సత్య సాయి భోధనలు - హైమవతి ఆదూరి

satya sai baba information

అది కార్తీకమాసం, విపరీతమైన చలి, ఇళ్ళలోనే అంతా చలికి వణికేవారు.రాత్రి ఎనిమిదైంది, ఇంతలో ఒక చిన్న బాలుడు సత్యనారాయణరాజు ఇంటిముందున్న అరుగుపై కూర్చుని చలికి వణుకుతున్నాడు, వాడి వంటిమీద  చొక్కాలేదు, క్రింద నిక్కరూలేదు.కేవల ఒక గోచీ మాత్రమే ఉంది. ఎనిమిదేళ్ళ సత్యనారాయణరాజు కిటికీలోంచీ చూశాడు ఆదృశ్యాన్ని.వెంటనే లోనికివెళ్ళి తన కొత్త చొక్కా లాగు తెచ్చి వానికి ఇచ్చి ధరించమని కోరాడు. వాడు అవివేసుకుని చలికొంత తీరినందున ఆనందంగా నవ్వుతూ వెళ్ళాడు.తాత, తండ్రి, అన్నలూ ఇదంతా చూశారు. తండ్రి పట్టరాని కోపంతో " ఏం?రాజూ! అంత గొప్పవాడివయ్యావా?నీకున్న రెండుజతల్లో ఒకటి ఇచ్చే స్తే  ఇహ యాడాదంతా ఏమి  వేసుకుంటావు?  బడికి ఎలావెళతావు  ?" అని నిలదీయగా " తప్పు మన్నించండి.  నేను కష్టపడే వారిని చూస్తే ఉండలేను. మిమ్మల్ని మరో జత అడక్కుండానే  ఉన్న ఒక్క జతతో ఈ ఏడాదంతా గడిపేస్తాను.  " అనిచెప్పి, ఆసంవత్సరమంతా ,సాయం కాలం బడి నుండీరాగానే తన చొక్క నిక్కరూ విడిచి తుండు గుడ్డ  కట్టుకుని , వాటిని ఉతు క్కుని, ఆరాక చెంబులో పొయ్యిలోని నిప్పులు తల్లినడిగి పోయించు కుని దాంతో చెంబిస్త్రీ చేసుకుని మరునాడు విస్త్రీ బట్టలతోనే బడి కెళ్ళేవాడు.రెండుజతల బట్టలున్న వారికంటే శుభ్రంగా . బళ్ళో  పంతుళ్ళంతా   సత్యనారాయణరాజు శుభ్రమైన  విస్త్రీబట్టలు చూసి మెచ్చుకునే వారు. ఆ నాటిఆబాలుడు  సత్యనారాయణరాజే ఆ తర్వాత సత్యసాయిబాబాగా' ఎన్నోవేవేల కుటుంబాలను ఆదుకుని అన్నదానం ,వస్త్రదానాలు చేసి ఆదర్శమూర్తిగా నిలిచారు.

తన ఖాళీ సంచీ నుండి ఎవరికి ఏమి కావాలంటే అవన్నీ తీసి ఇచ్చేవారు. ఇవన్నీ నీకెవరు ఇస్తున్నారని అడిగిన వారికి , వారిని సందిగ్ధంలో పడవేయడం ఇష్టంలేక ,రాజు 'మాఇంటి దేవత ఇస్తున్నదని' చెప్పేవారు .  

పుట్టపర్తికి దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సత్యనారాయణ ప్రాథమిక విద్య సాగింది.  తరువాత ఉరవ కొండ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి వరకూ చదివాడు.చిన్న వయసులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు.స్వయంగా పాఠ శాల వార్షికోత్సవానికి ' చెప్పినట్లు  చేస్తారా? ' అనే నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించి, దానిలోని ప్రధానపాత్రఐన ' కృష్ణ ' అ   బాలునిపాత్ర పోషించి,  బహుమతేకాక అందరి ప్రశంసలూ పొందిన సత్యనారాయన రాజు ప్రతిభను  ఆరోజుల్లోనే అంతా ప్రశంసించారు.
నీటిసేవ.-  ఉరవకొండలో చదివేరోజుల్లో ఊరికి 3మైళ్లదూరంలో ఉన్న బావినుండీ కావిడితో ఇంటి అవసరాల కేకాక ఊరిలోని ముసలి ,అసహాయ కుటుంబాలవారికీ కావడితో నీళ్ళు అందించి ఆదుకున్నాడా బాలుడు.  ఆతర్వాత బాబాగా అనంతపూర్ నుంచీ మహబూబ్ నగర్ వరకూ ఇంకా నీటి ఎద్దడి ఉన్నప్రాతాలన్నింటికీ ' సత్యసాయి జలధార -'పేరుతో సాగు, త్రాగు నీరు అందించారు, ఇప్పటి కీ అందుతూనే ఉంది ఆ సేవ.

ఆనాడే పుష్పగిరి తిరునాళ్ళు  జరుగుతున్నపుడు స్కౌట్ వారికి నాయకుడుగా నిలిచి ఆ తిరు నాళ్ళులో సేవలు అందించారు. పాదరక్షల సేవ, ముదుసలులకు సామాను మోసేసేవ, తప్పి పో యిన పసిపిల్లలను తల్లిదండ్రులవద్దకు చేర్చేసేవ చేశాడు సత్యనారాయణా రాజు. ఆ తర్వాత తన సేవాసంస్థలద్వారా సేవా కార్య క్రమాలూ కోకొల్లలుగా జరిపించారు, జరుగుతూనే ఉన్నాయి నేటికీ.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి