ఇది డిజిటల్ యుగం. ఇది స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్ చేతిలో లేనివారు దాదాపుగా కనిపించడంలేదు. పల్లెటూళ్ళలోనూ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. ఇండియాని డిజిటల్ చేసే క్రమంలో, స్మార్ట్ ఫోన్లు అత్యంత కీలక భూమిక పోషించనున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే అన్ని సేవల్నీ అందించాలని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ భావిస్తున్న సంగతి తెలుసు కదా. నగదు వినియోగం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడంటే నగదు సమస్యలు పెరిగాయి, గతంలో ఆ సమస్యలు లేకపోయినా చాలామంది కరెన్సీ వినియోగానికి దూరంగా ఉన్నారు. ఇ-కరెన్సీ, మొబైల్ కరెన్సీనే ఆశ్రయించారు. వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోందంతే. తగినంత భద్రతా ఫీచర్లు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో కలిగి ఉంటే క్యాష్‌లెస్ లావాదేవీలు అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
మరి ఈ మొబైల్ ఫోన్‌లో ఇలాంటి సేవలు అందుకోవాలంటే, ఆ మొబైల్ ఫోన్ అంత వేగంగా స్పందిస్తుందా? ఈ సందేహం చాలామందిలో ఉంటుంది. అన్నిటికీ మొబైల్ ఫోన్ల మీదనే ఆధారపడుతున్నప్పుడు ఈ సందేహం కలగడం సహజమే. మార్కెట్‌లో చాలా యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, 'సూపర్ టచ్' అనే యాండ్రాయిడ్ అప్లికేషన్ అన్నిటికన్నా సమర్థవంతంగా పనిచేస్తోంది. దీన్ని ఓ సారి మొబైల్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకుని, ఇనీషియలైజేషన్ చేసుకుంటే ఆ తర్వాత మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ గుర్రంలా పరిగెడుతుంది. గేమింగ్ అయినా, మొబైల్ బ్యాంకింగ్ అయినా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అయినా మరేదైనాసరే మీ మొబైల్ వేగం తగ్గడం అనేదే జరగదని నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ రోజు రోజుకీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తగ్గట్టుగానే యాప్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. యాప్స్ పెరిగిపోయేసరికి మొబైల్ ఫోన్ నెమ్మదించడం మామూలే. అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొనేవారెవరైనాసరే, స్మార్ట్‌గా తమ మొబైల్ ఫోన్లకు 'సూపర్ టచ్' ఇచ్చేస్తే సరిపోతుంది.
ఒకప్పుడు ఫోన్ అంటే, అదో పెద్ద తతంగం. కనెక్టివిటీ కోసమే నానా తంటాలూ పడాల్సి వచ్చేది. ఇదంతా ల్యాండ్ లైన్ వ్యవహారం. మొబైల్ ఫోన్ల ఎంట్రీ, మొత్తం టెలికామ్ వ్యవస్థలోనే అతి పెద్ద మార్పు. స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రారంభమయ్యాక ప్రపంచం తీరు మారిపోయింది. ప్రపంచం చాలా చాలా చిన్నదైపోయింది. క్షణాల్లో ప్రపంచమంతా మీ అరచేతిలో స్మార్ట్‌గా ఇమిడిపోతోంది. అంతలా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయినప్పుడు, పలు కారణాలతో అది 'స్లో' అవడమంటే, కాలం గిర్రున వెనక్కి తిరిగిపోయిన భావన కలుగుతుంది. అలాంటి భావన కలగనీయకుండా ఎలాంటి స్మార్ట్ ఫోన్ అయినాసరే, స్లో అయ్యిందని మీరు భావిస్తే వెంటనే దానికి 'సూపర్ టచ్' ఇచ్చేయొచ్చు. ఒక్కసారి సూపర్ టచ్ ఇచ్చేస్తే, మీ మొబైల్ ఫోన్ మీరు ఊహించనంత వేగం సంతరించుకుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండా సూపర్ టచ్ ఇచ్చేయండి. మీక్కావాల్సిన యాప్ ఫీచర్స్‌ని నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా వినియోగించేసుకోండి. అది బ్యాంకింగ్ కార్యకలాపాలకోసమైనా, వినోదం కోసమైనా, ఇంక దేనికోసమైనా. ఈ ఐడియా చాలా స్మార్ట్ అండ్ సూపర్ గురూ!