"సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్,
సః భూమిం విశ్వతో వృత్వా అత్య తిష్టద్ద శాంగుళం "
దివ్యపురుషునకు వేలాదిశిరస్సులు, వేలాది నయనాలు,వేలాది పాదాలు , ఈవిశ్వమంతా ఆవరించి ఉండటమే కాక ఇంకా పదంగుళాలు పైకి ఉన్నాడు - అంటుంది వేదం.
' దివ్ ' అనే సంస్కృత పదం నుండీ 'దేవుడు ' అనే పదం వచ్చింది. 'దివ్ 'అంటే ఆడుట అని అర్ధం. భక్తులతో ఆడుకోడం, ఆనందించడం, ఏడిపించడం, నవ్వించడం, రక్షించడం, శిక్షించడం, బోధించడం, ప్రేమించడం, ఇవన్నీ అవతార లక్షణాలు. భగవంతుని ప్రతిచర్యకూ ఒక అంత రార్ధం, సందేశం ఉంటాయి.అహంకారాన్ని తొలగించి, ఆత్మ జ్యోతిని వెలిగించి, లోక కళ్యాణా నికి, సమాజాన్ని సంస్కరించనూ అవతార పురుషు లు, ఉద్భవిస్తుంటారు .
భగవంతుని గొప్పతనము వర్ణించను వేయినాల్కల ఆదిశేషునికే శక్తిచాలదు.
" ఈషు క్షయాత్ నివర్తంతే న అంత రిక్ష క్షయాదిషుః ,
మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్ " --
అంటే మనం ఒక బాణాన్ని పైకి వది లితే అది కొంత దూరం మాత్రమే పైకి వెళ్ళి క్రిందకు వస్తుంది.ఆపైన ఆకాశం లేదని కాదు . చాలా ఉంది, ఐతే బాణాన్ని వదలిన వారిశక్తి మేరకే ఆబాణం పైకి వెళ్ళి క్రిందకు వస్తు న్నది. అంటే భగవంతుని మహిమలు మన శక్తి కొలదీ మాత్రమే చెప్పగలం, అవి అంత మాత్ర మే అనికాదు. భగవంతుడు అన్ని అవతారాల్లో చేసిన లీలలు ,చూపిన శక్తులు వర్ణించను మనవల్ల కాదు. మనకున్న మేధ పరిమితమే కదా!
విశ్వమెల్లడ వ్యాప్తియై వెలయువాడు
భక్తజనులకు ప్రాపుయై బరగువాడు,
ముక్తినొసగి రక్షించెడి శక్తిమయుడు
పర్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు. --బాబా.
సాక్షాత్ అవతార పురుషులైన భగవాన్ శ్రీసత్యసాయి బాబావారు బాల్యం నుండే ఎన్నో మహి మలు చూపా రు. మానవసేవే మాధవసేవ అని ప్రబోధించారు . హెల్ప్ ఎవర్ - హర్ట్ నెవర్ -- లవ్ ఆల్ సర్వ్ ఆల్ -- అనేవి బాబావారి ముఖ్యమైన ప్రభోధాలు.' జంతూనాం నరజన్మ దుర్లభం ' - లభించిన మానవజన్మను సార్ధకం చేసుకోమని చెప్తారు బాబా వారు పదే పదే. ప్రేమ + సేవ - ఈరెండింటి పైనే బాబావారు తన బోధలు సాగించి, తన వద్దకు వచ్చేవారి కంతా , ఈ రెండింటిద్వారా మోక్షం పొంద గలరని బోధిస్తూ, ' జనసేవే జనా ర్ధన సేవ ' అని ప్రబోధిస్తూ ఆబాటవైపు జనాళిని నడుపుతూ , తన ఉపన్యాసాల్లో చిన్న కధ లు, సులభమైన పద్యాల ద్వారా ,పాటల రూపంలోనూ , హాస్యోక్తుల ద్వారానూ , వాక్య విభూతుల ద్వారా సులభశైలి లో చెప్తుంటారు. తాను ఆచరిస్తూ మానవతా విలువలను మానవ జాతి కి ప్రబోధించారు. తాను స్వయంగా వైద్యసేవలు, విద్యాసేవలు, నీటి వసతి లేని ప్రాంతా లకు జలాన్ని అందించే 'సత్యసాయి సుజల ధార' అనేపేరుతో నీటిని అందించే సేవలే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలద్వారా మానవులకు బోధిస్తున్నారు. గ్రామ గ్రామాన సంచార వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ వైద్యం నిరుపేదకైనా ధనవంతునికైనా ఉచితమే.
సేవ వలన మనకు చేకూరు ఆనంద
మదియు శాంతినిచ్చు సుఖమునిచ్చు
శాంతికన్న మిన్న సౌఖ్యంబు లేదయా
ఉన్నమాట తెలుపుచున్నమాట
ఈ మానవ సేవ కోసమే బాబావారు తన భక్త బృందానికి ' సత్యసాయి సేవా సంస్థలను '- ఏర్ప ర్చు కోను అనుమతించారు . ఈసంస్థలద్వారా అనేకా నేక సేవలు సుమారుగా 185 దేశా ల్లో నిర్విరామం గా జరుగు తూనే ఉన్నాయి. అమేరికా కెనడా వంటి పాశ్చాత్యదేశాల్లో సైతం సేవాకార్యక్రమాలు బాబా సూచనల మేరకు అనాధలకూ, అవసరం ఉన్నవారికీ అందించడం జరుగుతూనే ఉంది. సత్యసాయి బాబావారు పాంచభౌతిక శరీరాన్ని వీడినా ఆయన పంచ భూతాల్లో తనశక్తిని నింపి తాను మొదలు పెట్టిన కార్యక్రమాలన్నీ చక్కగా కొనసాగేలా ఆశీ స్సులు అందిస్తూ, భక్త జనాళికి మార్గ దర్శకాలు ఇస్తూ తన ఉద్యమాన్ని కొనసాగిస్తూనే వున్నా రు. ఏదీ ఆగకపోగా అద్వితీయంగా కొనసాగడం వెనుక బాబావారి సంకల్ప బలం వెల్లడవు తున్నది. ఒక్క చిరునవ్వుతో వేవేల ఆర్తుల బాధలు పోగొట్టగల అత్యద్భుతమైన నవ్వు బాబా వారిది.
అందమైన నవ్వు అలసెటురని నవ్వు,
విసుగులేని నవ్వు విమలనవ్వు,
పెదవి దాటని నవ్వు, ప్రేమ చిందెడినవ్వు,
సరసమైన నవ్వు సాయినవ్వు.
బాబావారు విశ్వవ్యాప్తంగా నేటికీ తన భక్తులనేకాక బాధలో ఉన్నవా రందరికీ కలలో కనిపించి కష్టాలు తీరుస్తూనే ఉన్నారు.వారి మహత్యము నకు, దేశ కాల మానాలు లేనే లేవు.
కలత తీర్చునొకట కలలోన కంపించి
ధ్యానమందు తోచి దరికి చేర్చు,
మనసు నందు నిల్చి మంచికి నడిపించు
శాంతి సౌఖ్యదాయి సత్యసాయి..
--- సత్యసాయి పాదార్చిత. ఆదూరి హైమావతి