చిదంబర రహస్యం ! - ..

chidambara rahasyam

ఏమిట్రా విషయం...అంటే....

అదా...

ఓ " చిదంబర రహస్యం " అంటారు చాలా మంది.

ఇంతకి...ఆ చిదంబర రహస్యం...అంటే...ఏమిటో...  తెలుసుకోవాలనిపించి...వికీపీడియాను...ఆశ్రయించాను... దానికి తోడూ ఓ Fబ్ ఫ్రెండ్ సహకారం కూడా.. లభించింది... అందుకే..నాకు తెలిసిన సమాచారాన్ని...మీ ముందు..ఉంచుతున్నాను....

చిదంబర రహస్యం !

( ఆలయం ఒక అద్భుతం )

తమిళనాడులోని  చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ ,  అక్కడున్న నటరాజ విగ్రహం  ప్రపంచ ప్రసిద్ధమైనదని  మనలో చాలా మందికి తెలుసు.  చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు . ఈ విషయాన్ని తన గ్రంధం " తిరుమందిరం " లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు. ఇపుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం !

ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది

" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు . అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......! ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి . ఇది ఆశ్చర్యం కదూ !

చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి.

చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 క్ష్ 60క్ష్ 24 = 21600 )  ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది . దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి .

అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.

" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు . పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు . 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు . ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు .. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు .

మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

ఓమ్ నమశ్శివాయ 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి