మహిళ లేకపోతే - భమిడిపాటి ఫణిబాబు

womens day artical

మన దేశంలో ఓ వేలం వెర్రి ఉంది. పాశ్చాత్య దేశాల సంస్కృతిని గుడ్డిగా అనుసరించేయడం.. ప్రతీదానికీ ఓ “ దినం “ అనడం, మనవాళ్ళుకూడా  దాన్నే   cntrl C * cntrl V   చేసేయడం.. లేకపోతే మొన్న జరిగిన “ మహిళా దినోత్సవానికి “ అర్ధం పర్ధం ఉందా?  ఏదైనా మర్చిపోతే గుర్తుచేసుకోడానికి , అలాటివి చేయాలికానీ, అసలు మర్చిపోవడమే లేకుండా, నిరంతరం, మహిళల ఊపిరే మన శ్వాసగా  బతికే మనకి , ప్రత్యేకంగా ఓ దినం ఏర్పరుచుకోవడంలో అర్ధం లేదు. . ఊపిరి పీల్చుకోవడం మానగలమా?

వచ్చిన గొడవేమిటంటే, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి చాలామందికి నామోషీగా ఉంటుంది..  అమ్మ గర్భంలోంచి పుట్టి,  పెళ్ళయేదాకా అమ్మ కొంగే పట్టుకుని, ఆ తరవాత  భార్య కొంగు పట్టుకున్నా, మొత్తానికి మహిళే కదా.. పసిపిల్లలకి తిండి పెట్టి, చదివించి , పెద్దచేసేది అమ్మే కదా. మగాళ్ళు, సంపాదించి పెట్టేస్తే సరిపోతుందనే అపోహలోనే ఉంటారు.. ఉద్యోగం పేరుచెప్పి , అక్కడికేదో అలిసిపోయినట్టుగా పోజెట్టేస్తే చాలనుకుంటారు. పిల్లలు తండ్రితో గడిపే టైమే తక్కువ. ప్రతీదానికీ అమ్మే కావాలి. ఏదైనా కావల్సొస్తే అమ్మ సిఫార్సే కావాలి…. 

మహిళ సహకారం లేనిదే  ఏ పనీ జరగదన్నది  జగమెరిగిన సత్యం. “ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నంత “  పచ్చి నిజం.  ఏ విషయం తీసికోండి, మగాళ్ళు వీధిన పడకుండా, వీరి మర్యాదకు లోటులేకుండా ఇంటిగౌరవం కాపాడేది మహిళే. ఉదాహరణకి, టైముకాని టైములో ఇంటికి ఏ guest  అయినా వచ్చాడంటే, ఆ ఇంటి ఇల్లాలే అడిగేది “ అన్నయ్య గారూ.. కాళ్ళు కడుక్కుని భోజనానికి లేవండీ..” అని. అకస్మాత్తుగా , అన్ని వంటకాలూ ఎలా arrange  చేస్తుందో ఆవిడకే తెలియాలి. డొక్కా సీతమ్మ గారిలా , పచ్చగడ్డితో పచ్చడి చేసి, మెప్పించినట్టు, ఇంట్లో ఏదుంటే దానితో, షడ్రసోపేతంగా, వండిపెట్టడం, మన “ అన్నపూర్ణ “ లకే చెందింది. ఇంటికొచ్చిన  ముత్తైదువకి  వెళ్ళేటప్పుడు బొట్టుపెట్టి , చేతిలో ఏదో పెట్టడానిక్కూడా, ఏదో ఒకటి సృష్టించగల నేర్పు కూడా ఇంటి ఇల్లాలిదే.

ఏదైనా మనకు నచ్చితే… “ ఫలానా రంగు బావుంది”  “ ఫలానా ఇల్లు బావుంది “ ఫలానా ఊరు బావుంది “ అంటాము కానీ, “ ఫలానా రంగు, ఇల్లు, ఊరు.. బావుంటాడు “ అంటామా?  ఇక్కడకూడా స్త్రీలింగమే కదా. బయటివాళ్ళ భాషలో ఇలాటి వాడుకలు లేకఓవడం మూలాన, బహుశా   వాళ్ళకి కొత్తగా కనిపించొచ్చేమో.  అందుకే ఒక్కరోజైనా గుర్తుచేసికుందామని ఈ “ మహిళా దినోత్సవాలు “ మొదలుపెట్టారేమో.. మనం వాళ్ళకి చెప్పాలి.. “ ఓరి బడుధ్ధాయిలూ.. మా సంస్కృతి ప్రకారం ప్రపంచమంతా స్త్రీస్వరూపాలేరా అని.  అంతేనే కానీ, ఏదో సంవత్సరానికి ఓ రోజు, పెద్ద పెద్ద చర్చలూ, గ్రీటింగ్సూ , గిఫ్టులతో  చేతులు దులిపేసుకుంటే సరిపోదు.

కూతురికో, కోడలికో ప్రసవసమయంలో అమ్మ/ అత్తగారు మాత్రమే కావాలి. ‘ మామగారు/తండ్రి  కావాలని ఎవరూ అడగరు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే “ మా ఇంటి మహలక్ష్మి “ అంటారు కానీ, మగపిల్లలున్నారు కదా అని “ మా ఇంటి కుబేరుడు “ అనడం ఎక్కడైనా విన్నామా?  “ ఇంటికి దీపం ఇల్లాలు “ అంటారు కానీ, ఇంకోలా విన్నామా ఎప్పుడైనా? అన్నీ తెలిసి కూడా, ఆడవారిని  take it for granted  గా తీసేసుకుంటాం. వాళ్ళు  లేనప్పుడే తెలిసొస్తుంది.  ఏ పురిటికో భార్య వెళ్ళిందా, ఇంటి మగాడికి అప్పుడు గుర్తొస్తుంది.. ‘అరే తనుంటేనా” అని. అలాగే దురదృష్టవశాత్తూ భార్యా వియోగం కలిగితే, మగాడిని పట్టించుకునేవారూ ఎక్కడో అక్కడక్కడ ఉంటారు. అదే ఇల్లాలైతే, ఈయన గారి సూకరాలన్నీ భరిస్తూ సేవలు చేస్తుంది..

ఈరోజుల్లో భర్తకి  చేదోడువాదోడుగా ఉంటూ, తనూ ఇంటిపనులన్నీ చూసుకుంటూ, ఉద్యోగానికి కూడా వెళ్ళగలుగుతోంది. ఆవిడ కూడా సంపాదించబట్టే కదా, EMI  లు నిరాటంకంగా కట్టుకోగలుగుతున్నారూ?  వాళ్ళేమీ మణులూ, మాణిక్యాలూ అడగడం లేదు. Just  ఓ గుర్తింపు.. తను చేసిన వంట బావుందనో, తను కట్టిన చీర బావుందనో  ఒక్కమాటంటే, కొండెక్కినంత సంతోషపడే అల్ప సంతోషులు.

ఇలా ప్రతీ క్షణం మన జీవితాల్లో మమేకమయిపోయి,  indispensable  గా ఉండే మహిళలకి  ఓరోజు అని ప్రత్యేకించడం అంటే, మనం ఒక్కరోజు ఊపిరితీసికోవడం మానేసినట్టన్నమాట..

దేశం లోని మహిళలందరికీ నమస్సులు. అసలు మీరే లేకపోతే, మగాళ్ళ అస్థిత్వం ఎక్కడా?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి