సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question
1. సంపాదించినదాని మీద ఆదాయ పన్ను కట్టి, మిగిలిన దానిని ఖర్చు పెట్టుకునే పనిలొ సేవాపన్ను కట్టి, కృషి కళ్యాణ్ సెస్ అని ఇంకోటేదో పన్ను కట్టి, వాల్యూ ఏడాడ్ ట్యాక్స్ అని మరోటి ఏదో కట్టి ...ఇలా కట్టి కట్టి కట్టి, సంపాదించిన 100లో నోటికి చేరేది 10 రూపాయలే అన్నట్టు ఉంది. ఈ కట్టినదంతా మధ్యలో అధికారుల దొంగలెక్కల్ని దాటి పేదల సంక్షేమానికి, కనీస సౌకర్యాల అభివృధ్ధికి వెళ్తోందా అంటే అనుమానమే. అమెరికాలాంటి దేశాల్లో పన్నుల మోత ఉన్నా అక్కడ ప్రభుత్వం కల్పించే సంక్షేమం, జీవన స్థాయి దానికి తగ్గట్టుగా ఉంటొంది. కనుక అక్కడ పన్నులు కట్టడం బాధ అనిపించదు. మన దేశంలో అలా లేదు. కనుక డబ్బుండి వ్యాపారాలు పెడదామనుకునేవారు హాయిగా విదేశాలకి పోతున్నారు. ఈ దేశం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. 

2. మనదేశంలో అందరూ పన్నులు సరిగ్గా కట్టట్లేదు. అందరూ కడితే దేశం ఖజానా నిండుగా ఉంటుంది. అలా నిండినప్పుడు ఎంత దొంగ లెక్కలేసినా చిలక్కొట్టుళ్ళే తప్ప అధికారులు పూర్తిగా కొల్లగొట్టలేరు. అందరూ నిక్కచ్చిగా పన్నులు కట్టినప్పుడు అధికారుల్ని, ప్రభుత్వాన్ని నిలదీయ గలిగే చొరవ కూడా పన్నుకట్టినవాళ్లకి వస్తుంది. పన్ను కట్టే వాళ్లు కట్టే సమయంలోనే దొంగ లెక్కలు చూపించి, ఆదాయం తక్కువ చూపించి పన్ను ఎగవేస్తున్నారు కనుక ఇప్పుడు ఎవరికీ నోరు లేవట్లేదు. అధికారులు కూడా జనంలోని ఆ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. జనంలో విప్లవం వచ్చి పన్నులు సరిగ్గా కడితే తప్ప పరిస్థితి మారదు. ఆ విప్లవం రావాలంటే దేశభక్తి పెల్లుబికాలి. దానికి సరైన నాయకులు కేవలం ప్రసంగాల ద్వారా కాకుండా, తీసుకుంటున్న నిర్ణయాలకి ఫలితాలు చూపిస్తూ జనాన్ని ఉత్తేజపరచాలి. అలా చేస్తే ఓ దశాబ్దానికి దేశం దృశ్యం మారుతుంది. 

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి