలబడుతున్నారు. బ్యాంకుల్లో లోన్స్ వంటి ఇతర వ్యాపారాలు స్థంభించిపోయాయి. దేశం వెనక్కి పోయింది. 2019 లో మోదీ ప్రభుత్వం అవుట్!
పై రెండిట్లో ఏది కరెక్ట్?