టెక్నాలజీ ఎవడబ్బసొత్తూ కాదు - ..

technology importance

సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని మన పాదాల ముందుకు తీసుకొచ్చేసింది. ట్రంక్‌ కాల్స్‌ సమస్యల గురించి ఇప్పుడు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడంతా వీడియో కాల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. సాంకేతిక విప్లవంలో ఇది ఓ చిన్న విషయం మాత్రమే. సాంకేతిక రంగంలో ప్రపంచం ఎవరూ ఊహించని వేగంతో పరుగులు పెడ్తోంది. సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది, కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకెళుతోంది. ఈ ప్రపంచంలో ఎవరూ తక్కువ కాదు. కొత్తగా ఆలోచించగలిగితే చాలు, రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోవచ్చు. టెక్నాలజీ మీద కొంచెం అవగాహన, ఇంకొంచెం ఆసక్తి ఉంటే చాలు చిన్న పిల్లలు సైతం సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న రోజులివి. మొబైల్‌ పోన్‌ ఓ సాంకేతిక విప్లవం అనుకుంటే, స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక పరిస్థితి ఇంకా మారిపోయింది. కుప్పలు తెప్పలుగా యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఈ యాప్స్‌ వేలల్లో, లక్షల్లో కాదు, కోట్ల సంఖ్యలో ఉంటున్నాయి. రోజురోజుకీ పెద్ద సంఖ్యలో ఈ యాప్స్‌ పుట్టుకురావడానికి కారణమేంటో తెలుసా? కొత్త ఆలోచనలే. ఫోన్‌ చేతిలో ఉంటే, అందులో ఓ యాప్‌ని చూస్తోన్న సమయంలోనే మనకి ఏదో కొత్త ఆలోచన వస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే చాలు కొత్త ఆవిష్కరణ సిద్ధమయినట్లే. 

ఈ రోజుల్లో సాంకేతిక సమాచారం కోసం ఎక్కడికీ పరుగులు పెట్టాల్సిన పనిలేదు. ఇంటర్నెట్‌ వుంటే చాలు, అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌ మొత్తం సమాచారాన్ని మన ముందుంచుతుంది. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయగలగడం కష్టం కాదు, అందిన సమాచారాన్ని విశ్లేషించి, మన ఆలోచనలకు రూపమివ్వగలగాలి. అలా చేస్తే ప్రతి ఒక్కరూ తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టి, కొత్త కొత్త ఆవిష్కరణల్ని చేయగలుగుతారు. స్కూల్‌కి వెళ్ళే వయసు రాకుండానే చిన్న పిల్లల చేతుల్లో మొబైల్‌ ఫోన్లు చూస్తున్నాం. ఆటపాటలతో మొదలవుతోంది మొబైల్‌ ఫోన్‌ వినియోగం చిన్న పిల్లలకి. తెలియకుండానే దాంతో వారు ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. అక్కడినుంచే, దాన్ని ఇంకో రకంగా వినియోగిస్తే? అన్న ఆలోచనలు పెరుగుతున్నాయి. కాస్త ఆసక్తి ఉన్నవారైతే, తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టేస్తున్నారు. టెక్నాలజీలో అత్యున్నత శిఖరాల్ని, అందులో దాగి ఉన్న లోతుల్నీ వెతికేస్తున్నారు. ఆలోచనలు సక్రమంగా నడవడం, సమాచారణ సేకరణ, సేకరించిన సమాచారాన్ని సరిగ్గా విశ్లేషించడం, అందరికన్నా భిన్నంగా ఆలోచించడం ఇవన్నీ టెక్నాలజీలో ముందడుగు వేయడానికి ఉపయోగపడ్తాయి. రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది టెక్నాలజీ. దాన్ని దుర్వినియోగం చేస్తే పర్యవసానాలూ తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, తస్మాత్‌ జాగ్రత్త.

మరిన్ని వ్యాసాలు

సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం
స్వియ సంగీతంలో ఘంటసాల గీతాలు.
స్వియ సంగీతంలో ఘంటసాల గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు