లైట్స్ ఆన్....రోల్ కేమెరా....మహాతల్లి. - ..

mahatalli

ఒక అక్క...ఒక చెల్లి...ఒక తల్లి.. ఈ మహాతల్లి... అందరు సినిమాభిమానుల్లాగే మేకప్ వేసుకుని లైట్స్ ఆన్....రోల్ కేమెరా....యాక్షన్ అనే మాటలు వినాలనే హైద్రాబాద్ కి వచ్చిన దాశెట్టి జాహ్నవి కాస్తా యూట్యూబ్ మహాతల్లిగా అవతరించి, అందర్నీ ఆకట్టుకొని, లక్షలవ్యూస్ కొట్టేసి దూసుకుపోతున్న విశేషాలు చూద్దామా..... నటకౌశలాన్ని ప్రదర్శించడానికైనా, సాంకేతికంగా సత్తా చాటుకోవడానికైనా యూత్ చేతిలో ఉన్న పెద్ద ఆయుధం, అవకాశం.. షార్ట్ ఫిలింస్.....సినిమాల్లో అవకాశాలకోసం డెమోస్ గా కొంతమంది చేస్తుంటే, సినిమాల్లో అవకాశాలు లేక తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి కొంతమంది చేస్తున్నారు....

ఏదేమైనా నెటిజన్లకు పైసా ఖర్చులేకుండా కావలసినంత వినోదాన్ని ఇచ్చేవి ఇవే....అప్పుడొకటీ ఇప్పుడొకటె చేసే షార్ట్ ఫిలింస్ ఒక టైపు అయితే, ఒకే క్యారెక్టర్ తో రూపొందించే సిరీస్ ఒకటైప్... అలాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఈ మహాతల్లి... ఒకటి విడుదలయీ అవగానే మరో కొత్త ఎపిసోడ్ కోసం ఎదురు చూసేంతగా ఆకట్టుకున్న మహాతల్లి వెబ్ సిరీస్ చేస్తొన్న దాశెట్టి జాహ్నవి ముందు సినిమాల్లో నటించాలనే హైద్రాబాద్ కి వచ్చిందట....కానీ పరిచయాలు లేక ప్రయత్నాలు సరిగా చేయలేకపోయిందట.... షార్ట్ ఫిలింస్ లో నటించడానికి కూడా ముందు భయమేసిందట... 'బ్రేకప్ తర్వాత' అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఆ షార్ట్ ఫిలిం జాహ్నవి కి బ్రేకప్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు... ఆ తర్వాత 'టమడ మీడియా' వారు 'సూపర్ మాం' లాంటి వెబ్ సిరీస్ తెలుగులో చేయాలని అనుకోవడంతో వచ్చిన ఆలోచన మహతల్లి....

డిఫరెంట్ లొకేషన్లు....కొత్త కొత్త కాస్ట్యూంస్, ఇరగదీసేంత యాక్టింగ్ పెర్ఫార్మెన్సు ఇవేవీ లేని మహాతల్లిలో మిలియన్ హిట్స్ సాధించగలిగేంత గొప్పదనం ఏమంది? అంటే, మనకు తారసపడే పాత్రలు, మనకెదురయ్యే అనుభవాలు, మనను పలకరించే పాత్రలే ఈ మహాతల్లికి ఇన్స్ పిరేషన్ అంటోంది జాహ్నవి...అందుకే ఈ సిరీస్ కి పెద్దగా స్క్రిప్ట్ వర్క్ కూడా ఉండదట...అప్పటికప్పుడు అనుకుని చేసేవే, అశువుగా చేప్పే డైలాగులే.... అందుకే సహజంగా ఉంటాయి ఈ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ కూడా... సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకోవడం తేలికైపోయిందని అంటోంది జాహ్నవి.. తనకు ఇన్స్పిరేషన్ అయిన కలర్స్ స్వాతి ఫోన్ చేసి బాగా చేస్తున్నావని అభినందించడం మర్చిపోలేనని అంటోంది జాహ్నవి.... ఇప్పటిదాకా నలభై ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న మహాతల్లి ఇంకా మున్ముందు ఏమేమి చేయనుందో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు... మరిన్ని సరికొత్త ప్రయోగాలతో మహాతల్లి మరింతగా ఆకట్టుకోవాలని ఆశిద్దామా.....

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి