పోరాడితేనే హోదానా.. - సిరాశ్రీ

 

1. ప్రత్యేక హోదా అనేది ఎంతెలా ఉద్యమించినా రాదు. ఇదంతా పిచ్చితనం. ఒక్క ఏ.పీకి ఇస్తే చత్తీస్గడ్, జార్ఖండ్ ఇలా అన్ని కొత్త రాష్ట్రాల వాళ్లు అడుగుతారు. అన్నిటికీ ఇచ్చుకుంటూ టేక్సులు వద్దని కూర్చుంటే కేంద్రానికి ఆదాయం తగ్గుతుంది. పైగా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో మిగతా రాష్ట్రాల్లోని వ్యాపారవేత్తలు కూడా ఆ రాష్ట్రంలోనే పెట్టుబడులకి ఇష్టం చూపిస్తారు. దేశంలో ప్రతి పౌరుడికి ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారం చేసుకునే హక్కు ఉంది కనుక ఎవరూ కాదనలేరు.  ఫలితంగా ఆయా రాష్ట్రాలు నష్టపోతాయి. ప్రత్యేకహోదా అనే థియరీ ఒక రాష్ట్రానికి బాగున్నా ప్రాక్టికల్ గా దేశం మొత్తానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక హోదా ఇవ్వరుగాక ఇవ్వరు. పేకేజీ తెప్పించుంటే గొప్పే. 

 
2. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానంతో పవర్లోకి వచ్చిన ప్రభుత్వం అది ఇచ్చి తీరాల్సిందే. లక్ష కోట్లు ప్యాకేజీ ఇస్తామంటున్నారు, అది ప్రత్యేక హోదా కంటే గొప్పదని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రులు అంత తెలివి తక్కువ వాళ్లు కాదు. వాళ్లనుకునే గొప్పది మాకొద్దు. మేమనుకునే గొప్పదే మాకు కావాలి. ప్రత్యేక హోదాయే కావాలి. అదొచ్చే దాకా ఉద్యమించాలి. ఢిల్లీని ముట్టడించాలి. "చలో ఢిల్లీ" అని బయలుదేరి పోలీసులు ఏ రాష్ట్రంలో ఆపేస్తే అక్కడ గాంధీ మార్గంలో ఆందోళణ చెయ్యాలి. వ్యవస్థని స్థంభింపజేయాలి. అంత నష్టాన్ని భరించలేక కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందంతే. ఒకటి రెండు రాష్ట్రాలకి ప్రత్యేకహోదా ఇవ్వడం వల్ల టేక్సులు రాని కారణంగా వచ్చే నష్టం కన్నా, ఇలా నిత్యం ఉద్యమాలతో వ్యవస్థ స్థంభించడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ అనేది కేంద్రానికి అర్థమయ్యేలా చూపించాలి. ఇలా చేస్తే ఏ.పీ కి ప్రత్యేక హోదా తథ్యం. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్? .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి