కిర్లియన్ ఫొటోగ్రఫీ ద్వారా కాంతి పుంజాలను పరిశీలించి, విశ్లేషించడంలో నిపుణుడైన’ఫ్రాంక్ బారొవస్కీ ‘అనే ఒక శాస్త్రవేత్త బాబా కాంతిపుంజాన్ని ‘-ఆరా’- పరిశీలించి ఆశ్చర్య పడతాడు. –‘ అంతకు ముందు తాను పరిశీలించిన ఎవరి కాంతి పుంజాలూ బాబా కాంతి పుంజాలలా లేవనీ, బాబా సామాన్యమైన వ్యక్తి కాదనీ,దివ్య పురుషుడేననీ ,బాబా కాంతి పుంజం చాలా విశాలమై ప్రేమకు చిహ్నమైన నీలికాంతితో దిగంతాలకు వ్యాపి స్తున్నదనీ. ఇంతకు ముందెన్నడూ తాను అలాం టి కాంతిపుంజం చూడలేదని ,బంగారు, వెండి రంగు ఛాయ లు తన ఫొటోగ్రఫీ లో చూశాననీ ‘తన అభిప్రాయం వెలిబుచ్చాడు.
ఐస్లాండ్ కు చెందిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త' ఎర్లెండర్ హెరాల్ద్ సన్ ' బాబా మహిమలగురించి బాబావారి భక్తులనూ, బాబాను కల్సిన వ్యక్తులనూ ,ఇతరులను ఇంటర్వ్యూ చేసి అధ్యయనం చేసి తన పరిశోధనలను ప్రచురించాడు.అవన్నీ యదార్ధాలని అంగీకరించాడు. భక్తులనూ, పూర్వ భక్తులనూ ఇంటర్వ్యూ చేయడం వలన ఆశాస్త్రవేత్త అనేక అసాధారణ విషయాలు తెల్సుకున్నాడు. బాబా ఒకచోటనుండి మరో చోట ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం, రాతిని స్వీట్గా మార్చడం, భక్తులకు వరికి ఆరోగ్యాన్ని , రక్షణనూ కలిగించే వస్తువులు సృష్టించి ఇవ్వడం, వ్యాధి నివారణచేయడం, ఆహారాన్ని ఆసమయంలో అక్కడ ఉన్న భక్తులంద రికీ సరిపోయేలాగా అక్షయం చేయడం, అద్భుత విషయాలు.
చిత్రావతి ఒడ్డున కొండమీద వున్న చింతచెట్టు నుండీ బాబా వారు భక్తులు కోరిన పండ్లను కోసి ఇచ్చేవారు. దీన్ని కల్పవృక్సహ్మ్ అని అంతాపిలిచేవారు.[ఈ వ్యాసకర్త ఆవృక్షాన్ని దర్శించడం జరిగింది.] బాబా వారు ప్రకృతిని నియంత్రించేవారు. అతి వృష్టి సమయంలో పుట్టపర్తిలోని గ్రామస్తులు బాధపడుతూ బాబాను ప్రార్ధించి నపుడు వర్షాన్ని ఆపేసేవారు.భక్తులు ఏదేవతలనైతే ఇష్టపడతారో , వారి ఇల వేల్పు ఐన దేవతల రూపంలో ఆయా భక్తులకు దర్శన మిచ్చేవారు.
ఈ సంఘటనలలో కొన్ని తాను దర్శించి ఎర్లెండర్ హెరాల్ద్ సన్ - క్రైస్తవుడైనందున తాను చదివే బైబిల్ క్రొత్త నిబంధ నలో యేసు క్రీస్తు కనబరచిన మహిమలను పోలి ఉడటం వల్ల అతడికి విశ్వాసం కలిగింది. క్రీస్తువలెనే బాబా కూడా ఎందరికో వ్యాధులు నివారించడం అతదు చూశాడు.[ఈ వ్యాస రచయిత కూడా ఆ అనుభవం కలిగిన వ్యక్తే]
పరమహంస యోగానంద తాను తమ జీవిత కాలంలో దైవ సాక్షాత్కారం పొందిన అనేక అంది భారతీయ గురువులతో తమ కున్న సాంగత్యాలను తమ జీవిత కధ ఐన ' ఒకయోగి ఆత్మకధలో వివరించారు.[ఆటో బయాగ్రఫీ ఆఫ్ ఎ యోగి] దాన్లో శ్రీరాం పూర్ వాస్తవ్యులైన శ్రీ యుక్తేశ్వర్ గిరిగారి శిష్యులు. వారు కాశీ నివాసులైన ప్రసిధ్ధ యోగిపుంగవులు లాహిరీ మహాశయుల శిష్యులు. లాహిరీ మహాశయులు ప్రాచీనకాలం నుంచీ హిమాలయాల్లో [ పరమ హంస యోగా నందతమ ' ఒకయోగి ఆత్మకధలో 'పూర్తి చేసేసమయం వరకూ జీవించి ఉన్న మహావతార్ బాబాజీ గారి శిష్యు లు. యోగానంద గారు తమ’ ఒకయోగి ఆత్మకధలో ' రెండు శరీరాలున్న సాధువు, స్వామి ప్రణవానంద గారు , గాలిలో తేలే సాధువు శ్రీ నగేంద్ర నాధ్ భాదురీ,ఆనంద భరిత భక్తుడూ శ్రీమాస్టర్ మహాశాయులు , గంధ బాబా, ధైర్యసాలి టైగర్ స్వామి, నిద్రపోని సాధువు రామగోపాల్, నిరాహార యోగిని గిరిబాల మహిమలను వివరించారు. ఈ ఆత్మకధలో మనకు వారి గురువులు చేసిన మహిమల గురించీ తెలుస్తుంది .
సత్యసాయి బాబావారు కూడా అలాంటి మహామహులే కాక ప్రత్యక్ష పరమాత్మఅనిచెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సత్యసాయిబాబావారు మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధ నలు అందరికీ అర్ధమయ్యే లాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుధ్ధ హృదయంతో జీవించాలనీ తమ ఉప న్యాసాల్లో బోధిస్తుంటారు.
సత్యసాయి బాబా వారి బోధనలు సర్వ మత సమైక్యతను ప్రభోధిస్తాయి.
తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండాలని, భారతీయ సంస్కృతిలో ప్రధాన మైన ' మాతృదేవో భవ,పితృదేవో భవ, ఆచార్య దేవో భవ,అతిధి దేవోభవ ‘అనే అంశాలను నొక్కి చెప్తుంటాయి.మాతృమూర్తులే సమాజాన్ని తీర్చి దిద్దు తారని, స్త్రీలను గౌరవించడం మన కర్తవ్యమని బోధిస్తారు బాబావారు.
ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భజనల్లోపాల్గొనడం, బాబావారి బోధనలను పఠించడమేకాక ఆచరించడం, సమాజ సేవ చేయడం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు.నిరుపేదలకు అవసరమైన సహాయ్మ నిస్వార్ధంగా చేయడం వాఉచేసే ప్రధాన సమాజసేవగా ఉంటున్నది.బాబాపట్ల భక్తి, సమాజంపట్ల ప్రేమతో ప్రధానం గా ఈ సంస్థలు సేవలు చేస్తున్నాయి. తమ గురించిన పబ్లిసిటీని బాబా ఏనాడూప్రోత్సహించ లేదు. భజనల్లో అన్ని దేవతల, గురువుల భజనలు పాడుతుంటారు. సాయి బాబావరు బోధించిన పంచ మానవతా విలువలైన సత్య ,ధర్మ,శాంతి,ప్రేమ ,అహింసలను పాటిస్తూ సత్యసాయిసేవా సంస్థలు మానవసేవకు అంకితమై పని చేస్తున్నారు..
సాయిభక్తులు సత్సంగాలు చేసుకుంటారు. ఏదైనా ఒక గ్రంధాన్నికానీ, బాబావారి ప్రవచనాలనుకానీ పఠించి వారి వారి అనుభవాలనూ, ఆలోచనలనూ పరస్పరం పంచుకుని ,మరింత ఙ్ఞానం పొందుతుంటారు.
పరిపూర్ణ భక్తులకు స్వామి వారి మీద ఎంత విశ్వాసం కలిగి ఉంటారో అలాగే బాబావారు ఆభక్త రక్షణాబాధ్యతనూ అంతే ముఖ్యంగా భావిస్తారు.బాబా వారిని ఎల్లప్పుడూ కాపాడుతానని శపధం చేశారు.
విశ్వమెల్లడ వ్యాప్తియై వెలయునట్టి
భక్త జనులకు ప్రాపుడై బరగు నట్టి
భక్తి నొసగి రక్షించెడు శక్తి మయుడు
పర్తి వాసుడు మిమ్మేల ఎత్తుకొనడు.
సత్యసాయిబాబావారి బోధనలు ఈ క్రింది నాలుగు ముఖ్య అంశాలనూ ప్రభోధిస్తుంటాయి. ఉన్నది ఒకటే కులం - అది మానవకులం, ఉన్నది ఒక్కటే మతం -అదే ప్రేమమతం, ఉన్నది ఒక్కటే భాష -అదే హృదయం భాష,ఉన్నది ఒకే దేవుడు - అతడు సర్వాంతర్యామి.
సత్య సాయి సేవా సంస్థల అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా నేతీకీ జరుగుతుండటం విశేషం. పేద విద్యార్ధులకు సహకరించడం,వైద్య సేవలు, అనేక విధాలైన దాన కార్యక్రమాలు నేటికీ నిరాటంకం గా నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 186 దేశాల్లో 10,000 పైగా సత్యసాయి సేవా సంస్థలున్నాయి. [ఇప్పటివరకూ ఈ వ్యాస కర్తకు తెలిసిన సంఖ్య ఇది] ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ -శ్రీ సత్య సై ఇన్స్టిట్యట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ -శ్రీ సత్య సాయి యూనివర్సిటీ -భారతదేశం మొత్తంలో జాతీయ విద్యా ప్రమాణతులనా మండలి ద్వారా "ఏ++" రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ. ఇక్కడ ఒక సంగీత విద్యాలయం- మ్యూజిక్ కళాశాల అనేపేరుతోనూ, అనంతపురంలో ఒక మహిళా ఉన్నత కళాశాల , ఇంకా వివిధ ప్రదేశాలలో అనేక పాఠశాలలు, కలాశాలలూ ఉన్నాయి. అవన్నీకూడా విలువలతో కూడిన ఉన్నత విద్యను అందిస్తూ చక్కని పౌరులను దేశానికి అందిస్తున్నాయి.
వైద్య సేవలు -
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ - 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు చే 1991 నవంబరు 22న ప్రారంభింపబడింది. దీని నిర్మాణం బహుచిత్రమైనది. బాబావారు తమ సంల్పబలమో ,దైవబలమో కానీ ఒకేఒక సం.లో ఈ హస్పెటల్ నిర్మించడం, ప్రారంభించడం జరిగింది. బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్' కూదా అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. ఇది 2001 జనవరి 19న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయిచే ప్రాంభింపబడింది.ఈ వైద్యాలయాలన్నీ పేద, ధనిక అనే భేదం లేక కేవలం వ్యాధిగ్రస్తుల నే ఒకే ఒక భావనతో అందరికీ ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నాయి. ఏప్రిల్ 2004 నాటికి 2,50,000 మందికి బెంగళూరులో ఉచిత వైద్య చికిత్సలు అందుకున్నారు. ఆసంఖ్య ఇప్పటికి రెండింతలు పెరిగి ఉంటుంది. చాలా ఖరీదైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సల వంటివి పూర్తిగా ఉచితం. అలాగే బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యసేవల అందించింది , అందిస్తూనే ఉంది.
త్రాగు నీటి సేవలు-
సత్యసాయి బాబా వారు ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టులు ,అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనే క గ్రామాలకు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200 కోట్ల రూపాయలపైన ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు త్రాగునీటి సరఫరా చేస్తున్నది.ఇంకా మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడి మంచి నీరు అందించే సేవలో ఉన్నాయి.
మానవతా విలువల ఉన్నత విద్య.
ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య (ఎడ్యూకేర్ - ఎడ్యూకేషన్- ఇన్ హ్యూమన్ వాల్యూస్ - నేర్పే విద్యాలయాలను ఇప్పటికి 33 దేశాల్లో సత్యసాయి సేవాసంస్థలుపాఠశాలలుప్రారంభించాయి.