చందనం, మెహందీ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే మినప్పిండితో పాటు కాస్త పసుపు, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ పాలను కలిపి పేస్ట్‌లా తయారయ్యాక ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మీ ముఖం ప్రకాశిస్తుంది. ఇంకా ఆలివ్ ఆయిల్‌తో పంచదారను కలిపి మీ అరచేతిలో రుద్దుకుని కడిగేస్తే మీ చేతులు మృదువుగా కోమలంగా తయారవుతాయి. ఇంకా బంగాళాదుంప రసాన్ని ముఖానికి పట్టిస్తే.. సూర్యకిరణాలు ద్వారా ఏర్పడే నలుపు దనంతో పాటు కంటి వలయాలు మాయమవుతాయి.
ఇక రెండు స్పూన్ల ముల్లంగి రసం, రెండు టీస్పూన్ల మజ్జిగను చేర్చి ముఖానికి పట్టించి గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. కొబ్బరి నీళ్లు ముఖానికి ఆరునెలలపాటు రాస్తే మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.
బాగా పుల్ల బడిన మజ్జిగను ముఖానికి పట్టింది 15 నిమిషాల తర్వాత వేడినీటిలో కడిగేస్తే మీ చర్మం ప్రకాశవంతం అవుతుంది. తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాస్తే మృదువుగా తయారవుతాయి. పెరుగుతో పాటు సున్నిపిండిని కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు చెబుతున్నారు.