వేసవి కాలంలో వడదెబ్బను నివారించేందుకు మార్గాలు - మానస

how to avoid sunstroke

వడదెబ్బ చాలా ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు మరియు దీనికి వెంటనే చికిత్స అందించాలి. ఇది మాత్రమె కాకుండా వేడి సంబంధిత వ్యాధులు కలుగుటకు అసంఖ్యక మార్గాలు ఉన్నాయి. దీని నివారణ కోసం, వడదెబ్బ కలగకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వీటి పైన పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి. ఎండలో భయటకి వెళ్ళినపుడు చల్లటి ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి. వేసవికాలంలో ఆల్కహాల్, సిగరెట్, కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండండి. డోకులు, వాంతులు, అలసట, తలనొప్పి వంటివి రాకుండా చూసుకోవాలి. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వలన వడ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ వడదెబ్బల వలన భౌతికంగా మాత్రమె కాకుండా, శరీరంలో వివిధ రకాల అవయవాలు మరియు అవయవ వ్యవస్థలు, వాటి విధులు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ ప్రమాదానికి గురవుతుంది.

ఇతర ఉష్ణ అనారోగ్యం (హైపెర్థెర్మియా రూపాలు) వేడి తిమ్మిరి మరియు వేడి అలసటలు కలుగుతాయి. చిన్న పిల్లలో మాత్రమె కాకుండా వయసు మీరిన వాళ్ళలో గుండెపోటు వంటి వాటిని కుడా కలిగిస్తుంది. ఇలాంటి సమయాల్లో వెంటనే వైద్యులను సంప్రదించటం చాలా మంచిది. కావున ఎక్కువ సమయం ఎండకు బహిర్గతం అవటం వలన శరీర విధులలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందువలన ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకుండా జాగ్రత్త పడండి. శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లేదా అంత కన్నా ఎక్కువ అవటాన్ని వడదెబ్బ గురవటం అంటారు. ఈ సమయంలో అలసట, శరీరం నుండి వేడి భయటకి రావటం మాత్రమె కాకుండా ఎక్కువగా మీ శరీరం డీ-హైడ్రేషన్'కు గురవుతుంది. ఈ సమయంలో డోకులు, వాంతులు, అలసట, బలహీనంగా అవటం, తలనొప్పి, కండరాల తిమ్మిరులు మరియు కళ్ళు తిరగటం (మైకం) వంటివి బహిర్గత లక్షణాలుగా కనపడతాయి.

వడదెబ్బ నివారణ:

*వేసవికాలంలో భయటకి వెళ్ళటానికి ముందు మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. వేసవి కాలంలో డీ-హైడ్రేషన్ అధికంగా ఉంటుంది కావున వాటర్ బాటిల్'ను మీతో తీసుకెళ్ళండి. వేసవికాలంలో నీరు శరీరాన్ని చల్లగా మారుస్తుంది.

*వేసవి కాలంలో ఎక్కువ సమయం అతడు/ ఆమె చల్లటి ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి.

*ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.

*ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

*వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.

*వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి

*వేసవికాలంలో భయటకి వెళ్ళే అవసరం ఉంటె ఉదయనా లేదా సాయంత్రం సమయాల్లో వెళ్ళటానికి ప్రణాలికలను రూపొందించుకొంది.

*వేసవికాలంలో మీ శరీర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గమనించినట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణులను సందర్శించి సరైన జాగ్రత్తలను తీసుకోండి.

*వేడి వాతవరణంలో భౌతిక కార్యకలాపాలు చేయటం అంత మంచిది కాదు. ఒకవేళ మీరు ఎండలో భౌతిక కార్యకలాపాలను చేసినట్లయితే ఎక్కువ నీటిని లేదా శక్తిని అందించే ద్రావనాలను త్రాగండి.

*సూర్యరశ్మికి బహిర్గతమైనపుడు సోడియం వంటి ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను త్రాగటం చాలా మంచిది.

*వేసవికాలంలో డోకులు, వాంతులు, అలసట, బలహీనంగా కనిపించటం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు బహిర్గతమైన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేపించుకోవటం చాలా మంచిది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు