సురవరం ప్రతాప రెడ్డిగారి కధ - అంబడిపూడి శ్యామసుందర రావు

suravaram pratapareddy   sanghamu  - pantulu story review
సురవరం ప్రతాప రెడ్డిగారు పూర్వ(నైజాం నాటి)తెలంగాణాకు చెందిన ప్రముఖ  సాంఘిక చరిత్రకారుడు ఈయన మే 28,1896 లో ,మహబూబ్ నగర్ జిల్లా లోని పూర్వ గద్వాల్ సంస్థానంలోని బోరవెల్లి గ్రామములో జన్మించారు. ఈయన ప్రాధమిక విద్యాభ్యాసము మేనమామ ఇంట్లో కర్నూల్ జిల్లాలో జరిగింది. ఈయన వెల్లల శంకరశాస్త్రి గారి వద్ద సంస్కృతము వ్యాకరణము చదువుకున్నారు. ఎఫ్ .ఏ ను
నిజాము కాలేజీలో పూర్తిచేసి బి.ఏ, బి. ఎల్ డిగ్రీలను మద్రాస్ ప్రసిడెన్సీ  కాలేజీలో పూర్తిచేశారు.  ఈయన తెలుగు ప్రజల సాంఘిక చరిత్ర ను ,"ఆంధ్రుల సాంఘిక చరిత్ర" పేరుతొ గ్రంధాన్ని రచించారు. ఆ గ్రంధము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ను గెలుచుకుంది. తరువాతిరోజుల్లో ఆ గ్రంధాన్ని సర్వీస్ కమిషన్ పరీక్షలకు టెక్స్ట్ బుక్ గా నిర్దేశించారు. ఈయన తెలుగులోనే కాకుండా ఉర్దూ,సంస్కృతము ఇంగ్లిష్ భాషలలో పాండిత్యము కలిగి ఉన్నారు. అయన రచించిన విమర్శనాత్మక వ్యాసాలు నవలలు కధలు గేయాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందినాయి ఆయన  గోల్కొండ కవులు అనే తన గ్రంధములో  విశేషమైన పరిశోధన చేసి 354 తెలంగాణాకు సంబంధించిన కవులు రచయితల వివరాలను తెలియజేసారు.   అయన  రచించిన పుస్తకాలలో నైజం పాలన,మొగలాయి కధలు,సంఘోద్దరణ ,హిందువుల పండుగలు
మొదలైనవి.  అయన తెలంగాణలోని  డ్డి,వెలమ కులాల గురించి పరిశోధన చేసి వారి పుట్టు పూర్వోత్తరాలను గ్రంథస్థము చేశారు. అయన ఆరోజుల్లోని  ప్రముఖ  గోల్కొండ పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆగస్టు 25,1953లో కీర్తిశేషులైనారు.

అయన వ్రాసిన కధలు నవలలు ఆనాటి సామాజిక పరిస్తుతులను నేటి పాఠకులకు కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తాయి. ప్రస్తుతము మనము చెప్పుకోబోతున్న కధ స్వాతంత్రానికి పూర్వము నైజాము పాలనలో ప్రజలు పడే కష్టాలను వాటిని పరిష్కారించు కోవటంలో ఒక నాయకుడు,"పంతులు"అంటే ట్రేడ్ యూనియన్ నాయకుడు ఏవిధముగా సహాయ పడ్డాడో వివరిస్తోంది. అందుకే రచయితా ఈ కధకు సంఘము-పంతులు  అని పేరు పెట్టారు. ఈ కధలో వాడిన కొన్ని పదాలు ముఖ్యముగా ఆ నాటి కులాల  గురించి ప్రస్తుతానికి కొంత ఎబ్బెట్టుగా ఉండవచ్చు కానీ ఆనాటి పరిస్తుతులకు దర్పణముగా ఈ కథ ఉంటుంది పాఠకులు ఈవిషయాన్ని గమనించాలి.

నిజాం ఇలాకాలో, కృష్ణా తీరములోని .పల్నాటి సరిహద్దు (అంటే నేటి నల్గొండ జిల్లా )లోని గ్రామము రామసాగరం ఆగ్రామములోని 500ఇళ్లలో 30 కోమట్లవి,80 కాపు వారివి,100 మాదిగ వారివి మిగిలినవి ఇతరజాతులవి ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న సర్కారీ నాకా (పోలీస్ స్టేషన్ ) లో 12 మంది జవానులు వారికి  ర్రాలు,ఒక అమీన్ ,ఒక జమేదారు అమీనుకు రెండు పెద్ద గుర్రాలు, ఇల్లు స్టేషన్ ప్రక్కనే . వుర్లోని జవానులు అంటే పోలీసులు ఏ నాడు ఏ వస్తువైనా డబ్బులు ఇచ్చి కొని ఎరుగరు సప్లై కి ఊళ్లోని కోమట్లు, వెట్టి చాకిరికి మాదిగలు 30 మంది కోమట్లలో ఒకడే దుకాణదారుడు మిగిలినవాళ్లు వ్యవసాయము చేసుకొని బ్రతికేవారు వాళ్ళందరూ వారి ఆదాయము నుండి పోలీసులు కోరినదల్లా  సప్లై చేయవలసిందే కృష్ణా నది ఆవలితీరము బ్రిటిష్ పాలనలో ఉంది అక్కడి జనము ఇటువంటి భాదలు
లేకుండా సుఖముగా ఉన్నారు. కానీ రామసాగరం వారు ఇల్లు వాకిళ్లు పెద్దలు సంపాదించిన ఆస్తులు వదలుకొని అటు వెళ్లలేరు పరిస్థితులు ఇలా ఉండగా ఒకరోజు 70ఏళ్ల ముసలి మాదిగది చచ్చిందన్న వార్త  ఊళ్ళో గుప్పుమంది. ముసలి  దాని చావుకు కారణము అమీన్ సాహెబు పెండ్లాము ముసలిదానిని వంటకు రేల కట్టెలమోపు తెమ్మంటే దొరకకపోతే ఆ ముసలిది అడవి అంతా తిరిగి తంగేడు కట్టెల మోపు తెచ్చిందన్న కోపముతో బేగము సాహెబా గారు డొక్కలో నాలుగు తన్నులు తన్నింది ఆ తన్నులకి ముసలిది చచ్చింది. "నికాలో ఈ పీనుగను" అని ఆవిడ  ఆర్డర్ మేరకు నలుగురు జవాన్లు ఈడ్చి మాదిగ గేర్లో పారేసారు. ఇంక  అమీన్ సాహెబ్ గారు తానూ అడిగిన బాదము పిస్తాజీడిపప్పులు ఇవ్వలేదనిఒక కోమటిని జవాన్ తో చెప్పుదెబ్బలు కొట్టిస్తాడు. అటువంటి పరిస్థితులలో ఊళ్ళో కోమట్లు అందరు
మాట్లాడుకొని, కృష్ణ అవతలి అంగ్రేజీ ఇలాకా నుండి ఒక కోమటిని తెచ్చి సాలుకు 1200 రూపాయలు చొప్పున ఒక దుకాణము గుత్తా  కిచ్చి, పోలీసువారు అడిగినవి ఫ్రీగా ఇవ్వలని చెప్పారు ఆకోమటి రెండు నెలలు వ్యాపారము సాగించి లెక్కలు చూసుకొని ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి పారిపోయాడు. ఆతరువాత ఒక మార్వాడిని 1000 కు మాట్లాడుకొని తెచ్చి ప్రస్తుతానికి కాలము గడుపుతున్నారు.

ఒకనాడు రామసాగరానికి పక్కవూరి నుండి  ఒక పెద్ద మనిషి బండి  కట్టుకొని  వస్తాడు ఆ పెద్దమనిషి వూరు బయట ఎదురైనా  మాదిగ అతన్నిఎంత పొద్దు ఎంత అయి ఉండవచ్చు అని అడుగుతాడు.  దానికి ఆ మాదిగ వాడు మా వూళ్ళో కోళ్లు అన్ని పోలీసుల తిండికే అయిపోయినాయి కాబట్టి కుక్కల అరుపులను బట్టి పొద్దు తెలుసుకుంటామని జెప్పి పటేలు పుల్లా రెడ్డి ఇంటికి దారిపుతాడు.మరునాడు
ఉదయానికల్లా పట్నము నుంచి వచ్చినది సంఘము పంతులని  ఊరంతా తెలిసిపోయింది. అయన ఖద్దరు వేసి వకీలు లాగ రుమాలు కడతాడు ,ఆయనకు పట్నములో గొప్ప వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని వాళ్ళ  పాలిట దేవుడు వచ్చాడని వాళ్ళ సమస్యలు తీరుస్తాడని ఎన్నడూ లేని ధైర్యము ఉత్సహము అక్కడి ప్రజలలో కలిగింది. పటేలు ఇంట్లో జరిగిన మీటింగుకు హాజరైన కోమట్లకు సంఘము పంతులు గారు ,"వర్తక స్వాతంత్రము ",అనే పుస్తకాలు ఇచ్చాడు "మీరెందుకు భయపడాలి ప్రభుత్వమూ పోలీసులను పెట్టింది మిమ్మల్ని రక్షించటానికి భక్షించటానికి కాదు "అనిఅందరికి ధైర్యము చెప్పాడు వర్తక సంఘాన్ని స్థాపించాడు కోమట్లు అందరు తలా 500రూపాయలు కట్టి సభ్యులుగా జేరారు. మర్నాడు మార్వాడి పోలీసు జవాన్ వస్తే ,"మా సంఘము రూల్స్ ప్రకారము రూపాయికి అయిదు షేర్ల బియ్యము", అని చెపితే విన్న జవాన్ కు కోపమువచ్చి ఖబర్దార్ అని హెచ్చరించినా," ఖబర్దార్, గిబర్దార్ జాన్తానై మా సంఘము రూల్స్ ఇంతే  సంఘము పంతులు వచ్చాడు",అని మార్వాడీ అంటే అదివిన్న పోలీసు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు . 

మర్నాడు ఉదయాన్నే సంఘము పంతులు బహిర్భుమికి పోయి వస్తుంటే ఒక మాల స్త్రీ దూరము నుండే దండము పెట్టి గొడుగోడును యేడ్చింది . కారణము ఏమిటని అడిగితె,"అమీన్ సాహెబ్ గారి పెండ్లాము  పాయిఖానా సరిగా సాఫు చేయలేదని మా అక్క చెంప మీద వాతపెట్టింది, మొన్న జమేదారు మా ఆయనను కాళ్ళు సరిగా ఒత్తలేదని డొక్కలో తన్నాడు మాఆయన అప్పటినుంచి మంచము పట్టాడు ఇట్లా అయితే మేము ఈవూళ్ళో ఎట్లా బ్రతికేది?"అని ఏడుస్తూ చెప్పింది. విన్న సంఘము పంతులు ,"ఈ రోజు సాయంత్రము మీపల్లెలోని జనాలను వూరు ముందు ఉండే రావి చెట్టు దగ్గరకు రండి నేను వచ్చి అన్నీచూస్తాను,"అని ఆభయము ఇచ్చిపంపాడు.
సాయంత్రానికి సుమారు అయిదారు వందలమంది పోగైనారు వారికి పంతులు వెట్టిచాకిరి  దానికి సంబంధించిన ఫర్మానాలు  వినిపించాడు కూలి ఇవ్వనిదే ఏ రకమైన చాకిరి ఎవరికీ చేయ నవసరము లేదు అని వివరిస్తుండగా అమీనుగుర్రమెక్కి ఎనిమిది మంది జవాన్లను వెంటబెట్టుకొని ఠీకు టాకున వచ్చికూర్చుని ,"పంతులు గస్తీ నిషాన్ 53(నిజాం రాష్ట్ర  వాగ్బంధన శాసనము) తెలుసునా?"అని ప్రశ్నించాడు.

"ఆ తెలుసు అది సియసి జల్సాల (రాజకీయ సభల )కొరకేర్పడినది "అని పంతులు సమాధానమిచ్చాడు. "మరినీవు ఇప్పుడు సర్కారును ధూషించుట,ఫర్మానాలను వ్యతిరేకముగా నడచుకొనుట చేస్తున్నావుకదా ?అని పంతులును అమీను బెదిరించాడు. "నేను కాదు  నీవు ఆ పనిచేస్తున్నావు , వెట్టికూడదని ఉన్నది నీవు ఎన్నడైనా కూలి యిచ్చి పనిచేయించుకున్నావా? నీ బేగము సాహెబాకు ముసలివాండ్లను తన్ని చంపుటకు పడుచువాండ్ల చెంపలు వాతలు పెట్టుటకు, పాయిఖానాలు ఊడ్చుటకు ఏ ఫర్మానాలో నీకు హక్కు ఇచ్చారు" అని
నిలదీసేటప్పటికీ ,"నీకు తగిన శాస్తి చేస్తాను చూడు ", అని రోషముగా అని వెళ్ళిపోయాడు. వారము గడిచింది. వెట్టిచాకిరికి  మనుషులు లేరు కోళ్లు అస్సలే లేవు  గుర్రాలకు  గడ్దిచిక్కదు బేగం సాహెబా పాయిఖానా శుభ్రము చేసే వారు లేరు ,కానీ గ్రామస్తులు కల్లు త్రాగమని ఒట్టు పెట్టుకున్నారు కాబట్టి పోలీసులకు కల్లు మాత్రము సమృద్ధిగా దొరుకుతుంది. ఒకరోజు జవానులందరు అమీను అధ్యక్షతన మీటింగు పెట్టుకొని సంఘము పంతులును కచేరీకి పిలిపించారు . సంఘము పంతులు కచేరీకి బయలు దేరిన తరువాత 30 మంది కోమటి యువకులు ,40 మంది మాదిగలు లాఠీలతోబయలుదేరి నాకా వెనుక పంతులుకు, జవాన్లకు తెలియకుండా కూర్చున్నారు . కల్లు త్రాగి కైపెక్కిన జవాన్లు వారికి చేతనైన భాషలో (బూతులతో ) పంతులును తిట్టటము మొదలుపెట్టి కొట్టటానికి  పై పైకి  రావటము మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు లోపలికి  ప్రవేశించి అమీను ను జవాన్లను చితక బాదారు ."పంతులు మాకు  బుద్ది వచ్చింది ఇక మీ జోలికి రాము మమ్మల్ని వదిలేయమని చెప్పు "  అని జవాన్లు బ్రతిమాలిన ప్రజా సైన్యము అందరికి దేహశుద్ది చేశారు పోలీసులు వాళ్లకు జరిగిన అవమానము చెప్పుకోలేదు గాని  సంఘము పంతులు పోటీ ప్రభుత్వము నడుపుతూ అరాచకము సృష్టిస్తున్నాడని  అదనపు బలగాలను పంపమని పై అధికారులకు విన్నవించుకున్నారు. మొహతమీమ్ (పై ఆదికారి) విచారణకు వచ్చి రైతులను పిలిపించాడు ఇంకా అక్కడి వచ్చిన ప్రజలు వాళ్ళు పడ్డ యిబ్బందులను పూసగుచ్చినట్టుగావందల కొద్దీ షికాయతులను(ఫిర్యాదులను )   ప్పారు మోహతమీమ్ అన్ని విచారించి యదార్ధాన్ని గుర్తించి అమీన్ ను బర్తరఫ్ ,జమేదార్ను  క్రింది ఉద్యోగానికి మార్చి,జవానులందరిని ఆరు నెలలపాటు

సస్పెండ్ చేసి వారిలో పోలీస్ స్టేషన్ అనవసరము అని ఎత్తేయమని హుకుమ్ జారీచేసి వెళ్ళిపోయాడు ఆ ఉరి ప్రజల ఆనందానికి అంతేలేదు ఇంకా వారము రోజులకు వచ్చే హోలీ పండుగను ఆ రోజే జరుపుకున్నారు ఆ విధముగా సంఘము పంతులు ఉరి ప్రజలను సంఘటిత పరచి అన్యాయాన్ని ఎదుర్కొనేటట్లు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపాడు, మంచి సందేశము నిచ్చిన కధ  ఇది .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి