మేష రాశి : ఈ వారం మొత్తం మీద నూతన ఆలోచనలకు అలాగే నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగానైనా పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన పెట్టుబడులకు అవకాహశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దలను సంప్రదించుట సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయాల్లో తగిన శ్రద్ధలు తీసుకోవడం మంచిది. సమయానికి భోజనం చేయుట మంచిది.
వృషభ రాశి : ఈవారం మొత్తం మీద ఆరంభంలో పనులను పూర్తిచేయుటకు ఇబ్బందిని ఎదుర్కొంటారు. వారం మధ్యనుండి కొంత సానుకూల ఫలితాలు ఏర్పడుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో కాస్త వేచిచూసే ధోరణి మంచిది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం మేలుచేస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో గతంలో చేపట్టిన ప్రయత్నాలకు ఈ వారం ఆశించిన మేర ఫలితాలు రావడం సంతోషకరమైన విషయం. సోదరులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. మధ్యవర్తిత్వాలకు అవకాశం ఇవ్వకపోవడం వలన మేలుజరుగుతుంది. మానసికంగా ఇబ్బందులు తప్పకపోవచ్చును.
మిథున రాశి : ఈ వారం మొత్తం మీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో సభ్యులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. కాస్త విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చును. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు చేపడుతారు అలాగే సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.
కర్కాటక రాశి : ఈ వారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి.. విదేశాలలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడేలా మీ ప్రయత్నాలు చేయుట సూచన. అధికారుల నుండి రావాల్సిన సహకారం లభిస్తుంది. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది అలాగే మిత్రులతో మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇనుము, వెండి మొదలైన వ్యాపారాలు చేసే వారికి నూతన అవకాశాలు లభిస్తాయి, వాటిని అందిపుచ్చుకొనేలా నిర్ణయాలు ఉండుట మంచిది.
సింహ రాశి : ఈ వారంమొత్తం మీద మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా చివరకు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలను పూర్తిచేసే విధంగా ప్రణాళిక కలిగి ఉండుట , అలాగే మిత్రుల సహకారం తీసుకోవడం వలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. సంతానం విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వేచిచూసే ధోరణి మంచిది. రావాల్సిన ధనం వారం చివరలో చేతికి రావడం ఊరట చెందు అంశం. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.
కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం సూచన. కుటుంబపరమైన విషయాల్లో మీరు తీసుకొనే నిర్ణయాలను కుటుంబసభ్యులు కొంతమేర వ్యతిరేకించే అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాలలో అనుకోని ఖర్చులకు అలాగే చిన్న చిన్న ఇబ్బందులకు ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో వారాం చివరలో ఆశించిన మేర లబ్దిని పొందుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశాలలో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. సంతానం వలన నలుగురిలో ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది.
తులా రాశి : ఈవారం మొత్తం మీద బంధువులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన ఆర్థికపరమైన అంశాల విషయాల్లో సర్దుబాటువిధానం కలిగి ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. మీ మాటతీరు మూలన ఊహించని విధంగా ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. కొంతకాలంగా మీకు రావల్సిన మొండిబకాయిలు వసూలు అయ్యేఆస్కారం ఉంది. సంతానం విషయాల్లో ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. ఇస్టమైన వ్యక్తుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని కొన్ని విషయాల్లో అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది.
వృశ్చిక రాశి : ఈ వారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులను పొందుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో సాధ్యమైనంత వరకు వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం సూచన. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనను వాయిదా వేయుట సూచన. పూర్వీకుల నుండి వచ్చిన ఆస్థులను కాపాడుకొనే ప్రయత్నంలో మీరు చేసే ప్రయత్నం సత్ఫాలితాలను ఇస్తుంది. మీ మాటతీరు అలాగే ఆలోచన కొంతమందికి నచ్చకపోవచ్చును. చిననాటి మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది.
ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. చిన్న చిన్న విషయాలకే వారం ఆరంభంలో ఆందోళన చెందుతారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాల విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. విదేశీప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది, ఉన్నతవిద్యాఅవకాశాలు మెరుగుపడతాయి. స్వల్పఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం కలదు. సరైనశ్రద్ద వహించుట సూచన.
మకర రాశి : ఈ వారం మొత్తం మీద ఏదైనా నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం సూచన. చేపట్టిన పనుల విషయాల్లో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పొందుతారు, అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో సాద్యమైనంత వరకు సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులకు నచ్చకపోవచ్చును, సభ్యులనుండి వ్యతిరేకత రావోచ్చును. ఉద్యోగంలో మీరు తీసుకొనే నిర్ణయాలు నూతన అవకాశాలకు మార్గదర్శనమ్ లభించుటకు అవకాశం ఉంది. నూతన వాహనములను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, ఈ రంగంలో అనుభవజ్ఞుల సూచనలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం.
కుంభ రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను పెద్దలతో పంచుకొనే ఆస్కారం కలదు. వారి సూచనల మేర ముందుకు వెళ్ళుట ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చులు అయ్యే ఆస్కారం కలదు. ఊహించని విధంగా ప్రయాణాలు వాయిదాపడే ఆస్కారం కలదు. మీ అనుకున్న వారితో చర్చలకు వెళ్లకండి, లేకపోతే అనవసరమైన మనస్పర్థలకు మీరే కారణం అవుతారు, జాగ్రత్త. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుతుంది. అధికారుల సూచనలను, అలాగే తోటివారి సహకారం తీసుకొనే ప్రయత్నం మంచిది. మిత్రులతో సమయం గడుపుతారు.
మీన రాశి : ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. వాహనముల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. కుటుంబంలో సభ్యులతో చర్చలకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు వాయిదాపడే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మధ్యవర్తిత్వం పనికిరాదు. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వకపోవచ్చును. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. గతంలో చేసిన విదేశీప్రయత్నాలు సానుకూల పడుతాయి.
..