మరీ అంత 'సోషల్‌' అయిపోవద్దు.! - ..

over depending on social network

సోషల్‌ మీడియాలో సెల్ఫీ పెట్టడం ఓ ఆర్ట్‌. అలాగే సోషల్‌ మీడియాలో నచ్చిన కామెంట్‌ పెట్టడం ఓ సరదా. అంతే కాదు, సోషల్‌ మీడియాలో ఏదన్నా అంశం కనిపిస్తే దానిపై స్పందించడం ఓ అలవాటు. సోషల్‌ మీడియాకి ప్రధానంగా ఎట్రాక్ట్‌ అవుతున్నవారిలో యువత ఎక్కువ. నిత్యం యువత సోషల్‌ మీడియాతో కనెక్ట్‌ అయ్యే ఉంటోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కనెక్ట్‌ అవడం కాదు, పూర్తిగా సోషల్‌ మీడియాలోనే యువత మునిగి తేలుతోంది. మన దేశంలో ఇది చాలా ఎక్కువగా ఉందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచమంతా మన గుప్పిట్లోనే ఉంటోందనే మాటలో వాస్తవం ఎలా ఉన్నా, అన్ని సందర్భాల్లోనూ సోషల్‌ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం ఏమంత క్షేమకరం కాదని కూడా యువత గుర్తుంచుకోవాలి.

సెల్ఫీ దగ్గర్నుంచి, మీరు ఏ అంశమ్మీద అయినా స్పందించాలనుకునన్నా ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. దేశంలో చాలా ఘటనల్లో సోషల్‌ మీడియా టార్గెట్‌ అవుతూ వస్తోంది. ఇక్కడ చేసే కామెంట్స్‌ జైలుకు పంపించేస్తాయని మర్చిపోకూడదు. వర్తమాన రాజకీయాలే కావొచ్చు, ఇంకేవైనా సంఘటనలు కావొచ్చు వాటిపై స్పందించేటప్పుడు అది ఎవరి మనోభావాల్ని అయినా దెబ్బతీస్తుందా? సమాజానికి వ్యతిరేకంగా ఆ స్పందన ఉంటుందా? అని ఆలోచించుకోవడం ముఖ్యం. 

ఇంకో వైపున గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రెండ్స్‌తో కామన్‌గా కొన్ని విషయాలు షేర్‌ చేసుకునేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. ఆ గ్రూప్‌ నుంచి మీరు షేర్‌ చేయాలనుకుంటున్న సమాచారం బయటకు పొక్కితే సమస్యలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. 'సరదా' కోసం వ్యక్తిగత సమాచారం (అందులో ఫొటోలు ఉండొచ్చు, వీడియోలు ఉండొచ్చు) సోషల్‌ మీడియాలో పెడితే, అది తస్కరణకు గురై అడల్ట్స్‌ కంటెంట్‌ ఉన్న వెబ్‌సైట్లలోకి వెళ్ళిపోవడం ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. అలా చేరకూడని చోటకు మన కంటెంట్‌ చేరిపోయిన తరువాత అవమానాలు ఎదుర్కొనక తప్పదు. అయితే మన సమాచారం తస్కరణకు గురైందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే, సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా వ్యక్తిగత ఇమేజ్‌ డ్యామేజ్‌ కాకుండా చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటుగా అందులోని మంచి చెడుల్ని బేరీజు వేసుకుని తదనుగుణంగా వ్యవహరించడం ఉత్తమం. ప్రపంచం స్మార్ట్‌గా మారిపోతోందని సంతోషపడేలోపల, ఆ స్మార్ట్‌నెస్‌లోనూ వైపరీత్యాలు దాగి ఉన్నాయని గుర్తించడం తప్పనిసరి.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి