గ్యాడ్జెట్స్‌ ఎంపిక ఎలా? - ..

How to buy gadgets

మార్కెట్‌లోకి కుప్పలు తెప్పలుగా గ్యాడ్జెట్స్‌ వచ్చేస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక ఈ గ్యాడ్జెట్ల ప్రభంజనం గురించిన చర్చ ప్రపంచమంతా జరుగుతోంది. ఫలానా గ్యాడ్జెట్‌ ఉందా? లేదా? అనే చర్చ ముఖ్యంగా యూత్‌లో ఎక్కువగా చూస్తున్నాం. నీ దగ్గర ఆ గ్యాడ్జెట్‌ ఉందా, భలే గ్రేట్‌ రా నువ్వు! అనే ప్రశంసలు, అది లేకపోతే 'అది కూడా లేదా?' అనే చీదరింపులు మామూలే. కానీ ఏ గ్యాడ్జెట్‌ సొంతం చేసుకోవాలనుకున్నా, ముందు అది మనకెంతవరకు అవసరం? అనేది చూసుకోవాలి. ఖరీదైన మొబైల్‌ ఫోన్‌ నుంచి బ్లూ టూత్‌ వరకు దేన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వినియోగించడం అనేది ఓ ఆర్ట్‌. తక్కువ ఖరీదులో దొరికేస్తున్నాయ్‌ కదా అని అనవసరమైన గ్యాడ్జెట్స్‌ని కొనుక్కోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. వీఆర్‌ (వర్చ్యువల్‌ రియాలిటీ) గాడ్జెట్స్‌, హెల్త్‌ గ్యాడ్జెట్స్‌, ఇంకేవేవో మార్కెట్‌లో కొత్తగా కన్పిస్తూ ఊరించేస్తోంటే అటువైపు ఓ లుక్కేయకుండా ఉండలేం. కానీ గ్యాడ్జెట్ల ఎంపిక కూడా ఓ ఆర్ట్‌. ఆ గ్యాడ్జెట్‌ గురించి పూర్తిగా తెలుసుకుని, ఆ తర్వాత ఆ గ్యాడ్జెట్‌ని సొంతం చేసుకుంటే మీరు ఆ గ్యాడ్జెట్‌కి హీరో అవుతారు. లేదంటే, దాంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఆ గ్యాడ్జెట్‌ కలిగి ఉండడం వల్ల వచ్చే హీరో ఇమేజ్‌ని వెంటనే కోల్పోవడమేగాక అభాసుపాలయ్యే ప్రమాదముంది. 

ముఖ్యంగా ఇలాంటి గ్యాడ్జెట్స్‌ ఆన్‌లైన్‌లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. గ్యాడ్జెట్స్‌ మాత్రమే కాదు మొబైల్‌ ఫోన్లు అయినా, ఇతర యాక్సెసరీస్‌ అయినా నెట్టింట్లో సులభంగా దొరికేస్తున్నాయి. ఆకర్షణీయంగా వెబ్‌సైట్‌లో 'ఐటమ్‌' కన్పించగానే క్లిక్‌ చేసేసి, డబ్బులు చెల్లించేసి, తీరా ఆ వస్తువు ఇంటికొచ్చాక పనిచెయ్యకపోతే రోదించేకన్నా దాన్ని ఎవరైనా ఇంతకుముందు బుక్‌ చేశారా? వాడారా? దాని పనితీరు ఎలా ఉంది? అనేవి ఆలోచించుకోవడం మేలు. లేదంటే నిత్యం వార్తల్లో చూస్తున్నాం కదా, ఖరీదైన మొబైల్‌ ఫోన్‌ బుక్‌ చేస్తే, సబ్బు ముక్క, రాతి పలక ఇంటికి రావడం. అలాంటి చేదు అనుభవం మీకూ ఎదురవ్వొచ్చు. ఇది కాకుండా అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే పాటలు వినడానికో, అవి చూడటానికో ఉపయోగించే యాక్సెసరీస్‌ మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. కంటి సమస్యలు, వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్రాండెడ్‌ ఉపకరణాలన్నిటిపైనా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలుంటాయి. అవన్నీ చదువుకున్నాకే వాటిని బుక్‌ చేయడం మంచిది. గ్యాడ్జెట్‌ కావొచ్చు, యాక్సెసరీస్‌ కావొచ్చు, స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు కావొచ్చు, ఇవి సరదాని తెచ్చినా తేకపోయినా ఫర్లేదుగానీ, వీటి కారణంగా ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయంటే 'ఒక్కసారి ఆగి, ఆలోచించి, ముందుకు వెళ్ళడం' మంచిది కదా!

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి