అందరు గుండె ఆరోగ్యముగా ఉండాలి గుండెకు సంబంధిచి ఏ రకమైన సమస్య రాకూడదు అని కోరుకుంటారు కానీ ప్రతి ముగ్గురు లో ఒకరు గుండెకు సంబంధిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. మన రోజు వారి అలవాట్లు మనకు తెలియకుండానే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, కాబట్టి అటువంటి మన అలవాట్లను తెలుసుకుంటే వాటిని వదలి గుండె ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు
1. ఎక్కువగా టి.వి. చూడటము:- టి.వి. ముందు కూర్చుని గంటల తరబడి చూడటము గుండె నొప్పి వచ్చే అవకాశాలను పెంచుతుంది కదలిక తగ్గటమువల్ల క్రొవ్వులు షుగర్స్ యొక్క చలనము రక్తములో తగ్గుతుంది. పైపెచ్చు చాలా మంది టి.వి.చూస్తూ ఎదో ఒకటి తింటూఉంటారు అది ఉబాకాయత్వానికి దారితీస్తుంది ఉబకాయత్వము గుండెకు హానిచేస్తుంది.కాబట్టి ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్య
మధ్య లేచి అటు ఇటు తిరగండి .
2. ఒత్తిడి ఆందోళన,, డిప్రషన్లను పట్టించుకోకపోవటం:- మన భావోద్వేగాలను ఎలా మేనేజ్ చేస్తామో అన్నది మన ఆరోగ్యాన్ని తెలుపుతుంది. ఆందోళన ఒత్తిడి లాంటి సమస్యలను తక్కువగా అంచనా వేయకుండా పూర్తిగా నిర్లక్ష్యము చేయకుండా వాటిని వదిలించుకొని ప్రయత్నము చేయాలి మనస్ఫూర్తిగా నవ్వటం నలుగురిలో కలసిపోవటము అవసరము.
3.గురకను నిర్లక్ష్యము చేయటము:- గురక పక్కవారికి ఇబ్బంది కారము కావచ్చు కానీ గురక అనేది నిద్రపోయేటప్పుడు స్వాసక్రియకు అవరోధము ఈ గురక అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే వ్యాధికి ఒక గుర్తు. గురక వల్ల రక్త పీడనము రాకెట్ స్పీడ్ లో పెరుగుతుంది. లావు పాటి వారిలో ఈ స్లీప్ అప్నియా ఎక్కువ రిస్క్ గురక పెడుతున్నారని ప్రక్క వారు మనకు చెప్పినప్పుడు ఈజీగా తీసుకోకుండా డాక్టర్ ను సంప్రదించండి.
4.పొగత్రాగటం లేదా పొగ త్రాగే వారి మధ్య ఎక్కువ కాలము గడపటము :- ధూమపానము హాని కారము అది గుండె పై ప్రభావాన్ని చూపుతుంది ధూమపానము వల్ల రక్త నాలాలో అవరోధాలు ఏర్పడతాయి పొగ త్రాగే వారికే కాకుండా ప్రక్కనున్న వారికి కూడా హాని జరుగుతుంది సుమారు 46,000 వేల మంది ఎవరైతే పొగత్రాగేవారితో నివసిస్తారో వారు ప్రతి సంవత్సరము గుండె జబ్బుల వల్ల
మరణిస్తున్నారు.
5. అధికముగా సారా త్రాగటము :- ఎక్కువగా మద్యము సేవించటము అధిక రక్త పీడనాన్ని కారణమవుతుంది రక్తము;లో క్రొవ్వు పెరిగి హార్ట్ ఫెయిల్ కు కారణమవుతుంది. కాబట్టి మధ్యపానము మంచిదికాదు అంతగా త్రాగ దలచుకుంటే మగవారు రోజుకు రెండు డ్రింకులు (ఒక డ్రింకు నాలుగు ఔన్సులకు సమానము), ఆడవారు ఒక డ్రింక్ తీసుకోవచ్చు అందుకే దానికి మెడికేటెడ్ డోస్ అంటారు.
6. మంచి ఉద్దేశ్యముతో శారీరక వ్యాయామము ప్రారంభించి మధ్యలో ఆకస్మికముగా మానివేయటము మనకు ఏమి కాదులే అన్న ధీమా కలిగి ఉండటము మంచిది కాదు.చేసే వ్యాయామము ను మానకుండా దీర్ఘకాలం కొనసాగిస్తే గుండెకు మంచిది.
7. కొత్త పరిశోధనల వల్ల తగుమోతాదులో రోజు కాఫీ తీసుకుంటే ధమనుల్లో క్రొవ్వు పేరుకుపోయి అవకాశాలు తగ్గుతాయి అని తెలుపుతున్నాయి. కాఫీ త్రాగేవారిలో,గుండె జబ్బులకు కారణమైన క్యాల్షియమ్ కరోనరీ ధమనులలో పేరుకుపోదని కొత్త పరిశోధనలు తెలియ జేస్తున్నాయి .
8. ఎక్కువ తీపి పదార్ధాలు, క్రొవ్వు పదార్ధాలు,నూనెలను తగ్గించాలి. వీటిలో కెలోరీలు అధికముగా ఉండటమే కాకుండా శరీరానికి పనికివచ్చే పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి ఫలితముగా ఊబకాయత్వము మధుమేహము లాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయి కాబట్టి కూరగాయలు,పండ్లు,సీ ఫుడ్స్ ,గ్రుడ్లు ఫ్యాట్ ఫ్రీ లేదా లో ఫ్యాట్ పాలు లాంటివి తీసుకుంటే గుండెకు మంచిది.
9. అధిక రక్త పీడనము గుండె జబ్బులకు ముఖ్య కారణము మూత్ర పిండాలు సరిగా పనిచేయాలి అన్న హార్ట్ అటాక్ లను దూరంగా ఉంచాలన్న తక్కువ ఉప్పు తీసుకోవాలి. మనము రోజు 2,300 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలి అప్పటికే అధిక రక్త పీడనం ఉన్నవారు 1,500మిల్లీగ్రాముల మించి తీసుకోరాదు.అదే విధముగా జంక్ ఫుడ్ ను మానివేయాలి ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ బయట కొనేటప్పుడు వాటిలోని సోడియమ్ శాతాన్ని గమనించి కొనాలి.
10. బాహ్యముగా కనిపించే లక్షణాలను గమనిస్తూ ఉండాలి. ఛాతీపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా ,మెట్లు ఎక్కేటప్పుడు స్వాసక్రియ ఇబ్బంది
అనిపించినా,తప్పనిసరిగా అశ్రద్ధ చేయకుండా డాక్టను సంప్రదించాలి. ఎందు టే అశ్రద్ధచేయకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏరకమైన హాని గుండె కండరాలకు సంభవించదు .
11. పండ్లు కూరలు తక్కువగా ఉండే ఆహారము తీసుకోనే వారిలో 20% గుండె జబ్బులు అధికముగా వచ్చే అవకాశము ఉంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
12. అధిక రక్త పీడనమును సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటారు.దానికి సంబంధించిన మందులను డాక్టర్లు చెప్పిన విధముగా రెగ్యులర్ గాతీసుకోవాలి మధ్యలో మానివేయటము లేదా క్రమము తప్పించటం లాంటివి చేయరాదు. చాలా మందికి మందులను జాగ్రత్తగా వేసుకోవటము చికాకు ఒక విధముగా నిర్లక్ష్యము కూడా ఆ పొరపాటే ప్రాణాలమీదకు తెస్తుంది.
13. దంతాలకు సంబంధించిన జబ్బులకు గుండె జబ్బులకు సంబంధము ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మధ్య చేరిన లేదా పళ్ళపై పేరుకున్న గారను తొలగించటము ద్వారా దంతాలకు సంబంధించిన రోగాలను నివారించవచ్చు గార దంతాలపై పేరుకు పోవటం లేదా దంతాల మధ్య ఆహారపదార్ధాలు చిక్కున్నప్పుడు అవి బ్యాక్తీరియాను వృద్ధిచేస్తాయి. ఫలితముగా శరీరములో ఇన్ఫలమేషన్ ఏర్పడుతుంది ఈ ఇన్ఫలమేషన్ ధమనులలో ఏర్పడే "ఎతీరోస్కిరోసిస్" అనే వ్యాధికి కారణము అవుతుంది. కాబట్టి దంత సమస్యలను అశ్రద్ధ చేయకుండా నయముచేసుకుంటే రక్త నాళాలు బాగా పనిచేస్తాయి.
14. కుటుంబములోని సభ్యుల మధ్య గల సంబంధాలను నిర్లక్ష్యము చేయటము చాలా మంది చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులు మనము సుఖముగా ఆరోగ్యముగా జీవించటానికి మంచి సహకారాన్ని ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు,స్నేహితులతో సత్ సంబంధాలను కొనసాగించండి.
15. చాలా మంది "నాకేమి ప్రమాదములేదు నారోగ్యము బాగానే ఉంది " అన్న మితిమీరిన విశ్వాసముతో ఆరోగ్యాన్ని అశ్రద్దచేసి పీకలమీదకు తెచ్చుకుంటారు అటువంటి ధోరణి పనికిరాదు గుండె విషయములో ఏదైనా లోపాలను గుర్తించిన వెంటనే డాక్టరు సలహా తీసుకోవాలి
16. చివరగా మాంసాహారులు తీసుకొనే "రెడ్ మీట్"దీనిలో సంతృప్త క్రొవ్వు శాతము అధికముగా ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన పందిమాంసము కుక్క మాంసము గుండె జబ్బులు మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ వ్యాధులు వచ్చే శాతాన్ని అధికము చేస్తాయి అందుచేత మన ఆహారములో జంతు సంబంధించినవి 10% దాటకుండా చూసుకోవటం గుండెకు మంచిది కాబట్టి శాఖాహారమే మంచిది తప్పదు మాంసాహారము తినాలి అనుకున్నప్పుడు వీలైనంత తక్కువ పరిమాణములో తినాలి ఆరోగ్యము అందునా గుండె ఆరోగ్యము ముఖ్యము కదండీ మరి. సాధారణముగా మనము గమనించ గలిగే హార్ట్ ఎటాక్ లక్షణాలు:-మొదటగా కనిపించే లక్షణము ఛాతీలో నొప్పి, చాతీ మధ్య భాగము లో బాగా పిండేసినట్లు చాతీమీద చాలా ఎక్కువ బరువు ఉన్న అనుభూతి కలుగుతుంది.ఇలా ఒక పదిహేను నిముషాలు ఉండవచ్చు. భుజాలు, మెడ, చెయ్యి ,వీపు భాగాలలో విపరీతమైన నొప్పి ప్రారంభమవుతుంది కొన్ని సందర్భాల లో పండ్లు దవడలలో కూడాతీవ్రమైన నొప్పి ఉంటుంది క్రమముగా ఛాతీలో నొప్పి అధికమవుతుంది. ఉదరభాగములో పై భాగములో నొప్పి విస్తరిస్తుంది.శ్వాస ఇబ్బంది ఉంటుంది. విపరీతమైన చెమట పడుతుంది. రక్త ప్రసరణ సరిగా జరగక పోవటం వల్ల ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఉదరంలో
నొప్పి,గుండె లో మంట ,విపరీతమైన అలసట, మెడ ,భుజాలులేదా వీపు పైభాగములో నొప్పి లేదా బిగుసుకు పోయినట్లు ఉండటం కూడా హార్ట్ అటాక్ లక్షణాలు అందరిలో ఒకే వ్రకమైన లక్షణాలు కనిపించవు ఈ లక్షణాలు మనిషిని బట్టి మారుతుంటాయి. కొన్ని అరుదైన సందర్భాలలో అంటే మధుమేహ రోగులలో హార్ట్ ఎటాక్ బాధాకరంగా ఉండదు అంటే ఎక్కువ నొప్పి ఇతర భాధలు తెలియవు. చాలా సందర్భాలలో గుండె నొప్పిని గ్యాస్ ట్రబుల్ లేదా మరి యితర ఉదరకోశ ఇబ్బంది అనుకోని నిర్లక్ష్యము చేస్తారు. మంకు లేదా మన ఆత్మీయులకు ఇటువంటి లక్షణాలుకనిపిస్తే వెంటనే వైద్య సహాయము అందించాలి
లక్షణాలను బట్టి హార్టు ఎటాక్ అని తెలిస్తే ఏమి చేయాలి?
వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చాలి. ఎటాక్ ను గుర్తించన వెంటనే డిస్ప్రిన్ (యాస్ప్రిన్) మాత్రను పొడిచేసి నీటిలో కలిపి త్రాగించాలి.
అంబులెన్స్ కు ఫోనెచేసి హాస్పిటల్ కు రోగిని చేర్చే ప్రయత్నము చేయాలి. హార్ట్ ఎటాక్ కార్డియాక్ అరెస్టుకు తేడా వుంది. ఈ రెంటికి కన్ఫ్యూజ్ అవకూడదు కార్డియాక్ అరెస్ట్ అంటే అకస్మాత్తుగా గుండె ఆగిపోవటము వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ ను SCA అంటారు ఇది గుండెనుంచి రక్తము మెదడుకు పంప్ చేయటంలో అవరోధము ఏర్పడటంవల్ల జరుగుతుంది దీనికి గుర్తించ తగ్గ లక్షణము స్పృహ కోల్పోవటము రెండవది శ్వాస క్రియ మధ్య విరామము ఏర్పడటము అందువల్ల ఆక్సిజన్ శరీరానికి సక్రమముగా అందదు దీనివల్ల మెదడు
దెబ్బ తినటము ఐదు నిముషాలలో జరుగుతుంది వెంటనే వైద్య సహాయము అందకపోతే బ్రతికే అవకాశాలు తక్కువ. ఈ కార్డియాక్ అరెస్ట్ వెంట్రిక్యులార్ ఫైబ్రిలేషన్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి రోగికి ఆటోమేటెడ్ ఎక్స్టెర్నల్ డిఫైబ్రిలేటర్ (AED) ద్వారా కరెంట్ షాక్ ఇస్తారు ఫలితముగా ఈ విద్యుత్ గుండేయొక్క సైనస్ తన ఎలక్ట్రికల్ ఇంపల్సస్ ను పునరుద్ధరిస్తుంది వైద్య పరిభాషలో హార్ట్ ఎటాక్ ను మయోకార్డియల్ ఇన్ఫర్ యాక్షన్ అంటారు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమను లలో ఏర్పడే అవరోధము గుండెకు వెళ్లే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇదే గనుక జరిగితే గుండె కండరాలు శాశ్వతముగా దెబ్బ తింటాయి. ధమానులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవటమే దీనికి కారణము. దీనికి ముందు ప్రమాదమును సూచించే హెచ్చరికలుఅంటే లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అవి ఛాతీ బిగుసుకున్నట్లు అవటం,ఎడమ చేయి తీవ్రమైన నొప్పి లేదా జాలుగా ఉండటము వీపు క్రింద భాగము మెడ లేదా దవడ లో నొప్పి తిన్న ఆహారము సరిగా జీర్ణము కాక పోవటము ,ఛాతీ మీద పెద్ద బండరాయి ఉంచినట్లు అనుభూతి వంటి లక్షణాలు కనిపిస్తాయి సుగుణము ఏమిటి అంటే హార్ట్ ఎటాక్ రోగి స్పృహ లోనే ఉంటాడు చాలా మంది హార్ట్ ఎటాక్ రోగులు కోలుకొని సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అశ్రద్ధ చేస్తే హార్ట్ ఎటాక్ కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తుంది హార్ట్ ఎటాక్ కు చికిత్స యాంజియోప్లాస్టీ దీనివలన మూసుకున్న రక్తనాళాలు మెడికల్ బెలూన్ ద్వారా తెరిపిస్తారు తరువాత ఒక స్టెంట్ ను ఆ ధమనులలో అమరుస్తారు రక్త నాళాల లో ఏర్పడ్డ అడ్డంకులను తొలగించటానికి త్రామ్బోలైటిక్స్ లేదా నైట్రోగ్లిజరిన్ కలిగిన మందులను ఛాతీ నొప్పి తగ్గటానికి వాడతారు కాబట్టి ఈ సమాచారాన్ని గుర్తుంచుకొని గుండెకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతే కాకుండా ధూమపానము క్రొవ్వు అధికముగా ఆహారానికి దూరముగా ఉండటము మానసిక ఆందోళన ఒత్తిడి వంటి
వాటికి దూరముగా ఉంటూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ,