కాకూలు - సాయిరాం ఆకుండి

గుండె చెరువులు

చెరువులు కబ్జాలయిపోతుంటే...
బోరులు భూమిని పీల్చేస్తుంటే...

మిగులు జలాలు లభించేది ఇంకెన్నాళ్ళు?
నీటి కష్టాలు తలుచుకుంటే ఆగవు కన్నీళ్లు!!


భౌతిక అధర్మాలు

కులాల కుమ్ములాటలు మత ఘర్షణలు...
వర్గ భేదాలు, ప్రాంతీయ తేడాలు, అసమానతలు!!

ఇవన్నీ ఉంటేనేగానీ నడవవు రాజకీయాలు...
అన్నీ తెలిసినా గానీ మానుకోము ఓట్ల అమ్మకాలు!!


 


ప్రాఫిట్ అండ్ లాస్ అక్కౌంట్

లంచం నిర్మూలించే సీన్ లేదు కనుక...
అదికూడా ఒక స్టాంపు డ్యూటీ అనుకో!

ఖర్చుల్లో కలిపి లేక్కేసేస్తే ఎంచక్కా..
నికరలాభం ఎంతో తెలుస్తుంది.. ఇది పక్కా!!

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు