గ్యాడ్జెట్స్‌తో రేడియేషన్‌ - బీ కేర్‌ఫుల్‌ - ..

be carefull

మార్కెట్‌లోకి కొత్త గ్యాడ్జెట్‌ వచ్చిందంటే, దాన్ని మన ఖాతాలో వేసేసుకోవాల్సిందేనన్న 'కసి'తో ఉంటారు కొందరు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అని పెద్దలు ఊరకే అన్లేదు. కొత్త ఫోన్‌ మోడల్‌ దిగినా, ఇంకోదైనా గ్యాడ్జెట్‌ వచ్చిందన్నా అది మన చేతికి వస్తేనేగానీ తృప్తి ఉండదు. ఇంకెవరూ దాన్ని ముందుగా వాడకూడదనుకునేవారు మన చుట్టూనే ఎందరో కన్పిస్తారు. అయితే మార్కెట్‌లోకి కొత్త ప్రోడక్ట్‌ వచ్చేయగానే దానీ మీద ఎగబడిపోవడం అన్ని వేళలా మంచిది కాదు. ధర దగ్గర్నుంచి, దాని మన్నిక దాకా అన్ని విషయాల్లోనూ ఈ తొందర 'చేటు'ని తీసుకొస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందులో ముఖ్యమైన విషయమేమిటంటే రేడియేషన్‌. స్మార్ట్‌ యుగంలో రేడియేషన్‌ చాలా చిన్న విషయమైపోయింది. కానీ అదే అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ విస్మరిస్తుండడం దురదృష్టకరంగా అభివర్ణిస్తుంటారు నిపుణులు. 
ఏ ఫోన్‌ అయినా దాన్నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తుంటుంది.

ముఖ్యంగా పసిపిల్లలపైనా, వృద్ధులపైనా ఈ ప్రభావం ఎక్కువ. స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ కూడా స్మార్ట్‌ ఫోన్ల తరహాలోనే రేడియేషన్‌ని విడుదల చేస్తాయి. హార్ట్‌ ఫంక్షనింగ్‌ దగ్గర్నుంచి, బ్లడ్‌ టెస్ట్‌ల దాకా స్మార్ట్‌ మొబైల్స్‌ని వాడే సాంకేతికత అందుబాటులోకి వచ్చేస్తోంది. వీటి వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు సంగతెలా ఉన్నా కీడు గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం ఉందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉంటాయ్‌. కానీ వాటిని మనం ఇప్పుడు లెక్క చేయడంలేదు. భవిష్యత్తులో మాత్రం ఇది చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుందట. అందుకే ఏ గ్యాడ్జెట్‌ని కొత్తగా మీరు కొనుగోలు చేయాలన్నా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు స్మార్ట్‌ ఫోన్‌ని ఎలా ఛార్జ్‌ చేయాలి, ఏ కండిషన్స్‌లో ఉపయోగించకూడదు వంటివి తెలుసుకోవడం తప్పనిసరి. అతి వేడిమికి గాడ్జెట్స్‌ ఎక్స్‌పోజ్‌ అయితే రేడియేషన్‌ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేడి ప్రదేశాల్లో గ్యాడ్జెట్స్‌ ఉపయోగించడం ప్రమాదకరం అని గుర్తించి, దాని వినియోగంపై ఓ అవగాహనతో వ్యవహరించాలి. అలాగే మిగతా గ్యాడ్జెట్స్‌ కూడా.

స్మార్ట్‌ ఫోన్‌ని చెవి దగ్గర పెట్టుకుని ఎక్కువ సేపు అలాగే మాట్లాడకూడదనే హెచ్చరికలు ఎన్నున్నా వాటిని మనం పట్టించుకోవడంలేదు. అయితే ఇది చాలా కీలకమైన అంశం. హెడ్‌ ఫోన్స్‌తో కొంతవరకు రేడియేషన్‌ ముప్పు తప్పుతుంది. హెచ్చరికల్ని బేఖాతరు చేయడమంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే. ఏదైనా మన మంచికే కాబట్టి హెచ్చరికల్ని పాటిస్తే రేడియేషన్‌ ముప్పు నుంచి తప్పించుకోగలగుతాం. కాబట్టి రేడియేషన్‌తో బీ కేర్‌ఫుల్‌. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి