17-03-2017 నుండి 23-03-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబంలో చర్చలకు అవకాశం ఇవ్వకండి. సాధ్యమైనంత వరకు వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును. మిత్రులతో కలిసి గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు సమయం పడుతుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి రావడం ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట మంచిది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

 

 వృషభ రాశి : ఈవారం ఆలోచనలో కొంత సందిగ్దత ఉంటుంది. పెద్దలతో అధికభాగం చర్చాపరమైన విషయాలకు కేటయించే అవకాశం ఉంది. ఉద్యోగపరమైన విషయాల్లో అధికారులకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయుట ఉత్తమం. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం పనికిరాదు. కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రలు వెళ్ళుటకు ఆస్కారం కలదు. వాహనముల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. విదేశీప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

 



మిథున రాశి :ఈవారం నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. చిననాటి మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇస్టపడుతారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధిస్తాయి. కుటుంబంలో అనుకోని మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. జీవితభగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాలగొంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది.


కర్కాటక రాశి : ఈవారం మీరు పెద్దలతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. సమయాన్ని వృధాచేయుట వలన నస్టపోయే ఆస్కారం కలదు. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట సూచన. సోదరులతో చర్చలు చేస్తారు. ప్రయాణాలు వాయిదావేయుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది.

 



 సింహ రాశి : ఈవారం మీరు మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆసక్తిని చూపిస్తారు. సంతానంకు సమయాన్ని కేటయించే ప్రయత్నం చేయుట మంచిది. కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనలను పాటించుట ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. ముఖ్యంగా స్త్రీ పరమైన విషయాల్లో పెద్దలనుండి మాటపడవలసి వస్తుంది. ఆరోగ్యంవిషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతన వాహనములను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

 

 

కన్యా రాశి :   ఈవారం మీరు చిన్న చిన్న విషయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో మీకంటూ ఒక స్పష్టమైన విధానం కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన.



తులా రాశి : ఈవారం మీరు ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మీ నిర్ణయాలు కొంతమందికి నచ్చక పోవచ్చును. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సోదరులతో కలిసి కీలకమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో చాలాజాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళుట మేలు.

 



వృశ్చిక రాశి : ఈవారం మీరు సమయాన్ని అధికంగా చర్చాపరమైన విషయాలకు ఇస్తారు. బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనములు కొనుగోలు చేయాలనే మీ ఆలోచన అనుకోకుండా వాయిదా పడే ఆస్కారం కలదు. మిత్రులను కలుస్తారు.


ధనస్సు రాశి ఈవారం నూతన నిర్ణయాలు మొదలు పెట్టాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది, మిత్రుల సహకారంతో వాటిని పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆత్మీయుల నుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో భాద్యతలు పెరుగుటకు ఆస్కారం కలదు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ప్రయాణాలు వాయిదా పడుతాయి.
 

 

మకర రాశి : ఈవారం అధికారులతో చర్చలు చేయునపుడు సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. మానసికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తాయి, దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. విదేశీప్రయత్నాలు కొనసాగించే ప్రయత్నం చేయుట మేలు. ఆత్మీయులతో కలిసి నూతన చర్చలు చేయుటకు ఆస్కారం కలదు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు.

 


కుంభ రాశి :  ఈవారం  మొత్తం మీద మీరు మొదట్లో కొంత నిరాశను పొందిన రానురాను చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో కుటుంబసభ్యులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కొంత శ్రమించుట ద్వారా సానుకూల ఫలితాలు పొందుతారు. విదేశాలలో ఉన్న మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. జీవితభాగస్వామితో స్వల్ప మనస్పర్థలు తప్పక పోవచ్చును, జాగ్రత్త.

 


మీన రాశి : ఈవారం చిన్న చిన్న విషయాలను సైతం పట్టించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ముఖ్యంగా పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడేలా నిర్ణయాలు ఉండుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలుచేస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్న మిత్రులతో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. కోపాన్ని తగ్గించుకోవడం వలన లబ్దిని పొందుతారు.

..

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు