కథ : సంక్రాంతి క్రాంతి
రచయిత్రి : నండూరి సుందరి నాగమణి
సమీక్ష : కర్రా నాగలక్ష్మి
గోతెలుగు 145వ సంచిక!
భోగి, మకర సంక్రాంతి, కనుమ వైశిష్యత చాంద్రమానం పాటించే తెలుగు వారు సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో ఇది ఒకటి. తెలుగు వారి ఇతర పండుగల వలె ఇది తిధి ప్రధానమైన పండుగ కాదు. ఈ పండుగ దక్షిణాయానికి చివరిరోజు. ధనుర్మాసానికి కూడ. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈ భోగి పండుగ రోజుకు ఇంటికి వస్తాయి. వారికి వ్యవసాయం పనుల రద్దీ తగ్గి సుఖం గా కాలక్షేపం చేయడానికి కావాల్సినంత
సంక్రాంతి వస్తోందికదా ? సంక్రాంతి పండగ యెలా జరుపుకోవాలో మరచిపోయేరా ? అయితే మన గో తెలుగు వారపత్రిక 145 వ సంచికలో వచ్చిన నండూరి సుందరి నాగమణి గారు రాసిన ' సంక్రాంతి కాంతి ' కథ చదివితే సరి .
అతిశయోక్తి గా అనిపిస్తోందా ? కాదండి బాబూ , పోనీ కాస్త కథ గురించి చెప్తాను , అప్పుడు మీరే నమ్ముతారు యేం .
రచయిత్రి గాలి పటాల దగ్గర మొదలు పెట్టి యింటి ముందు దిద్దబోయే రంగవల్లులు , భోగి పళ్లు , పేరంటం , బొమ్మల కొలువు , పండగకు చేసుకున్న పిండి వంటలు చుట్టూ మనని తిప్పి, మన సాంప్రదాయంలో యిరుగు పొరుగు ఒకరి ఆనందంలో మరొకరు పాలు పంచుకోవాలనే విషయాన్ని పాత్రల ద్వారా చెప్పిస్తూ , నేటి తల్లి తండ్రులు మరిచి పోయిన మరో సున్నితమైన విషయం అదే పిల్లలు ఆటలలో వచ్చే తగువులను , తరవాత ఆ పిల్లల ఫీలింగ్సు , సమస్యను పరిష్కరించిన విధానం చాలా బాగుంది .
అలా అలా నిర్మలమైన , నిశ్చలమైన నదిలో సాగే పడవ ప్రయాణంలా వుంటుంది కథా గమనం .
ఈ కథ చదివిన తరువాత ప్రతీ సంవత్సరం సంక్రాంతి రాగానే మీకు తెలియకుండానే మీ మనస్సులో ఈ కథ మెదులుతుంది .
ఈ క్రింద లింకులో ఈ కథ చదివెయ్యండి మరి http://www.gotelugu.com/issue145/3722/telugu-stories/sankranti-kanti/