నవ్వుల జల్లు - జయదేవ్

గజరాజు: నువ్ రోజూ పొద్దున్నా, సాయంత్రం అడివిలో రెండు చక్కర్లు కొడితే, నీ వొళ్ళు సన్నబడుతుంది!
గజరాణి : సింహాలు ఈల లేస్తాయి!.. నాకు సిగ్గు!!
గజరాజు: ఆ చుడిదార్లు తొడుక్కోకుండా, మామూలుగా తిరుగు అని ఎన్ని సార్లు చెప్పాను?
 


గంధర్వుడు: ఇంద్రలోకంలో కోడిపుంజు పరుగెడుతున్నదే?
కిన్నెరుడు : ఉష్! అది మారువేషంలో వున్న దేవేంద్రులు! ఏదో అవక తవక పనికి సిద్ధమవుతున్నారు!!

రావణాసురుడు: అంగదా! ఈ చోట మనిద్దరమే ఉన్నామనుకునేవ్! పదకొండు మందున్నాం! నేను పది మందితో సమానం జాగ్రత్తా!!

సుమతి: "రఘుపతి రాఘవ రాజారాం" పాట గాంధీ గారి పాట, ఔనా? అది తన పాట అంటోంది ఆ అమ్మాయి!!
సంగీతం మాస్టారు: ఏ అమ్మాయి? పేరు?
సుమతి: రేవతి!
సంగీతం మాస్టారు: కరక్టే! ఆ పాట రాగం పేరు రేవతి!!

మొదటి చిలక: ఈరోజు ఇక్కడ కొరికి పారేసిన పుల్లటి పళ్ళు ఎన్నున్నాయో చూడు?
రెండవ చిలక: ఇది శబరి ఆశ్రమం! రామలక్ష్మణులు ఇటు వైపు వచ్చారు... నువ్వు చూళ్ళేదా?

రాజు: మహా మంత్రీ! తక్షణం మన శత్రురాజుకి, సంధి చేసుకుంటామని సందేశం పంపించండి!!
మహా మంత్రి: ఏల ప్రభో?
రాజు: రోజూ నా కల్లోకొచ్చి, నిద్ర చెడగొడుతున్నాడు!!


రంభ: దేవేంద్రులు రహస్యాలోచన మందిరంలో వున్నారు!
తిలోత్తమ: భూలోకంలో ఘోరతపస్సులు చేసేవారి పట్టిక తయారు చేస్తున్నారా?
మేనక: అయితే మనకి పని తగిలిందన్నమాట!!


చిన్నదోమ: ఇతడు మద్యం సేవించి వున్నాడు.
పెద్దదోమ: అందుకే ఓ మూల పడివున్నాడు. మనం హాయిగా రక్తం జుర్రుకుంటున్నాం! లేక పోతే మనల్ని ఒక్క బాదు బాదుండేవాడుగా?


చెలికత్తె: యువరాణీ.. అశ్వాలు పట్టుతప్పాయి. రథాన్ని ఆపలేక పోతున్నాను!
యువరాణి: అయ్యో! ఇప్పుడెలా?
అశ్వం: భయపడకండీ యువరాణీ! పొరుగుదేశపు యువరాజు మనల్ని వెన్నంటి వస్తున్నాడు! సినిమాల్లో కాపాడినట్లు మిమ్మల్ని కాపాడ్తాడు లెండి


పెద్ద కోయిల: మామిడి చిగురు బదులు వేప చిగురు తిన్నావేం?
చిన్న కోయిల: ఏం?
పెద్ద కోయిల: నీ గొంతు జీరగా ఉంటేను!!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు