1. ' ఏంటల్లుడూ ... బంగారంలాంటి ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసేశావటా అడిగారు ఆఘమేఘాలా మీద వచ్చిన మామగారు.
'మరేం చేస్తారు నాన్నా, ఆయనకు నిద్రలో ప్రాణ గండం వుందని జ్యోతిష్కుడు చెప్పాడూ అసలు విషయం చెప్పింది కూతురు.
2. రాము: " నే విన్నది నిజమేనా? పెళ్ళి కాగానే వేరే కాపురం పెట్టవటగా?" సోము: "నువ్వు విన్నది అబద్ధం రా! గిట్టని వాళ్ళెవరో అలా చెప్పి వుంటారు. మా ఆవిడతో సరిపడక... మా అమ్మా - నాన్నే ఇంట్లో నుంచీ వెళ్ళిపోయి , వేరు కాపురం పెట్టారు అంతే..!"
3. కల్యాణరావు ఓ వెరైటీ మనిషి. ఏ విషయమైనా సూటిగా చెప్పడు. తిప్పి తిప్పి చెబుతాడు. అతడికి జి.ఎం గా ప్రమోషన్ వచ్చింది. అదే విషయాన్ని భార్యతో చెబుతూ 'ఏమేవ్, ఇక నుంచి నువ్వు జి.ఎం భార్యవీ అన్నాడు.
'పోనిద్దురూ, ఇప్పటికైనా నా మనసులో మాట కనుక్కున్నారు. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు?' సిగ్గుపడుతూ అడిగింది వాళ్ళావిడ.
4. ప్రభావతి తన స్నేహితురాలు స్వాతి ఇంటికెళ్ళింది. ఇల్లంతా చూస్తూ పూజ గది లోకి అడుగుపెట్టింది. అక్కడ ఓ అరటి తొక్కపై పూలూ, పసుపూ కుంకుమా వుండటం చూసి 'ఇదేంటీ తొక్కకు పూజలు చేస్తున్నావూ అంది ఆశ్చర్యంగా,
;దానివల్లే నాకు ఇంటిపెత్తనం వచ్చిందే'
'అదెలా?'
'దానిపై అడుగేసే కాలు జారిపడి , నడుం విరగొట్టుకుంది మా అత్తయ్య. ఆ తరువాతే ఇంటిపెత్తనం. బీరువా తాళాలు చేతికొచ్చాయీ అంది తొక్కకు దండం పెడుతూ.
5. చెకప్ కోసం పిల్లను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు దంపతులు. భర్త ఒడిలో పిల్లాడున్నాడు. భార్య ఒడిలో పాప.
'బాబుది మీ పోలికే' నాడి చూస్తూ అన్నాడు డాక్టర్.
నవ్వి ఊరుకున్నాడు భర్త.
'మీ పాప చాలా ముద్దుగా వుందీ చెప్పాడు డాక్టర్..
నవ్వి ఊరుకుంది భార్య.
వచ్చిన ప్రతివాళ్ళతో అలా ముద్దుగా వున్నారనే చెబుతారనుకుంటా' అన్నాడు భర్త.
'లేదు నిజంగా నాకు నచ్చితేనే చెబుతాను.
'నచ్చకపోతే?"
మీ పోలికే అంటాను.